ఇది కుటుంబాల ప్రెస్ కాన్ఫరెన్స్.. ఇది బేలా భాటియా ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. నేను ఒక మానవ హక్కుల కార్యకర్త, వకీలుగా గత నాలుగైదు రోజులుగా ఇతెనార్‌లో చాలా నిశితంగా పరిశీలించాను. తహకీకాత్ చేశాను. కనపడని వ్యక్తుల కుటుంబాల సభ్యులు 250 నుండి 300మంది దాకా యిక్కడ వున్నారు. వాళ్ళు రెండురోజుల నుంచి యిక్కడ వున్నారు.

ఏ ఒక్కరూ కూడా అక్కడ ఎన్‌కౌంటర్ జరిగింది అని లేదా అక్కడ యూనిఫాంలో వున్న మావోయిస్టులు వున్నారు అని చెప్పలేదు. అందుకని ఎన్‌కౌంటర్ జరిగింది అనడం పూర్తిగా అబద్ధం. వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు.. చెప్పిన దానిలో ఎలాంటి తేడా లేదు. అంటే కొందరు ఒకమాట మరొకరు మరో మాట చెప్పలేదు ..

తమ్ముడు కావచ్చు, భర్త లేదా కొడుకు లేదా కూతురు కావచ్చు వాళ్ళందరూ తునికాకు కోయడానికి ఉదయమే వెళ్లారు.

కొంతమంది తమ యింటికి దగ్గరగా వున్నారు. కొంతమంది దూరంగా ఉన్నారు. కొన్నిసార్లు తునికాకు చెట్లు పొలాల్లో వుంటాయి, పొలాల నుంచి కొంచెం దూరంగా కూడా వుంటాయి. కొన్ని సార్లు కొండల దగ్గర కూడా వుంటాయి. వారి అనుకూలతను బట్టి వెళ్తూంటారు. ఒక్కోసారి అన్నా చెల్లి లేదా ఎవరైనా యిద్దరు లేదా కొన్నిసార్లు కొంత ఎక్కువ మంది కలిసి వెళ్తూంటారు.

కొంత మంది ఆకులు కోయడానికి వెళ్లారు, కొంత మంది వెళ్ళి కోసుకొచ్చి యిళ్లలో మూటలు వేసారు. కొంతమంది అమ్మడానికి వెళ్లారు. కొంతమంది ఎండబెట్టడానికి వెళ్లారు. అప్పుడు ఈ ఘటన జరిగింది. ఒక దగ్గర తునికాకులున్న బస్తా పడి వుంది. తునికాకు కట్టలు పడి వున్నాయి.

అక్కడివారితో మాట్లాడిన తరువాత  మనం నిస్సందేహంగా చెప్పవచ్చు అక్కడ జరిగింది ఏ కోణంలోనూ ఎన్‌కౌంటర్ కాదు. అది తప్పకుండా మనం చెప్పే బూటకపు ఎన్‌కౌంటర్. అంతకంటే ఎక్కువగా అది ఒక నరసంహారం. అది ఒక మారణకాండ.  అది మారణకాండ ఎట్లా?

ఇవాళ 17 మేకి ఎడెస్‌మెట్ట ఘటన జరిగి పదకొండు సంవత్సరాలు అవుతోంది.  2013 మే 17 నాడు ఎడెస్‌మెట్టలో రాత్రి పూట కాల్పులు జరిగాయి. అక్కడ విత్తనాల పండగ జరుగుతోంది. అంతకు ఒక సంవత్సరం ముందు సర్కేగూడలో 2012లో 17 మంది ఆదివాసీలను చంపేసారు. అప్పుడు కూడా వారు విత్తనాల పండగ జరుపుకుంటున్నారు. ఈ రెండు ఘటనల వాస్తవం న్యాయ విచారణ ద్వారా పోలీసులు జరిపిన ఏక పక్ష కాల్పులు అని ఈ నాడు మన ముందు వున్నది. పది సంవత్సరాల తరువాత ఆ వాస్తవం బయటికి వచ్చింది. ఆ వరుసలోనే యిప్పుడు పీడియా మీదకి వచ్చారు. అనేక అంశాల్లో యిది ఒక చారిత్రాత్మక ఘటన

ఇది రాత్రిపూట కాదు పగలు చేసిన నరసంహారం. ఇది చాలా తీవ్రతరమైన విషయం. ఇది ఒక రకమైన మనస్తత్వం, ఒక విశ్వాసం. మేము ఏమైనా చేయగలం. మేం వేల సంఖ్యలో రావచ్చు. మేం ఒక బలగం కాదు రెండు కాదు మూడు నాలుగు అయిదు రకాల బలగాలం (ఫోర్స్) రావచ్చు అనేక పోలీసు స్టేషన్ల నుంచి, అనేక  క్యాంపుల నుంచి, సరిహద్దుల అవతల నుంచి… ఎక్కడినుంచైనా మేం రాగలం, పూర్తి ప్రాంతాన్ని ఆక్రమించగలం .. మిమ్మల్ని పరిగెత్తిస్తూ మీ మీద తూటాల వర్షం కురిపించగలం ..   మీరు ఏం చేయలేరు.. ఇలా జరిగింది పీడియా, ఇతావర్‌లలో.. ఇది చాలా సీరియస్ విషయం

మీరు వీళ్ళని చూడండి.. వీరిలో చాలా మంది తల్లులు వున్నారు.. చాలా మంది తండ్రులు ఉన్నారు.. యితని కొడుకు మరణించాడు. మీరు ఒక్కొక్కరితో మాట్లాడి వాస్తవాలని తెలుసుకోమని కోరుతున్నాను.

యిది పగటి పూట జరిగింది..అతి పెద్ద సంఖ్యలో బలగాలును తీసుకు రావడం ఏం చేయాలో అది చేసేయడం….

ఇందులో చాలా మంది గాయపడ్డారు. వారు పోలీసు తూటాల వల్ల గాయపడ్డారు. వారు ఆసుపత్రిలో వున్నారు. బీజాపూర్ ఆసుపత్రిలో వున్నారు. ఎవరినీ కలవనీయడం లేదు. వాళ్ళు కాకుండా గాయపడినవాళ్లు యింకా వున్నారు. వాళ్ళు గ్రామంలో వున్నారు. నేను అలాంటి ఒక మైనర్ బాలుడిని కలిశాను. వీళ్ళందరూ చూశారు. వీళ్ళందరికి తెలుసు. నేటికీ అతను తన యింట్లో మంచం మీద పడుకుని వున్నాడు. తొడల నుంచి రెండు తూటాలు దూసుకు వెళ్ళాయి .. ఒక తూటా కాలు నుంచి దూసుకు వెళ్లింది … గ్యాంగ్రీన్ అవుతుందేమోనని భయంగా వుంది.. కాలు తీసేస్తారేమోనని భయంగా వుంది. నువ్వు ఆసుపత్రికి ఎందుకు వెళ్ళవు అని అడిగితే నన్ను పోలీసులు పట్టుకుని జైల్లో వేస్తారని భయంగా వుంది అన్నాడు. అతను సాధారణ ఆదివాసీ బాలుడు. తునికాకు కోయడానికి వెళ్ళాడు. ఇలాంటి పరిస్థితి వుంది అక్కడ.

చనిపోయిన  లఖీ కుంజామ్ నానమ్మ లచ్చీ కుంజామ్ యిక్కడికి వచ్చింది.  లఖీ కుంజామ్ యిరవై సంవత్సరాల  అవివాహిత. తమ పొలంలో తన తమ్ముడితో పాటు ఆకులు తెంపుతోంది. పోలీసులు వచ్చి కాల్పులు మొదలుపెట్టారు.  తమ్ముడు ఎలాగో  తప్పించుకోగలిగాడు. తన అక్కకు తూటాలు తగలడం చూశాడు. అక్క పడిపోవడాన్ని చూశాడు.

సునీత కుంజామ్ – ఆమె తండ్రి ఇడ్‌మా ఇక్కడికి వచ్చాడు. సునీత 17 సంవత్సరాల అవివాహిత. ఆకులు తుంపడానికికి వెళ్లినప్పుడు తూటా తగిలి చనిపోయింది.  

చైతూ కుంజామ్ తల్లి బుద్రి వచ్చింది. చైతూ 15 సంవత్సరాల పిల్లవాడు. బాసగూడాలో పోటా కేబిన్‌లో నాలుగవ తరగతి చదివేవాడు. ఆ రోజు తన అన్న జిలాతో పాటు తునికాకు కోసం వెళ్ళాడు. పోలీసులు జరిపిన విచ్చలవిడి కాల్పుల్లో చనిపోయాడు. జిలాకు గాయాలు తగిలాయి, బిజాపూర్‌లో ఆసుపత్రిలో వున్నాడు.

జోగా బార్సే కుటుంబం నుంచి ఎవరూ రాలేకపోయారు. అతను 30 సంవత్సరాల వివాహితుడు. నలుగురు పిల్లలు వున్నారు. ఇద్దరు బతికివున్నారు. ఇద్దరు చనిపోయారు. అతను కూడా ఆకులు తుంపడానికి వెళ్ళాడు. పోలీసు కాల్పుల్లో చనిపోయాడు.

ఛోటూ ఉర్సా తల్లి మంగ్లీ ఉర్సా వచ్చింది.  ఛోటూ ఉర్సా 24 సంవత్సరాల అవివాహితుడు. అతను కూడా ఉదయమే ఆకుల కోసం వెళ్ళాడు. అతన్ని చంపేశారు.

సుక్కు తాతీ 25 సంవత్సరాల వివాహిత యువకుడు/ అతని తల్లి మంగ్లీ వచ్చింది. అతనికి చాలా మంది పిల్లలు వున్నారు.

ఛోటూ ఉడమ్, 21 సంవత్సరాలు . అతని మేనమామ వచ్చాడు. ఛోటూ కంటే చిన్నవాడు. ఛోటూ వివాహితుడు. యిద్దరు పిల్లలు. ఉదయం తునికాకు కోసం వెళ్ళాడు. పోలీసులు అతన్ని చుట్టుముట్టడాన్ని యితరులు చూశారు. పరిగెత్తుతుంటే వెంటబడి కాల్చారు.

గాయపడినవారు బీజాపూర్ ఆసుపత్రిలో వున్నారు. తుపాకి తూటాలతోనే వాళ్ళకు గాయాలు అయ్యాయి. వారిలో బుడ్రు కుంజామ్, తండ్రి సుకల్ జిలా కుంజామ్ తండ్రి సోమల్ బులీ కుంజామ్ తల్లి బుద్రి, దేవే లేకామ్ తండ్రి చుక్కులు వున్నారు.

25 సంవత్సరాల వివాహితుడు. ఇంకొక  పిలగాని తండ్రి ఆ రోజు ఉదయం ఆకులు తెంపడానికి పోయాడు. తెంపిన తరువాత దబ్బి ఇచ్చే మున్షీ (కుదువ పెట్టుకుని డబ్బు యిచ్చే ఏజెంటు)దగ్గరికి బయల్దేరాడు. కానీ తోవలోనే అతడు పోలీసు తూటాలకు బలయ్యాడు.  అమ్మడానికి వెళ్తుంటే దారిలో పోలీసుల తూటాలకు బలయ్యాడు.

సోనూ తల్లి.  అతనికి ఆరుగురు పిల్లలు వున్నారు… ఒకసారి ఆకులు కోసి అమ్మి, మళ్ళీ మరోసారి బయలుదేరాడు. అందరితో పాటూ అతనూ పరిగెత్తాడు. తూటా తగిలి చనిపోయాడు. అతని తండ్రి ఆయామ్ వచ్చాడు.

గాయపడి ఆసుపత్రిలో వున్నతని పేరు నందూ. మరో యిద్దరిలో ఒకతని వయస్సు 16 సంవత్సరాలు, యితనికి మూడు తూటాలు తగిలాయి. అతనికి రక్షణ యిచ్చి తీసుకురావాల్సిన అవసరం వుండి. అంబులెన్స్ పంపిస్తే రక్షణ వుంటుంది అని చెప్పాము.

కనబడని వారి కేటగరి ఒక అమానుషమైన వర్గీకరణ. మేం బస్తర్‌లో అనేక సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక గ్రామం నుంచి ఘటన జరిగిన తరువాత పీడియా నుంచి 57 మంది ఇతావర్ నుంచి 19 మంది .. ఇంతమందిని మీరు తీసుకెళ్లి పోతారు. మొదట మీరు తూటాలు కాలుస్తారు. తరువాత వారి కుటుంబం  నుంచి ఆ శవాలను తీసుకెళ్లడానికి కూలీ చేయిస్తారు.. మీరు అక్కడికి వెళ్ళి వుంటే మీకు తెలిసేది గ్రామం ఎంత లోపలికి వున్నదో.. దాదాపు 25 కిలో మీటర్ల దూరం.. కొండ ప్రాంతం.. త్రోవ అంతా రాళ్ళ మయం. మొదట మీరు ఆ కుటుంబ సభ్యులను చంపుతారు ఆ కుటుంబ సభ్యులతోనే శవాలను మోయిస్తారు. చూడండి వారి మనస్తత్వం ఎలా వుందో. పాలకుల మానసిక స్థితి ఎలా వుందో .. అత్యాచారాలు చేసేవారి మనస్తత్వం .. అన్యాయం చేసేవారి మనస్తత్వం.. ఎంత క్రూరం యిది… ఆ కుటుంబ సభ్యులకే చెబుతారు శవాన్ని మోసుకు వెళ్ళమని. ప్రస్తుతం వారికి ఎంత అధికారం వుందంటే వీరి ముందర ఎవరూ ఏమీ చెప్పలేరు .. ఇది మా పని కాదని ఎవరూ చెప్పలేరు … మీరు చంపేశారు.. మీరు మోసుకెళ్ళండి .. వీళ్ళు అలా చెప్పాలి.. మేం మీకు కూలీ పని ఎందుకు చేస్తాం .. మొదట మీరు మా మీద కాల్పులు జరిపారు.. మీరు మమ్మల్ని చంపేశారు.. ఇప్పుడు మేం కూలీ కూడా చేయాలా?

పది మందితో పాటు యిద్దరు ఇతావర్‌లో ఒక యింటికి చుట్టం వచ్చాడు. పీడియాలో కూడా ఒక చుట్టం వచ్చాడు. వారి రాజకీయ నేపథ్యం ఏమిటో మాకు తెలియదు.. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులను కలవలేదు… ఒకతను మల్లేపల్లి,  మరొకతను పాల్నార్.  ఆకులు తుంపే క్రమంలో వీరు కూడా చనిపోయారు.

మోసుకెళ్లిన వాళ్ళని వదిలేయరు. మీరు శ్రమ చేశారు, మాకు పని చేశారు అని కృతజ్ఞతలు చెప్పరు.. ఏ మాత్రం చెప్పరు.

యిది యిప్పుడు పోలీసుల కొత్త పద్ధతి .. ప్రతి చోటా ఎక్కువ స్థలం కావాలి ప్రజల్ని తీసుకురావడానికి .. కనబడనివారి కేటగరిలో వాళ్ళని కూడా  వేశారు. కుటుంబ సభ్యులు మా పిల్లవాడు ఎక్కడికి పోయాడని ఆలోచిస్తున్నారు.. ఆకులు తుంపడానికి వెళ్ళినవాడు ఎక్కడికి వెళ్ళాడు.. మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? అందరూ వెతుకుతున్నారు..ఈ విధంగా పీడియాకు చెందినవారు 57 మందిని, ఇతావర్‌కు చెందిన 19 మందిని తీసుకెళ్లారు. 11వ తారీఖునాడు 25 మందిని వదిలేశారు..25 మందిని వదిలిపెడితే వారి జాబితా తయారు చేస్తారు కదా. మీరు చెబుతారు కదా ఈ 25 మందిని వదిలేశామని. తల్లులు, కుటుంబ సభ్యులు అక్కడ తిరుగుతున్నారు. కనీసం ఈ 25 మంది కుటుంబ సభ్యులు శాంతిస్తారు కదా .. కానీ వాళ్ళకు ఆ మాత్రం ఆలోచన రాదా.. 25 మందిని పంపించేశారు …గంగలూరుకు అటువైపు వున్న వాళ్ళను.. యిక్కడేమో వీళ్ళు వెతుకుతున్నారు, ఆ యిరవైదు మందిలో మా వాళ్ళు వున్నారా లేదా అని  … మాలాంటి వాళ్ళం మధ్యలో వేళ్లాడుతున్నాం…పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం..  25 మంది లిస్టు యివ్వమని అడుగుతున్నాం… కానీ యివ్వడం లేదు.. మేం ఎవరో బుధ్‌రామ్‌కి యిచ్చాము, అతని దగ్గర తీసుకోండి అని అంటున్నారు.. యిదేమన్నా పద్ధతా? వీరు పోలీసులా? వీరు పాలనా యంత్రాంగమా? ఏం జరుగుతోంది? ఇదీ 25 మంది విషయం

యిక పదిమందిని వదిలేశామని యిక్కడ చెబుతున్నారు. ఆ పది మంది ఎవరు అని తెలుసుకోవడానికి లిస్టు యివ్వమని అడిగాను. యివ్వలేదు. గంగలూరు సిఐ ఫోను వస్తుంది పార్నార్ సర్పంచికి … నేను యిక్కడ 11 మందిని వదిలిపెట్టాను అని. ఆ రోజు సాయంత్రం మూలవాసి బచావ్ మంచ్ కార్యకర్తలతో గంగలూరు చేరుకున్నాను. అక్కడ ఒక పోలీసు చెబుతాడు “11 మంది కాదు మేడమ్ 32 మంది” అని. సంఖ్యలను యిలా చెబుతున్నారు. 32 మందిని తీసుకు వచ్చారు. వాళ్ళని అక్కడే వదిలేశారు. ప్రజలు తమవాళ్ళ కోసం బీజాపూర్‌ లో వెతుకుతుంటే అక్కడే వదిలేసారు…

ఇక మృతదేహాల విషయానికి వస్తే ప్రతీ సారీ ఏమవుతుందంటే… ప్రతిసారీ… బూటకపు ఎన్‌కౌంటర్ తరువాత  ప్రజలు చనిపోతారు… మనకు తెలుసు  పోలీసులు ఎంత తొందరలో వుంటారంటే శవాల్ని తీసుకెళ్లిపోవాలి, వాటిని దహనం చేసేయాలి ఇలాంటి ఎన్నో కేసుల్లో నేను చూశాను పోలీసులు గ్రామానికి వచ్చేస్తారు … గుండమ్‌లో చూశాను, దంతెవాడలో చూశాను… అనేక చోట్ల చూశాను.. పోలీసులు గ్రామాలకు వెళ్తున్నారు.  ఒకళ్ళిద్దరు కాదు పెద్ద సంఖ్యలో.. చాలా సార్లు బ్లాక్ స్కార్ఫ్ కట్టుకున్న కమాండోలు వస్తారు …. త్వరగా కాల్చేయండి… త్వరగా పాతిపెట్టేయండి అంటారు.. మీరు చంపేశారు .. కనీసం మా సంస్కృతి ప్రకారం మమ్మల్ని చేయనీయండి .. మా వాళ్ళని పిలవనీయండి అన్నా వినరు..

ఈ సారి ప్రజలు ఆలోచించారు. మేం ఈ  అన్యాయాన్ని  యింకా ఎంతకాలం సహిస్తాం? మా పని కేవలం శవాలను మోసుకెళ్లడమూ, కాల్చేయడమేనా? మేం ఈ సారి శవాలను తీసుకెళ్ళం .. మాకు అవసరం లేదు. మొదటిది -కనబడని వాళ్ళ వివరాలు చెప్పాలి .. ఎందుకంటే మా వాళ్ళు కనబడడం లేదు… రెండవది – చనిపోయిన వాళ్ళు, గాయపడిన వాళ్ళకి న్యాయం జరగాల్సిన  మొదటి అడుగులోనే మాకు సఫలత దొరకదు .. న్యాయానికి మొదటి మెట్టు ఏమవుతుంది? మొదటగా ఫిర్యాదు చేయడం .. మీరు ఫిర్యాదు తీసుకోండి, దానిమీద ఎఫ్‌ఐఆర్ కట్టండి. అదంతా ఒక కథ దాని గురించి తరువాత చెప్తాను…

ఆరోజు అందరినీ వదిలేశారు… అందరూ వెళ్ళిపోయారు .. అప్పుడు ఏడు ఎనిమిది మంది మిగిలారు కనబడని వాళ్ళ కేటగరిలో .. ఈ ఏడు ఎనిమిది మంది పేర్లైనా చెప్పమని అడిగాం… చెప్పడం లేదు ఆ తరువాత మాకు తెలిసింది ఏమిటంటే 15 మంది అరెస్టు అయారు అని…  ఈ ఏడు ఎనిమిది మంది 15 మంది ఎట్లా అయారు? బహుశా అందులో పార్నార్ వాళ్ళు కూడా వుండచ్చు 

వాళ్ళందరూ ఆకులు తుంపడానికి వెళ్ళినవాళ్లని గ్రామస్తులు చెబుతున్నారు.. తీసుకెళ్లినవాళ్ళందరూ వాళ్ళే.. వీరిలో కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు.. కొంతమందిని వదిలేశారు.. కొంతమందిని అరెస్టు చేశారు…వాళ్ళ మీద ఏమైనా వారంట్ వుందా? ఒకవేళ వుంటే చెప్పరు. వాళ్ళు ఎవరిమీదనైనా వారంట్ చూపించవచ్చు.. ఈ మొత్తంలో పిల్లలకు కూడా చాలా నష్టం జరిగింది. మొదట వదిలేసినవారు అయిదుగురు పిల్లలు. చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు పట్టుకెళ్లారు… ఆ విషయంలో మేం ఫిర్యాదు చేశాం  నేను అడిగిన ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యులు… చదవడం రాయడం తెలియని వాళ్ళు ఆ ప్రాంతంలో చదువుకోని వాళ్ళు అత్యధికులు వున్నారు .. ఫిర్యాదు చేయడంలో సహాయం చేయడం చదువుకున్న మన లాంటివాళ్ల బాద్యత కదా .. అందులోనూ నేను వకీలుని కాబట్టి నాకు యింకా ఎక్కువ బాధ్యత వుంటుంది.. బీజాపూర్ ఎస్‌ పి ఈ రోజు నామీద “మీ అంతట మీరు రాశారు” అని ఆరోపణ చేశాడు.. మీ ముందుకు వాళ్ళను తీసుకు వచ్చాను, వారి భాషను అనువాదం చేసే వ్యక్తిని తీసుకువచ్చాను మీరు వాళ్ళతో స్వయంగా మాట్లాడవచ్చు అని ..

“లేదు.. మీరు అక్కడికి వెళ్లారు మీకు ఏమనిపించిందో అది రాశారు “ అని అన్నాడు. వీళ్ళ ధోరణి యిలా వుంది

ఫిర్యాదులో నిన్న మేం అందరం గంగలూరులో 3.30 నుంచి 9 గంటల దాకా కూచున్నాం మా డిమాండ్ ఏమిటి? మా ఫిర్యాదుకి రశీదు యివ్వండి అని .. అంతే.. మేం ఈసారి ఎఫ్‌ఐఆర్ అని కూడా అడగలేదు. ఎందుకంటే మేం ప్రతిసారి వింటున్నాం, ఎఫ్‌ఐఆర్ అయిపోయింది.. ప్రతిసారి అదే మాట వింటున్నాం కొర్చోలిలో కూడా అదే మాట.. అందుకని ఈ సారి మేం కేవలం రశీదు యివ్వమన్నాం… అయిదు నిమిషాల పని కోసం మమ్మల్ని అన్ని గంటలసేపు కూచోబెట్టారు… కానీ మాకు రశీదు యివ్వలేదు 

అక్కడ మొదట్లో ఎవరూ లేరు.. యిదీ అక్కడి పోలీసు స్టేషన్ల పరిస్థితి. అక్కడ ఎవరో ఎమ్‌ఎల్‌ఎ వచ్చాడనో, ఇంకెవరో వచ్చారనో మొత్తం పోలీసు స్టేషన్ ఖాళీగా వుంటుంది… మీరు బయటకు వెళితే ఎవరో ఒక ఇన్ చార్జ్ వుండాలి కదా.. అక్కడ ఎవరూ లేరు.. ఒక మేజర్ వున్నాడు అతను ఏమి చేయడానికి సిద్ధపడలేదు.. మీరు ఎదురుచూడండి అని చెబుతూ వుంటాడు.. మేం అంత సేపు ఎదురు చూశాం. మధ్యలో బీజాపూర్ సిఐ వచ్చాడు అతని పేరు సంజయ్ కుమార్. ఎఫ్‌ఐఆర్ అయిపోయింది కాబట్టి ఏమీ యివ్వలేం అని అన్నాడు. నేను చెప్పాను  “ఎఫ్‌ఐఆర్ మీరు చేసి వుండచ్చు కానీ యిది ప్రజలు యిస్తున్న ఫిర్యాదు.. ప్రజలకు ఆ హక్కు వుంది మీరు రశీదు ఇవ్వాలి అని అంటే “సరే వేరే ఆఫీసర్ వస్తాడు, అతనితో మాట్లాడండి అని చెప్పాడు… తరువాత గంగలూరు సిఐ సాకేత్ బంజారే వచ్చాడు గంగలూరు రేంజి డిఎస్పీ వినీత్ సాహు వచ్చాడు. చాలా సేపు అడుగుతూనే వున్నాం… వాళ్ళందరూ ఒకే మాట చెప్పారు, మేం మీకు రశీదు వ్రాసి యివ్వలేం అని…

యిదే కాకుండా వేరే అప్లికేషన్లు కూడా యిచ్చాం. 2024 మార్చి 22 నాడు పీడియాలో ముగ్గురు గ్రామీణులను హత్య చేశారు..అది కూడా బూటకపు ఎన్‌కౌంటర్.. వారి పేర్లు అయితు మడావి, ఆవాల్ పడియా ఎవరైనా ఫిర్యాదు చేయచ్చు.. చాలా రోజుల తర్వాత కూడా చేయచ్చు .. మాకు ఆ నియమం తెలుసు.. ఆ నియమం ప్రకారమే మేము ఫిర్యాదు చేశాం… ఇదే కాకుండా డోరీ తుమ్నార్‌కి చెందిన హిడ్మా తాతీని కూడా పోలీసులు మార్చి- ఏప్రిల్ మధ్య కాలంలో హత్య చేశారు.. అతని తమ్ముడు యిక్కడ వున్నాడు.. అతని తండ్రి బుద్రి తాతీ వున్నాడు.. అందుకని ఆ ఫిర్యాదు కూడా చేశాం… ఈ మూడు బూటకపు ఎన్‌కౌంటర్ల గురించి కూడా మేము ఫిర్యాదు తయారు చేశాం…

ఇవే కాకుండా మేం అక్కడ వున్నప్పుడు తెలిసింది గడియా అనే పేరున్న వ్యక్తి ముదివెండిలో ఐడి పేలుడులో చనిపోయాడు.. వారి కుటుంబ సభ్యులను పోలీసులకు చెప్పారా మీకు నష్ట పరిహారం దొరుకుతుంది అని అడిగితే, వాళ్ళు రాయించలేదు అని అన్నారు. ఈ పేలుడు కొండ ప్రాంతంలో జరిగింది .. అతను తునికాకులను కట్టడానికి తాడు తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడు జరిగింది. ఆలశ్యమైపోయింది మేము ఫిర్యాదు తీసుకోము అని అన్నారు… మీరు కేవలం పేలుడు ఘటన అని రాయకూడదు, నక్సలైట్లు చేసిన ఘటన అని రాయాలి అన్నారు.

బుర్జీ గ్రామానికి చెందిన శాంతి పూనమ్ కూడా పేలుడు ఘటనలో గాయపడిన కేసు కూడా తీసుకువచ్చాం. వేటిలో రశీదు యివ్వలేదు.. ఇదీ చాలా సీరియస్ విషయం.. మనం పౌరులం.  నేరాలు జరుగుతుంటాయి పోలీసుల ద్వారా నేరం జరిగితే ఫిర్యాదు చేసే అధికారం పౌరులకు వుంది. మాకు ఎలాంటి దుస్థితి దాపురించింది అంటే పోలీసులు ఎప్పుడైనా యిళ్లలోకి చొరబడతారు.. మమ్మల్ని చంపేస్తారు.. మేమే ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్ళు తీసుకోనే తీసుకోరు.. ఎందుకంటే పోలీసులు పోలీసు స్టేషన్ లో రాజులు, జిల్లాలోనూ రాజులు .. వాళ్ళే తూటాలు పేల్చుతారు.. వాళ్ళే ఎఫ్‌ఐఆర్ రాస్తారు దాని విచారణ కూడా వాళ్ళే చేస్తారు.. మాకు రిసీవ్ యిచ్చినా   విచారణ వాళ్ళే జరుపుతారు కదా .. మేం రాం కదా. యిది ప్రాథమిక ప్రక్రియ..

ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి.. పీడియాలో, ఇతివార్‌లలో మ్రోగినవి ప్రమాద ఘంటికలు..  జ్ఞాపకం వుంచుకోండి.  సర్కేగూడలో జరిగింది, ఎడెస్‌మెట్టలో రాత్రిపూట జరిగింది.. యిక్కడ  పగటిపూట జరిగింది.. మహువా ఏరుకోవడానికి వెళ్ళిన వాళ్ళని చంపేశారు.. తుమ్‌నార్ లో చనిపోయిన అతను హిడ్‌మా మహువా పూలను ఏరుకోవడానికి వెళ్ళాడు.. ఇలాంటి కేసులు వున్నాయి..

కానీ యిలాంటి గ్రూప్ కేసు .. యింత పెద్ద కేసు, యిన్ని తూటాలు విజయవంతంగా కాల్చాడు .. ఏడుగురు, పీడియాకు చెందిన వారు ముగ్గురు, గాయపడినవారు ఆరుగురు, రెండు గ్రామాల నుంచి మొత్తం పదహారు మందిని చంపి వెళ్ళారు… ఫిర్యాదు తీసుకోవడం లేదు .. గంగలూరు పోలీసు స్టేషన్ లో గంటలకొద్దీ కూచోబెట్టారు.. సిఐ  బంజారే పొద్దున్న పది గంటలకు రమ్మని చెప్పినందుకు రాత్రి అక్కడ నుంచి వెళ్ళిపోయాం.. పదిగంటలకు మేం వెళ్ళేటప్పటికి  బంజారే బీజాపూర్ వెళ్లిపోయాడు.. ఫోన్ ఎత్తడం లేదు .. మమ్మల్ని బీజాపూర్ వెళ్లమన్నారు. అందరం అక్కడికి వచ్చాం, అక్కడ పోలీసు స్టేషన్‌కు వెళ్తే ఎస్‌పి లేడు, డిఎస్‌పి లేడు..ఏమిటిది? యింత పెద్ద సంఖ్యలో పోలీసులు వున్నారు స్టేషన్ లో పోలీసులే లేరు .. 24 గంటల పాటు స్టేషన్ తెరిచి వుండాలి పౌరుల కోసం..

బస్తర్ ఈ దేశంలో వుందా లేదా .. ఈ పోలీసు స్టేషన్‌ లో, వీళ్ళ వాహనాల్లో, వీళ్ళ వేతనాల్లో, వీళ్ళ ఆయుధాల్లో ఎవరి డబ్బు ఖర్చు అవుతోంది? మన పౌరుల డబ్బులు పోతున్నాయి.. మనం కట్టిన పన్నుల డబ్బులు పోతున్నాయి.. పేదవాళ్లు అక్కడికి వెళ్తే మామిడి చెట్టు క్రింద కూచోమంటారు.. వాళ్ళు ఎందుకు కూచోవాలి చెట్టు కింద .. పోలీసు స్టేషన్ వాళ్ళది.. మేం బస్తర్ ఆదివాసీలం. ఇక్కడి వాళ్ళకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుంది? ఇవాళ ఎస్‌పి ఆఫీసు ముందు మమ్మల్ని అవమానించారు. మేం బిచ్చగాళ్ళం కాదు.. మేం బస్తర్ ఆదివాసీలం.. ఇక్కడి ప్రభుత్వానికి యిది ఎప్పుడు అర్థమవుతుంది? అక్కడ మమ్మల్ని రెండు మూడు గంటలపాటు బయట నిలబెట్టారు.

మేము ఎస్‌పి ఆఫీసులో ఎస్‌పిని వెతుకుతున్నాము .. ఎస్‌పికి ఎన్నోసార్లు ఫోన్ చేశాను.. ఈ ఎస్‌పి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు.. ఇవాళ నేను అడగాలనుకుంటున్నాను.. డాక్టర్ జితేంద్ర యాదవ్ ఏమనుకుంటున్నాడు.. బీజాపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జీతం మేం కట్టే పన్ను నించి వస్తుంది. మేం న్యాయం కోసం వెళ్తే మా మాట విననే లేదు.. మీరు ఎందుకు సంతకం చేసి యివ్వరో రాసి యివ్వమని అడిగితే అది నా బాధ్యత కాదు అంటాడు.. మీరు బాధ్యు లు కాకపోతే మీరు ఈ విషయమంతటి గురించి ఏం చెప్పారో వ్రాసి యివ్వాలనుకున్నాను.. నాకు ఒక్కో పదమూ జ్ఞాపకం లేదు.. నేను మళ్ళీ వ్రాసి యిస్తాను.. వారితో మాకు పెద్ద గొడవ అయింది… మా స్థాయి ఏమిటో మీరు ఆలోచించగలరు.. మా గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇదీ ఈ నాటి మా స్థితి..

ఎఫ్‌ఐఆర్ అయిపోయింది మేజిస్టీయల్ ఎంక్వైరీ జరుగుతోంది, అంటే ఎస్‌డిఎమ్ ఎంక్వయిరీ జరుగుతోంది, తరవాత ఒక నిర్ధారణకు వస్తాము అని చెప్పారు. ఇలాంటి సమాధానాన్ని మేం అంగీకరించం.. ఎస్‌డిఎమ్ ఎంక్వయిరీ ఒక రొటీన్ ఎంక్వయిరీ అవుతుంది. ఎఫ్‌ఐఆర్‌ని పోలీసులు రాస్తున్నారు..

అలహాబాద్ హైకోర్టు తీర్పు వుంది.. ఏదైనా ఒక ఘటనను విన్నవాళ్లు లేదా చూసినవాళ్లు చెప్పినది వేర్వేరుగా వుంటే వాళ్ళు విడి విడిగా ఫిర్యాదు చేయవచ్చు.. ఒకరి పైన ఎఫ్‌ఐఆర్‌ అయిపోయి వుంటే కౌంటర్ ఎఫ్‌ఐఆర్‌ని కూడా మీరు తీసుకోవచ్చు. అలహాబాదు కోర్టు తీర్పు వచ్చాక సుప్రీం కోర్టులో కూడా చర్చ జరిగింది… కానీ మీరు సంతకం కూడా చేయరు, రశీదు కూడా యివ్వరు అనే విషయం నేను నమ్మలేదు …

ఇక్కడి ప్రభుత్వమూ, పాలనా యంత్రాంగమూ ఎవరంటే భయపడుతుంది అని నేను అడగాలనుకుంటున్నాను ..ఏ విషయం అంటే భయం…మీరు ఎవరి సేవకులు.. మీరు ఎవరికి సేవ చేస్తున్నారు… మాకు చెప్పండి.. పౌరుల పట్ల మీకు బాధ్యత వుందనేది ఏ మాత్రం కనబడటం లేదు.. మేం బయట కూచున్నప్పుడు వాన పడటం మొదలైంది … మేం ప్రెస్‌లో మాట్లాడబోతున్నాం అని తెలిసింది.. వెంటనే పోలీసు బలగాలు వచ్చేశాయి.. ప్రజల్ని విడదీసే ప్రయత్నం చేస్తారు పోలీసులు.. కొంత మంది దగ్గరకు వెళ్ళి ఏదో అడగడం మొదలుపెట్టారు… వాళ్ళు మాకు తెలియదు అని చెబితే వెంటనే వచ్చి వీళ్ళకు ఏమీ తెలియదు.. మీరే వాళ్ళను తీసుకువచ్చారు … మీరే చేస్తున్నారు.. అని అన్నారు, బెదిరించడం మొదలుపెట్టారు.. యిది ఒక భయంకరమైన దృశ్యం… దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు..

ముఖ్యమంత్రి విష్ణుగారిని అడగాలనుకుంటున్నాను మీ ఆఫీసర్లు ఎంతోమంది ఎన్నోసార్లు (కొన్ని మాటలు వినపడలేదు..). దీని వల్ల ఫరక్ పడినట్లు మాకు అనిపించలేదు.. యిక్కడి పరిస్థితి మరింత విషమంగా తయారయింది.. నేను ముఖ్యమంత్రి విష్ణుగారిని అడగాలనుకుంటున్నాను.. మీరు, మీ అధికారులు ఎంతోమంది అనేక సార్లు ప్రకటన చేశారు.. మావోయిస్టులతో రాజకీయ చర్చ జరపాలనుకుంటున్నాము అని.. ఒకవైపు మీరు రాజకీయ చర్చ అని అంటారు.. మరోవైపు నేరుగా వచ్చేసి చంపేస్తున్నారు.. తూటాలు పేలుస్తున్నారు.. పీడియా, ఇతావరి కేసులో యూనిఫాం ధరించినవాళ్లు ఎవరూ లేరు.. మృత దేహాలకు కూడా యూనిఫాంలు లేవు.. వాళ్ళందరూ గ్రామస్తులే..

నేడు ఎంత త్వరితంగా చంపేస్తున్నారంటే జిప్పర్ బ్యాగ్ తయారు చేసుకున్నారు కదా.. యిప్పుడు ప్లాస్టిక్ షీట్లు (జిల్లీ) ఏర్పాటు చేసుకోడానికి కష్టపడనక్కరలేదు.. షీట్లో కట్టేయాల్సి వుంటుంది..  మృతదేహం అటూ యిటూ జారిపోతుంది.. యిప్పుడ్ జిప్పర్ బ్యాగులో పెట్టేసి జిప్ వేసేయచ్చు.. ఆ బ్యాగ్‌ను మీతో పాటు తీసుకెళ్లిపోవచ్చు.. ఇన్ని హత్యలు జరుగుతున్నాయి.. క్యాంపులు ఎంత పాతవై పోయాయి. అంటే మొక్కలు చెట్లు అయిపోయాయి.. ఎన్ని హత్యలు జరుగుతున్నాయంటే మీకు జిపర్ బ్యాగులు తయారు చేయాల్సి వస్తోంది.. టోకులో హత్యలు జరుగుతున్నాయి..

మరో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను.  మృతదేహాలు చాలా భయంకరంగా వున్నాయి..  ఒక్కొక్కళ్ళ మొహం విపరీతంగా ఉబ్బిపోయింది.. కాళ్ళు మామూలుగానే వున్నాయి.. ఫోటోలో చూస్తే కాళ్ళు మామూలుగానే వున్నాయి.. అమ్మాయిల ఫోటోలు చూస్తే, 17 ఏళ్ల సన్నగా వుండే ఒక అమ్మాయి మృతదేహాన్ని చూస్తే మొహం యింత లావుగా… నేను వివరించలేను.. మూడు నాలుగు మృతదేహాలు ఒకేలాగా కనిపిస్తున్నాయి.. కాళ్ళు కాళ్ళ లాగా కనిపిస్తున్నాయి కానీ మొహం మొహం లాగా కనిపించడం లేదు.. ఇట్లా ఎలా అవుతుంది? మేం కూడా ఎవరైనా డాక్టర్‌ను అడిగి అర్థం చేసుకోవాలి.. ఏమైనా ఇంజెక్షన్ యిస్తారా ముఖం అలా మారిపోవడానికి.. ఇది తెలుసుకోవాల్సి వుంది.. ఎందుకంటే ఈ రోజుల్లో పోలీసు బలగాలను నమ్మలేం ఎందుకంటే వీరు  హంతక పోలీసులుగా తయారయ్యారు..

Leave a Reply