2022 డిసెంబర్ 5

ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బాంబే హైకోర్టు యిచ్చిన విడుదల ఉత్తర్వులను సస్పెండ్ చేయడాన్ని పునఃపరిశీలించాలని, హైకోర్టును ఉత్తర్వును  పునరుద్ధరించాలని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ 18 మానవ హక్కుల సంస్థలతో కలిసి స్కాలర్స్ ఎట్ రిస్క్ ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబ క్షేమాన్ని గురించి  తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు

ఈమెయిలు ద్వారా

గౌరవనీయులైన ధనంజయ వై. చంద్రచూడ్

భారత ప్రధాన న్యాయమూర్తి

2022 డిసెంబర్ 5

విషయం: ప్రొఫెసర్ గోకరకొండ నాగసాయిబాబాకు న్యాయం చేయడం గురించి (డైరీ నం. 33164/2022)

ప్రియమైన జస్టిస్ చంద్రచూడ్ గారికి,

అహింసాయుతమైన భావవ్యక్తీకరణచేసినందుకు ప్రతీకారంగా జైలు జీవితం గడుపుతున్న ప్రొఫెసర్, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా క్షేమం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తపరిచేందుకు, ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బాంబే హైకోర్టు విడుదల ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, హైకోర్టు ఉత్తర్వులను పునరుద్ధరించాలని దిగువ సంతకం చేసిన సంస్థలకు చెందిన మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం.

ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్శిటీలో ఒక ఆంగ్ల ప్రొఫెసర్, ఆయన పేదప్రజలు, ఆదివాసీ సమూహాలతో సహా భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలవల్ల బాధితులైన ప్రజల తరపున మానవ హక్కుల కార్యాచరణలో నిమగ్నమై ఉన్నారు. ప్రొఫెసర్ సాయిబాబాను 2014 మే 9నాడు యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బయటకు రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిని సోదా చేసి అతనికి సిపిఐ (మావోయిస్ట్) తో సంబంధాలు ఉన్నాయని రుజువు చేసే పత్రాలు, ఉత్తరప్రత్యుత్తరాలు దొరికాయని చెప్పారు.

2017 మార్చి 7 న  ప్రొఫెసర్ సాయిబాబాను “ఉగ్రవాద ముఠా లేదా సంస్థలో సభ్యుడు” అనే ఆరోపణలతో,  సిపిఐ (మావోయిస్ట్)తో సంబంధాలు ఉన్నాయని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేనప్పటికీ భారతదేశంలో అమలులో వున్న  చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఏ) కింద దోషిగా నిర్ధారించి, జీవిత ఖైదు విధించారు. ఈ ఆరోపణలను ప్రొఫెసర్ సాయిబాబా ఖండించారు. ఉగ్రవాద చర్యలు, ఇతర జాతీయ భద్రతా బెదిరింపులను నిరోధించడానికి యుఎపిఏ ఉద్దేశించబడింది; ఏది ఏమైనప్పటికీ, ఇది తరచుగా విద్యావంతుల, మానవ హక్కుల కార్యకర్తల, ఇతర అసమ్మతివాదుల అహింసాత్మక వ్యక్తీకరణలు, సాంగత్యము, ఇతర మానవ హక్కులను శిక్షించడానికి లేదా అణచివేయడానికి ఉపయోగిస్తున్నారు.[1]  “అభిప్రాయ, భావప్రకటనా స్వేచ్ఛను, ప్రజా వ్యవహారాల నిర్వహణలో పాలుపంచుకునే హక్కును శాంతియుతంగా వినియోగించుకోవడం వల్ల” ప్రొఫెసర్ సాయిబాబా నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు  అని యుఎన్ వర్కింగ్ గ్రూప్ ఆన్ ఆర్బిట్రరి డిటెన్షన్ కనుగొంది.[2]

విచారణ సమయంలో జరిగిన విధానపరమైన లోపం ప్రొఫెసర్ సాయిబాబాను వల్ల విడుదల చేయాలని 2022 అక్టోబరు 14న బొంబాయి హైకోర్టు ఆదేశించింది. అయితే, మరుసటి రోజే, మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ను ఆమోదించిన సుప్రీం కోర్టు ఆ ఆదేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ సంఘటనలపై మనకున్న అవగాహనను స్పష్టం చేసే సమాచారం ఏదీ లేనందున, ప్రొఫెసర్ సాయిబాబా తన భావవ్యక్తీకరణ, సమావేశ స్వేచ్ఛలను అహింసాయుతంగా వినియోగించుకున్నందుకు ప్రతీకారంగా అరెస్టు, విచారణ, నిర్బంధానికి గురయ్యారని వాస్తవాలు వెల్లడిస్తున్నాయి. – మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన, పౌర, రాజకీయ హక్కులను కాపాడాలనే అంతర్జాతీయ ఒడంబడికతో సహా అంతర్జాతీయ మానవ హక్కుల సాధనాల క్రింద స్పష్టంగా వుంది. ఇందులో భారతదేశం కూడా భాగస్వామిగా వుంది.

పైన పేర్కొన్న ఆందోళనతో పాటు, ప్రొఫెసర్ సాయిబాబాకు వున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలంగా నిర్భంధ కారణంగా మరింత తీవ్రమవడాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాము.  ప్రొఫెసర్ సాయిబాబా 19 వేర్వేరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  వీటిలో పోస్ట్-పోలియో సిండ్రోమ్ వల్ల రెండు కాళ్ళూ పనిచేయవు.  ప్రాణాంతకమైన ప్యాంక్రియాటైటిస్, పిత్తాశయంలో రాళ్ల సమస్య, ఈ రెండింటికి తక్షణ శస్త్రచికిత్స అవసరం. జైలులో ఉన్న ఏడు సంవత్సరాలలో, రెండు సార్లు వచ్చిన కోవిడ్-19 తో సహా వేర్వేరు యితర సమస్యలకు  అనేకసార్లు తగిన వైద్య సంరక్షణను కలిగించలేదు. కొద్ది నెలల క్రితం, ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు దోషిగా నిర్ధారించబడిన పాండు నరోటే తగిన వైద్య సహాయం అందక స్వైన్ ఫ్లూతో మరణించారు. ప్రొఫెసర్ సాయిబాబా జైలులోనే వుండాల్సి వచ్చి, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా అని ఆయన ఆరోగ్యం గురించి మేము చాలా ఆందోళన చెందుతున్నాము.

అందువల్ల ప్రొఫెసర్ సాయిబాబా కేసును సమీక్షించాలని, బొంబాయి హైకోర్టు నిర్ణయాన్ని సస్పెండ్ చేయాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, అలాగే ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేసి, ఆయనకు అత్యవసరమైన వైద్యసేవలు అందేలా హైకోర్టు ఉత్తర్వులను పునరుద్ధరించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము.

భవదీయులు:

స్కాలర్స్ ఎట్ రిస్క్, ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫర్ అకడమిక్ ఫ్రీడం ఇన్ ఇండియా, ఫ్రీడం నౌ, నార్వేజియన్ స్టూడెంట్స్ అండ్ అకాడమిక్స్ ఇంటర్నేషనల్ అసిస్టన్స్ ఫండ్(ఎస్‌ఏఐహెచ్), సదరన్ ఇల్లినాయిస్ డెమాక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ), హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ (యూఎస్‌ఏ),  ఇండియా లేబర్ సాలిడారిటీ (యుకె), కోలిషన్ ఫర్ జస్టిస్ ఇన్ ఇండియా (యుకె), ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్ (జిబి), సౌత్ ఏషియా సాలిడారిటీ గ్రూప్ (యుకె), టర్బైన్ బాగ్, లండన్, స్టిచింగ్ ద లండన్ స్టోరీ, యాంటీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అలియన్స్ (యుకె), ద హ్యూమనిజం ప్రాజెక్ట్ (ఆస్ట్రేలియా), ఇండియా జస్టిస్ ప్రాజెక్ట్ (జర్మని), ఫ్రీ సాయిబాబా కొలిషన్ యూఎస్‌, కొలిషన్ ఎగైన్స్ట్ ఫాసిజం ఇన్ ఇండియా, జేరికో మూవ్‌మెంట్, బోస్టన్, ఇండియా సివిల్ వాచ్ ఇంటర్నేషనల్

________________________________________

[1] Scholars at Risk, “Free to Think 2021,” https://www.scholarsatrisk.org/resources/free-to-think-2021/#india.

[2] UN Working Group on Arbitrary Detention, “Opinions adopted by the Working Group on Arbitrary Detention at its 90th session, 3-12 May 2021,” https://www.freedom-now.org/wp-content/uploads/AUV-WGAD-Opinion-2021-21-IND.pdf.

Leave a Reply