కలలు కనే కళ్ళు

ఆచ్చాదన లేని వళ్ళు

లోకం తెలియని పరవళ్ళు

అల్లరి పిల్లలు కాదు వాళ్ళు

నవనాగరికులు వాళ్ళు

సమిష్టి ఆశల సౌధం వాళ్ళు

కాలం రైలు పట్టాలెక్కి

జీవితాన్ని బాలెన్స్ చేస్తు

విశ్వయాత్ర చేస్తారు వాళ్ళు

నింగి, నేలంతా వ్యాపించి

మూసిన కిటికీలు తెరిచి

మేఘాలతో వూసులు చెబుతారు వాళ్ళు

పాలపుంత లాంటి సుదూర కాంతి కిరణాలు వాళ్ళు

తేనె జల్లుల పరవశం వాళ్ళు

ప్రకృతి ఒడిలో పారవశ్యపు కాంతులు వాళ్ళు

పాలకుల నైజానికి సాక్షులు వాళ్ళు

ఎవరి సానుభూతి అర్థించని వాళ్ళు

ఆత్మగౌరవానికే అందం వాళ్ళు

బంగారు బుడతలు

స్వేచ్ఛా విహంగాలు

ఊహలకు రెక్కలు తొడిగి ఊరేగే

జానపద చిత్రకారులు

అరచేతిలో నిప్పులకుంపటి వాళ్ళు

పట్టుచిక్కని పాదరసం వాళ్ళు

వాళ్ళు వాడి వదిలేసిన రంగుల కుంచె కోసం వెతుకుతున్న

నా కవితాక్షరాలతో లాంగ్ మార్చ్ మార్గంలో వాళ్ళను కలుసుకోవాలనుకుంటున్నా……

One thought on “బంగారు బుడతలు

Leave a Reply