- మహా రంగస్థలం
అదొక మహారంగస్థలం
సజీవ రసాయన సమ్మేళనం
సామాన్యుల అసాధారణ రంగస్థలం
ఏ నాట్యాచార్యులు నేర్పని మెలుకువలు
వేకువ నేర్పని కువకువలు
సానుభూతి పవనాలు వీచేది అక్కడే
కోపోద్రిక్తులయ్యేది అక్కడే
ఏ ఇంట్లో అల్లు డు గిల్లాడో
ఏ కొత్త కోడలు ఎపుడు నిద్ర లేచిందో తెలి సేది అక్కడే
సిగపట్లు, తలంట్లు
బొబ్బట్లు, ఉడుంపట్లు, తలరాతలపై ముఖ ప్రదర్శనలు అక్కడే
ఎవరు ఎక్కడ నోరుజారారో
తేలిపోయే ది అక్కడే
బిందెలదరువు, గానకచ్చేరి
అక్కడే, అదొక మహా రణస్థలం
తాగి తెగ వాగేవాడి
తాట తీసే ధ్వంసరచన చేసేది అక్కడే
రకరకాలముఖ భంగిమలు, హావాభావాలు…అదొక మహా రంగస్థలం……
2. కాసిన్ని ఊసులు
అరెరె పెద్దోడా,చిన్నోడా, బుజ్జోడా బలే గురి పెట్టారు రా బాబుల్లార
నా చిన్నారి బాలల్లార
జీవితమే వేట అయిన చోట
మీతో కొన్ని ఊసులు
బాలల్లార
మీతో కాసిన్ని ఊసులు
గడిచిన కాలమంతా
గురితప్పిన వ్యధే అయినా
వర్తమానం మాత్రం మీదే
స్వప్నా లు నిజంకావాలంటే
ఏది అవసరమో దానిపై
మాత్రమే మీ దృష్టిని మీ గురించి
ప్రసారం చేస్తారు కదూ
ఈ దూర్తలోకం అంతటా అసహజమై ధ్వంసమైన బాల్యం మీది
ఇదొక ప్రేమ రాహిత్య రాజ్యం
అయినా పట్టు విడువకండి
మధుర ఫలాల సాధన కోసం
గురి చూసి కొట్టాల్సిందే..
విద్య, వైద్యం, ఉద్యోగం,
మరేదయినా సరే
కడుపు నింపుకోవాలి ఉంటే
కాలు కదపాలంటే
గురి చూసి కొట్టాల్సిందే..
పోటీలరాజ్యమిది…
కాసిన్ని సంతోషాలు
పూలజల్లులై కురిస్తే
కాసిన్ని ఆత్మీయ పలకరింపు లు
మిణుగురులై మెరిసిపోయే
ఆకాశం కాన్వాసుపై
వెన్నెల జలపాతం కనువిందు చేస్తే
కడలి తరగలై
కనుదోయి వాకిట కాలం అంచులు మీటేది మీరేనా
కడలి గర్భం లో దాగిన ఆణిముత్యాలు మీరే
జరభద్రం బాలలూ
మీ గురిపైనే
మా ఆశలు, ధ్యాసలు
ఊసులు….
3.ఆసరా
ఎన్ని కాళరాత్రులు
నీ కనురెప్పల మూతకోసం
ఆరాట పడిందో పిచ్చి కాలం
ఇంకా రెక్కలు రాని నా వయసు చిక్కు ల్ని నీవు భరిస్తూ ఉంటే
వెచ్చని నీ స్పర్శ కోసం
పలవరించిందో నా బాల్యం
ఎప్పుడూ నడిచే దారే అయినా
గుక్కెడు నీటి కోసం
నిత్యం ఎడతెగని దారులవెంట పయనం
ఎందుకమ్మా ఇక్కడ మనుషులు మద్య ప్రేమ కరువు
గాలికరువు
పిడికెడు మెతుకులూ కరువు
అమ్మ దిగులు పడకు
ఈ ముళ్ళ దారుల్లో
డొంక నేలలో ఎన్ని ప్రేమ విత్తు లు నాటావో నీ తలపై భారం
నా చెల్లి ని మోయలేని దూరం
నా గుండె లో దిగిన ఈ ముల్లు
మన బతుకు లకు పడిన చిల్లు
నీ చిరునవ్వు ల అనుభూతులకు తోడవుతా
గమ్యమెరుగని ఈ పయనంలో
నీకు ఆసరా అవుతానమ్మా..ఇప్పటికైతే
నన్నిక క్షమించవూ…….