అల్పిక
“టియ్యారెస్‌ని బేన్ చేస్తారా?”
“ఏమ్మాట్లాడుతున్నావ్?”
“అంటే పదహారు ప్రజాసంఘాలనీ బేన్ చేసారు కదా?”
“ఔను… అయితే?”
“అంటే తెలంగాణ సాధనకోసం వాటితో కలసి టియ్యారెస్ పనిచేసింది కదా?”
“అవంటే ఉద్యమ సంఘాలు”
“మరి టియ్యారెస్ ఉద్యమ పార్టీ కదా?”
“…………………?!?…………………”
👍👍
Maa Satyam
కామ్రేడ్ ఆర్కే గారు రాసిన కవిత “నేను ” శీర్షిక లో
‘ who I am I ‘ లోతైన తాత్విక అన్వేషణ తో ముడిపడిన కవిత.
ఈ కవిత చదువుతున్నప్పుడు నాకు శ్రీ శ్రీ తన మహాప్రస్థానంలో
‘ ఐ ‘ అనే కవిత 01-6-1934 లో రాశారు. అప్పుడు శ్రీశ్రీ గారి వయస్సు 24 సంవత్సరాలు.
‘ ఐ ‘ అన్న ప్రశ్నకు తన అన్వేషణ లోని సమాధానం
” నేనొక దుర్గం :నాదొక స్వర్గం:
అనర్గళం, అనితర సాధ్యం
నా మార్గం” తనలో ఉత్పన్నమైన ప్రశ్నకు జవాబుగా సామ్యవాద సమ సమాజమే అన్న అర్థం అంతర్లీనంగా తెలియజేస్తుంది.
ఇప్పుడు ఆర్కే గారు రాసిన
‘ నేను ‘ అనే కవిత లోని
‘నేను’ ఎవరిని? అన్వేషణకు సమాధానం గతితార్కిక భౌతికవాదం దృష్టితో తాత్విక తార్కిక కోణంలో తనకు వచ్చిన సమాధానమే.
” అందుకే నేను
చరిత్ర పురోగమిస్తుందని
ఆ చరిత్ర పురోగమనంలో భాగమైనవాడిని
చరిత్రను నడిపించే చోదకశక్తిని
ఇక ఇప్పుడు
నేను ఎవరినంటే,
నేను కమ్యూనిస్టును – విప్లవ కమ్యూనిస్టును.”
భారత పీడిత ప్రజల విముక్తి కోసం చేస్తున్న పోరాటాన్ని అంతర్లీనంగా తెలియజేస్తుంది.