ప్రశ్నంటే ఎందుకంత భయం
ప్రశ్నలచుట్టూ ఇనుప కంచె ఎందుకు
ప్రశ్న వైపు నిలుచుని
చూడ్డం నీకు రాదు
గర్జించే ప్రశ్నకు
తుపాకీ కాపలా పెట్టిన్నాడే
నీ భీతి తెలిసింది
ప్రశ్నను గాయపరచటం
రక్తాన్ని కళ్ళచూడ్డం
జైల్లో ప్రశ్నను బాధించటం
ఉరికొయ్యకు
ప్రశ్నను వేలాడదీయాలనుకోవడం
నీ తాత్కాలిక ఊరట మాత్రమే
ప్రశ్న ప్రజా సమూహం
ప్రశ్న అలుపెరుగని పరంపర
జవాబు చెప్పడం రాని నీకు
ప్రశ్న మీద Fir అసహనాన్ని వ్యక్తం చేస్తావు
రహస్యంగా రెక్కి చేసి
మేధకు నాన్ బెయిలబుల్ తాళం వేస్తావు
ప్రజలనుంచి దూరం చేసి
ఏకాకితనంలోకి విసిరేస్తావు
ఒక్కటి గుర్తుంచుకో
సముద్రం లోని చేపల్ని వేటాడగలవు
సముద్రాన్ని కాదు.
Related