(పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రచురణ)
మణిపూర్ రాష్ట్రం మయన్మార్‌తో అర్జాతీయ సరిహద్దులు ఉన్న ఈశాన్య ప్రాంతంలో చిన్న రాష్ట్రం. 35 లక్షల జనాభా కలిగిన రాష్ట్రం. ఆదివాసేతరులు కొండప్రాంతాలు, భూములు కొనడానికి వీలులేదనే 371(సి) (అధికరణ ప్రకారం). భూ సంస్కరణ చట్టాన్ని సడలించాలని మైతీలు చేస్తున్న వాదనలకు భారతీయ జనతాపార్టీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మద్దత్తు తెలుపుతోంది. మైతీలు హిందువులు. నాగా, కూకీ, ఆదివాసీ తెగలు మెజారిటీ క్రైస్తవులు. మైతీలలో క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆదివాసీ తెగల్లో క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. 10% భూ భాగంలో, మైదాన ప్రాంతంలో ఉన్న మైతీలు 53% జనాభా వల్ల రాష్ట్ర శాశనసభ మీద ఆదిపత్యం సంపాదించారు. బిజెపి మైతీల ప్రాభల్యం సంపాదించుకుని మైతీనే ముఖ్యమంత్రిని చేసింది. ఆదివాసీల రక్షిత భూమిగా ఉన్న భూమిలోకి అక్కడ వనరులను ఆక్రమించడానికి మైతీలు చేస్తున్న ప్రయత్నాలు ఈ ప్రభుత్వంలో వేగంగా సాగుతున్నాయి. మణిపూర్‌లో ఆర్.ఎస్.ఎస్. మద్దత్తుగల సంస్థలు ద్వేషపూరిత ప్రచారంలో విస్తృతంగా ఉపయోగించే రెండు అంశాలు కొండ అడవి ప్రాంతంలో గసగసాల సాగు, అటవీ నిర్మూలన ఈ రెండు సమస్యలకు కుకీలు కారణమని కాన్నాళ్ళుగా మైతీలు మెదళ్ళలోకి ఆర్.ఎస్.ఎస్. బలంగా ఎక్కించింది. ఆన్లైన్ మీడియా ఉపయోగించి కుకీ మైతీల మధ్య చిచ్చును దానినే ఆయుధంగా చేసుకుంది.
మణిపూర్‌లో హిందువులు అత్యధికంగా ఉన్న మైతీలకు ఎస్.టి. హోదా కల్పించే ప్రతిపాదనే ఈ అగ్గికారణమన్నది కాదనలేని నిజం. తనకు లేని అధికారంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం వెనుక మిగతా తెగల వారికి హక్కుల ఉల్లంఘన కనిపించింది. అప్పటికే వివిధ రంగాల్లో మైతీలకు ఉన్న ఆధిపత్యం మైదాన ప్రాంతంలో ఉన్న వీరికి, కొండప్రాంతాల్లో ఉన్న ఇతర తెగల వారికి మధ్య ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉండటం వంటివి ఇందుకు పునాది. ముఖ్యమంత్రి మైతీ బీరెన్ సింగ్ పట్ల పెరిగిపోయిన అవిశ్వాసం పరిస్థితులను ఏమాత్రం నియంత్రించలేని దశకు తెచ్చాయి. మైతీలు ఓట్‌బ్యాంక్ కోల్పోతామన్న భయంతో భారతీయ జనతాపార్టీ పెద్దలు అతని జోలికి వెళ్ళడానికి భయపడుతున్నారు.
మే 4 నాటి ఘటన పోలీసు సమక్షంలోనే జరిగిందని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఉదయం పి.పైనోమ్ లో పొరుగున ఉండే మైతీలు మమ్మల్ని హెచ్చరించారు. కుకీలే లక్ష్యంగా మైతీలు విరుచుకుపడబోతున్నారని చెప్పారు. మా గ్రామంలోని కుకీలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోమన్నారు. నేను మా నాన్న తమ్ముడు మరో ఇద్దరం కలిసి అడవిలోనికి పారిపోయాం. అక్కడ పోలీసులు మమ్మల్ని నిలిపి కాపాడతామని తీసుకువెళ్ళారు. అంతలోనే అల్లరి మూకలు అక్కడకు చేరుకుని నన్ను వివ్పుస్త్రణ చేసాయి, మా నాన్న తమ్ముడిని దారుణంగా హత్యచేసారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరగటం దారుణం. బాధితురాలు ‘‘ది వైర్’’ పత్రికకు చెప్పి వాపోయింది. నన్ను వేరొక మహిళను నగ్నంగా ఊరేగిస్తున్నప్పుడు పోలీసులు వాహనంలో కూర్చొని చోద్యం చూసారే తప్ప అల్లరి మూకలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మూడవ బాధితురాలును వివస్త్రణను చేసి ఊరేగించారని చెప్పింది.
మణిపూర్‌లో చర్చిలే టార్కెట్‌గా దాడులు : మణిపూర్ రాష్ట్రంలో ఆదివాసీ తెగ కుకీలు, మైదాన ప్రాంతానికి చెందిన మైతీలకు మధ్య జరుగుతున్న వివాదం చర్చిల విధ్వంసానికి దారితీసింది. మే 3న ఇరు వర్గాల మధ్య దాడులు తీవ్రమైనాయి. మైతీలు ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లోని చర్చిలపై దాడులు చేసారు.
ఆర్చ్ బిషప్ కార్డినల్ నివేదిక : మణిపూర్‌లో చర్చిలో దాడులకు సంబంధించి బొంబే ఆర్చ్ బిషప్ కార్డినల్ వోస్వాట్ గ్రేసియస్ జూలై 9న విడుదల చేసిన నివేదిక ప్రకారం 357 చర్చిలు వాటి అనుబంధ ఆస్తులకు నిప్పు పెట్టారని వాటిలో చర్చిల సంఖ్య 289. ఎయిడ్ టు చర్చ్ ఇన్ నీడ్ మణిపూర్‌లో పరిస్థితిని సమీక్షించి గత నెలాఖరువరకు పదుల సంఖ్యలో కేథలిక్, ప్రొటస్టెంట్ చర్చ్‌లపై దాడులు జరిగాయని వాటిని తగులబెట్టారని వందమంది దాకా కుకీ క్రైస్తవులు హత్యకు గురైనట్లు వెల్లడిరచారు. మరోవైపు యునైటెడ్ క్రిస్టియన్ ఫారమ్ ఈ దేశంలో క్రిస్టియన్ల చర్చలకు వ్యతిరేకంగా 400 దాడులు జరిగాయని పేర్కొంది.
చర్చ్‌లపై దాడులు నిరసిస్తూ బిజెపి మణిపూర్ రాష్ట్ర అధ్యక్షుడు వన్రమ్చువాంగ్ తన పదవికి రాజీనామా చేసాడు. దానికి కారణం ప్రస్తావిస్తూ రెండు వర్గాల మధ్య పోరుకాస్తా మతాలమధ్య పోరుగా మారుతుందని 357 చర్చీలు వాటి అనుబంధ ఆస్తులను ధ్వంసం, దహనం చేయడం దారుణమని అన్నాడు. మణిపూర్‌లో అల్లర్లు ప్రారంభమైనప్పటి నుండి 142 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వెలుగులోనికి రాని కేసులు ఎన్నో ఉన్నాయని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. మణిపూర్‌లో మహిళలపై అత్యాచారం, నగ్నంగా ఊరేగించడం, హత్యలు గృహ దహనాలపై నిరసనగా వివిధ ఆదివాసీ సంఘాల ఇండీజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ నేతృత్వంలో చురచాందాపూర్ జిల్లాలో వేల మంది ప్రజలు నల్లదుస్తులు ధరించి నిరసన ర్యాలీని నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. మణిపూర్ అత్యాచార బాధితురాలు చెబుతూ నన్ను వదిలేయండని చేతులెత్తి మొక్కాను నాకు పిల్లలు ఉన్నారని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడాను అయినా వదలలేదు. వివస్త్రణచేసి ఊరేగించారు. అత్యాచారం జరిపారు అంటూ చెప్పింది. మే 4న అటుగా వస్తున్న పోలీసు వాహనం చూసి కాపాడాలని మొరపెట్టుకున్నాను. జీపులో పోలీసులు ఉన్నారు. సాయం చేయలేదు సరికాదా మైతిలీ మూకలకు స్వేచ్ఛనిస్తూ జీపువదలి వెళ్ళిపోయారు. యువతి తండ్రి, సోదరుడిని కొట్టి చంపి మృతదేహాలను కాలువలో పడేసారు. మమ్మల్ని దుస్తులు లేకుండా నడిపించారు. తరువాత అత్యాచారం చేసి వదిలివెళ్లారు. మైతీల మూక మే 4న కాంగ్సోక్వి జిల్లాలోని ఓ గ్రామంపై విరుచుకుపడి ఒకరి హత్యతోపాటు లూటీలు, గృహ దహనాలు, అత్యాచారాలకు పాల్పడ్డారు. కార్గో సర్వీస్ షోరూమ్ ఉద్యోగినులపై దారుణంగా దాడిచేసారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి. బాధిత మహిళలు 21, 24 ఏళ్ళ వారు. నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి, హత్యచేసారు. మృతదేహాలు దొరకలేదు. పెరో గ్రామంలో దుండగులు 80 ఏళ్ళ వృద్దురాలు ఇంటికి నిప్పుపెట్టి ఆమెను సజీవదహనం చేసారు. ఈమె స్వాతంత్య్ర సమరయోధుని భార్య. మారణాయుధాలతో ఓ మూక జంతువుల మాదిరిగా మా ఊరుమీద పడ్డారు, ప్రజలందరిమందు నా భార్యను వివస్త్రణ చేసారు. పోలీసులు చూస్తూ ఉండిపోయారు. అస్సాం రెజిమెంటల్‌లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. కార్గిల్ యుద్దంలో దేశాన్ని రక్షించాను ` భార్యను కాపాడుకోలేకపోయాను. వ్యక్తిగతంగా నష్టాన్నిచూసి కృంగిపోయాడు.
కార్పొరేట్లకు ప్రకృతి వనరులు ఖనిజ సంపద అడవులు, కొండలు, సముద్రాలు, ఎడారులు దోచుకోవడం కల్లోలిత మణిపూర్‌లో అల్లర్లను అదుపుచేయడంలో పోలీసింగ్ పూర్తిస్థాయిలో విఫలమైంది. మే 3 నుండి మణిపూర్‌లో మారణకాండ జరుగుతుంటే దేశప్రధానికి తెలియదు, హోమ్మంత్రికి తెలియదు, జాతీయ మహిళా కమీషన్, పోలీసు వ్యవస్థ, మానవహక్కుల కమీషన్ వీరెవరికి తెలియకపోవడం ఆశ్చర్యం. సోషల్ మీడియాలో జూలై 19వ తేదీన వచ్చిన తరువాత గాని వీరికి తెలిసిందంటే వీరు అధికారంలో ఉండే అలసత్వంగా వ్యవహరించారనేది అర్ధమౌతుంది.
ఈ దేశంలో ఆదాని, అంబానీ, కార్పొరేట్ల ఆర్ధిక దోపిడీల నండి దృష్టి మళ్ళించడానికి ప్రజలమధ్య కుల, మత, ప్రాంత, భాషా బేధాలను రెచ్చగొడుతూ మెజార్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టి బిజెపి అధికారం దక్కించుకుంది. దేశంలో బిజెపి, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ దాని అనుబంధ సంస్థలు మత ప్రాంత కులసమస్యలు సృష్టించి సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించి మతం రాజకీయాలతో కలిసి దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. సంఘపరివార్ ఎజెండ్ ప్రజా శ్రేయస్సుకాదు, సమాజం తమ ఆధిపత్యం. వారి లక్ష్యమైన హిందూ రాష్ట్రానికి అర్థం కేవలం మత రాజ్యం కాదు కరుడుకట్టిన నిచ్చెనమెట్ల సమాజాన్ని రూపొందించడం. కమ్యూనిస్టులు, అంబేడ్కర్ వాదులు, ముస్లింలు, క్రైస్తవుల పై దాడులు చేస్తున్నారు. అందులో భాగంలో మణిపూర్ మారణకాండ. మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. మారణకాండలో భాగస్తులైన నిందితులందరినీ అరెస్టుచేయాలి. మణిపూర్‌లో అన్ని తెగలతో శాంతి కమిటీని ఏర్పాటుచేసి శాంతిని నెలకొల్పాలని, దేశంలో ఇటువంటివి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీద్దాం. ఈ ఘటనపై మైనం వహిస్తున్న ప్రధానిని ప్రశ్నిద్దాం. భారతీయ జనతాపార్టీ దాని అనుబంధ సంస్థలు దేశంలో చేస్తున్న మారణకాండను నిలువరిద్దాం. అందుకోసం జరిగే ఉద్యమాలలో మనమంతా ఐక్యమై పోరాడదాం.