మానవత్వం చంపబడుతోంది
మాట్లాడుకుందాం రండి

సోంతలాభం కోంతమాని
పోరుగువారికి తోడ్పడవోయ్
గీసుకున్న దేశభక్తి గీతదాటి
అడుగు ముందుకేసి
సోంతలాభం అసలే వద్దు
ప్రజలకోరకే తన ప్రాణమంటు
మానవత్వం శిఖరమెక్కిన
మనిషి చంపబడ్డాడు
మానవత్వం చంపబడుతోంది
మాట్లాడుకుందాం రండి

అన్నం రాశులు ఒకచోట
ఆకలి మంటలు ఒకచోట
వ్యత్యాసాల ఎత్తుపల్లాలు ఆర్పడానికి
నాలుగడుగులు ముందుకేసి
అన్నం రాశులు ఆకలి సంచులు నింపిన
మనిషి చంపబడ్డాడు
మానవత్వం చంపబడుతోంది
మాట్లాడుకుందాం రండి

నెత్తురు మండే శక్తులు నిండే
సైనికులారా రారండి
పిడికిట్లో నినాదం పిడుగులు పట్టుకొని
మరో నాలుగడుగులు ముందుకే నడిచి
కోయ్యూరు నండి కోయ్యూరు దాక
జనం అలజడి నాడి
స్టెతస్కోప్ చేతులతో పట్టిన
మరో ప్రపంచపు నూతన మానవుడు
మానవత్వం నాటుకుంటూ వస్తున్నమనిషిని చంపేశారు

రండి చంపబడ్డ మానవత్వాన్ని పిడికిళ్ళ నిండా మనిషింత తెచ్చుకుందాం

Leave a Reply