యుద్ధం అంటే ప్రేమ లేనిదెవ్వరికి
నీకూ నాకూ తప్ప
ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ
స్మశానాలపై జెండాలెగరేస్తారు
సమాధులపై ఇన్ని గులాబీ
రేకులు పోసి చేతులు జోడిస్తారు
కనురెప్పలకింద ఉప్పగా ఊరిన
నీటిని తుడుచుకుంటూ నడిచిపోతారు
రేపటికి మిగలని వాటిపై
మరల కొత్త పునాదులేస్తారు
సదులన్నీ కుదించబడి
సముద్రపు పక్కలో ఒరిగిపోయాయి
కానీ ఆ తల్లి మాత్రం
కడుపు చించుకుంటోంది
రాని కొడుకో కానరాని కూతురో
ఇంక రారని కనుపాపల వెనక
శూన్యాన్ని గుండెలకద్దుకుంటూ
యుద్ధం వాడికొక వస్తుమార్పిడి
యుద్ధం వాడికొక వ్యసనం
యుద్ధం వాడికొక పాచికలాట
యుద్ధం నీకూ నాకూ
విముక్తి సాధనం
యుద్ధం నీకూ నాకూ
శాంతి మార్గం
– కెక్యూబ్..
బావుంది
Thank you
చాలా బాగా రాసారు సార్
Thank you