సవ్యసాచిదేవ్     
కవి, రచయిత, విమర్శకుడు

ఇప్పుడు నేను చెప్పేది కొత్త కాదు.సృజనాత్మకత‌ అంటే కొత్తది, ప్రగతిశీలకమైనది. దానికి  రాజ్యం వ్య‌తిరేకి. రాజ్యం ఎల్ల‌ప్ప‌డు సృజ‌నాత్మ‌క‌త‌ను  వ్యతిరేకిస్తది. అది పోలీసు , అధికార యంత్రాంగం ద్వారా నిషేధం తెస్తుంది. చరిత్రను వెనక్కి తిప్పే ప్రయత్నం జరుగుతుంది. ఉపన్యాసాలు, పుస్తకాలు, సామాజిక మాధ్య‌మాలను బాగా వాడుకొని పాత కాలమే బావుంటదని చెప్తారు. నాజీల లాగ ప్రజాస్వామ్య గొంతుల్ని వినరు. తమకు మద్దతుగా ప్రజలని కూడగడుతారు. అంతిమంగా తామే ప్రజాస్వామ్య వాదులమని చెప్పుకుంటారు.హిందువులు కానీ వారిపై దాడి చేస్తారు. వ్యక్తిగత విషయాలపై బురద చల్లుతారు.

కాంగ్రెస్ కాలం లో తమను బాహాటంగా విమర్శించినందుకు సబ్ధర్ హష్మిని కొట్టి చంపారు.ఇప్పుడు  కనీసం విలువల గురించి మాట్లాడినా, ప్రశ్నించినా చంపుతున్నారు. ఒక సెగ…దావానలం లా వ్యాపిస్తున్న‌ది.ప్రతిదాన్ని ఉపయోగించుకుంటారు. వ్యతిరేకమైనదాన్నీ అనుకూలంగా మల్చుకుంటారు. మార్పును వ్యతిరేకిస్తారు.

ఒక్కసారి నాజీలని గుర్తు చేసుకుందాం.వాళ్ళు జర్మన్ తత్వాన్ని వ్యతిరేకించినందుకు 25వేల పుస్తకాలని కాల్చివేసారు.ఇక్కడ పుస్తకాలని కాల్చలేదు కాని అసహనాన్ని ద్వేషాన్ని పెంచుతున్నారు.ముస్లింలని అంటరాని వాళ్ళుగా చూపిస్తున్నారు.వీళ్ళు రాత్రికి రాత్రే గుజరాత్ లో లాగ మంట పెడతారు. గోబెల్ల్స్ లాగ ప్రచారంలో ఆరితేరిపోతున్నారు.

పుస్తకాలని కాల్చే బదులు మనుషులని వేధిస్తున్నారు. ఆజాద్ చంద్రశేఖర్,పెరుమాళ్ మురుగన్ లాంటి వాళ్ళని మానసికంగా వేధిoచారు.ప్రచారం చేసారు.వాళ్ళ పుస్తకాలని నిషేధించాలని డిమాండ్ చేసారు.అవి సమాజ వ్యతిరేక భావాన్ని ప్రచారం చేస్తాయని గగ్గోలు పెట్టారు. సిలబస్ నుండి ప్రజాస్వామిక పాఠ్యoశాలను తొలగించారు.ఆఖరికి తుకారాo పుస్తకాలని నిషేధించేదాక వెళ్లారు.

పుస్తకాలే కాదు, ఏ రకమైన కళా ప్రక్రియ ను ఒప్పుకోరు. జైలుకు పంపడం దాడులు చేయడం,చంపేయడం జరుగుతుంది.అసలు సృజనాత్మకత‌ను చంపుతారా..సాధ్యం కాదు. సృజనకారుడు మనిషి కదా.  మనిషిని భూమ్మీద లేకుండా చేయగలరా. ఎన్న‌టికీ   సాధ్యం కాదు. సృజనకారులే నవ సమాజాన్ని నిర్మిస్తారని తెలుసుకోవాలి. 

సృజనాత్మక అనేది ప్రజలని చేరాలి.తమ సొంతానికి కాదు.సృజనకారుడు సత్యం కోసం నిలబడాలి.రాబోయే ప్రమాదాలని పసిగట్టగలగాలి.కాని తన సృజనాత్మకత‌ను ఎప్పుడూ భద్రపరుచుకోవాలి.లాటిన్ అమెరికాలో ఇదే చేసారు.వాళ్ళు ఎంత నిర్బంధం లో నైన తమ సృజనాత్మకత‌ను కాపాడుకోగలిగారు.ఫ్రెంచ్ విప్లవం లో విక్టర్ జారా తన మరణం వరకు సృజనకారుడిగానే నిలిచాడు.

నిషేధం ఎప్పుడు సృజనాత్మకను చంపాల‌ని చూస్తుంది. దాన్ని నిరంతరం కాపాడుకుంటూ ఉండాలి.అది సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది.      

(జూలై 4, 2021న విర‌సం నిర్వ‌హించిన ఆన్‌లైన్ స‌భ‌లో ప్ర‌సంగానికి  తెలుగు అనువాదం ఉద‌య‌మిత్ర‌) 

Leave a Reply