వాలే చినుకు లో
ఆశగా తడిశాను .
బురద సాలుల్లో 
నారుగా మురిసాను .

ఎండిన కలలని తడుపుతూ
వడివడిగా దున్నుకుంటున్నాను .

ఎండలు శపిస్తాయో
వానలు ముంచేస్తాయో
కళ్ళనిండా  మేఘాలు
నిండి ఉన్నాయి .

గుండెనిండా ధైర్యం
పిండుకున్నాను .

కాసింత ఉరుములు  భయపెడతాయి
కాసిన్ని పిడుగులు కూల్చేస్తాయి

కాళ్ళు మట్టి పెళ్ళల్లో
ఉదయించందే
మనసు కుదుటపడదు .

రెప్పల వాకిట్లో
తెప్పలుగా కదిలే దృశ్యాల వెంట
ఆకు పచ్చని కలలు
ఊరటనిస్తాయి.

ఊపిరి పోసినా
ఊపిరి తీసినా
మట్టిని నమ్ముకునే
రైతు  జీవితం ముగుస్తుంది .  

Leave a Reply