వాళ్ళు ముగ్గురే అనుకుని
వాళ్ళని లేకుండా చేస్తే
ఇంకేమీ మిగలదని
విషం పెట్టి
చిత్రహింసలకు గురిచేసి
కొయ్యూరు అడవుల్లో
హతమార్చి
సంబరాలు చేసుకున్నావు
కానీ ఆ చిత్రహింసల
కొలిమిలోంచి
ఫీనిక్స్ పక్షిలా
వేలాదిమంది సాయుధ
ప్రజా విముక్తి సైన్యం
పుట్టుకొచ్చింది
నువ్వో కాగితప్పులవని
రుజువయింది
స్పార్టకస్ నుండి
దండకారణ్య ఆదివాసీ వరకు
నెత్తుటి పుటలలోంచి
మరల మరల
విముక్తి నినాదం
వినబడుతూనే వుంది
అమరత్వం పొత్తికడపులోంచి
ఉద్యమ నెల వంకలు
ఉదయిస్తూనే వుంటారు
శ్యాం మహేష్ మురళీ
అమర్ రహే అమర్ రహే