దండాలు దండాలు మా కటకమ
నీకెర్ర దండాలు సుదర్శన
జోహార్లు జోహార్లు మా కటకమ
విప్లవ జోహార్లు సుదర్శన
విప్లవానికే అంకితమైన……
యాభైయేండ్ల అజ్ఞాత జీవితమ…”దండాలు”
కన్నాల బస్తిలో పుట్టినవు
కారడవికి నీవు చేరినవు
కామ్రేడుగా నీవు మారినవు
కేంధ్ర నేతగా ఎదిగినవు
నమ్మిన దారిలో నడిచినవు….
కన్నుమూసేవరకు పోరినవు….”దండాలు”
మావోయిస్టు సిద్దాంతమా
ప్రజాయుద్ధా మార్గానివీ
గెరిల్లా పోరు వ్యూహానివి
మాటు దాడుల మర్మానివి
దండకారణ్యం గుండె కాయవు……
ఎర్రజెండా అరుణతారవు…..”దండాలు”
ఎర్ర దండు నడకవు నీవు
పోరుబాట జాడవు నీవు
ఉధ్యమాల ఊటవు నీవు
విప్లవాల తోటవు నీవు
అమర వీరుల కలలవు నీవు….
ఆశయాల బాటవు నీవు…..”దండాలు”
ప్రజా పోరు యుద్ధానివీ
జనం పోరు జెంగ్ నీవు
విప్లవానికి వారధి నీవు
ప్రజాయుద్ధా సారధి నీవు
ఎర్ర సేన చేతి ఆయుధమా……
సాయుధ పోరు సంతకమా..”దండాలు”