తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగామొత్తం 3,214 యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు,సంక్షేమ హాస్టళ్లలో 8,59,959 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.ఇటీవల కాలంలో సంక్షేమ వసతి గృహాలు,గురుకులాలలో బాలికల వరస మరణాలు కొనసాగుతున్నాయి.హౕస్టళ్ళలో పర్యవేక్షణ లోపం,సౌకర్యాల కొరత, పౌష్టికాహారం అందకపోవడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ    “కుల వివక్షత” అసలు కారణం.

ఈ ఏడాది పిబ్రవరీ మూడవతేది రాత్రి భువనగిరి పట్టణంలోని యస్సీ బాలికల వసతిగృహంలో పదవతరగతి చదివే విద్యార్థులు కోడి భవ్య (15), గాదే వైష్ణవి(15) ఆత్మహత్యలు చేసుకున్నారు. బాలికల హాస్టల్ వద్ద హాస్టల్ వార్డెన్ ,వాచ్ వుమెన్ ఉండకపోవడం హాస్టల్లో ఉన్న వంట మనిషి ఆమెతో పాటు హౕస్టల్ కు రోజు వచ్చే ఆటో డ్రైవర్ ఆంజనేయులు ఆధిపత్యము పెరిగింది.విద్యార్థుల మరణాలపై వంట మనిషి మరియు ఆమె సహకారంతో విద్యార్థులను మభ్యపెట్టి పాఠశాలకు తీసుకపోయే ఆటో డ్రైవర్ ఆంజనేయులు మరియు వార్డెన్ పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఆ హాస్టల్ లో సి సి కెమెరాలు లేకపోవడం కూడా అనుమానాలకు అవకాశం ఇస్తుండగా,విద్యార్థుల శరీరాలపై గాయాలున్నాయనీ,విద్యార్థులు రాశారు అంటున్న సూసైడ్ లెటర్ విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయని ఆత్మహత్యకు పాల్పడిన తల్లితండ్రులు అన్నారు.విద్యార్థుల మృతదేహాలను సందర్శించిన మహిళా సంఘాల ప్రతినిధుల బృందం కూడా తన నివేదికలో విద్యార్థుల శరీరాలపై గాయాలున్న విషయాన్ని నిర్ధారిస్తూ ఇవి ఆత్మహత్యలు కావు హత్యలు అని పేర్కొన్నాయి. జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలని కోరారు. ఈ సంఘటన జరిగి వారం గడవక ముందే సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల&కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వైష్ణవి కళాశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ప్రిన్సిపాల్ వేదింపులతో చనిపోతున్నాని సూసైడ్ నోట్ రాసి కళాశాలలో ఉరి వేసుకుంది.విద్యార్థులు బయపడుతున్నారని అక్కడి విద్యార్థులందరికీ సెలవులిచ్చిన తర్వాత ఇదే గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సూర్యాపేటలో జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్‌, జ్యోతి దంపతుల కుమార్తె అస్మిత (15) కూడా ఫిబ్రవరి 17 న ఇంటివద్ద ఆత్మహత్య చేసుకున్నది.అస్తిత ,వైష్ణవి లు ఒకే గదిలో వుండటం ఈ ఆత్మహత్యల తీవ్రతను తెలుపుతున్నాయి. విద్యార్థుల వరస మరణాలు మిస్టరీగా మిగులుతున్నాయి. రేపటి భవిష్యత్తు పై కళలలు కన్న బడుగుజీవులైన పేద తల్లిదండ్రులు సోక సంద్రంలో మునుగుతున్నప్పటికీ పాలక వర్గాలు కంటి తుడుపు చర్యలతో చేతులు దులుపుకోవడమే కానీ శాశ్వత చర్యలు చేపట్టడం లేదు.కనీసం సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణకు ఆదేశించడం లేదు. మరో ఘటనలో నిజమాబాద్ జిల్లాలోని బోధన్ బీసీ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్ పై అదే హాస్టళ్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆరుగురు కలిస దాడి చేయడంతోతో ఆ విద్యార్థి వెంకట్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం స్టడీ అవర్ పర్యవేక్షణలో వుండటమే వెంకట్ మృతికి కారణమయింది. నిజానికి స్టడీ అవర్ నిర్వహించడానికి ప్రభుత్వమే ట్యూటర్ లను నియనించాలి. ట్యూటర్ పోస్టులు సంక్షేమ హాస్టళ్లలో లేవు. ఆ సమయంలో డ్యూటీలో వుండే వాచ్ మెన్, వాచ్ వుమెన్ లే సాధారణంగా స్టడీ అవర్ నిర్వహిస్తారు. చాలా హాస్టళ్లలో వాచ్ మెన్ , వాచ్ వుమెన్ పోస్టులు కూడా ఖాళీగా వున్నాయి. రాత్రి సమయాల్లో విద్యార్థులకు రక్షణ లేదు.కొత్తగా మంజూరైన హాస్టళ్లకు సొంత బిల్డింగులు లేవు. ప్రహరీ గోడలు లేవు.స్థానికంగా బయట వ్యక్తులు, అల్లరి మూకలు విద్యార్థులు వుండే హాస్టళ్లలో చొరబడి ఆధిపత్యము చేయడం ,విద్యార్థులపై దాడులు చేయడం వంటి ఘటనలు చేస్తున్నారు.భవ్య, వైష్ణవీల విషయంలో ఇదే జరిగింది.

వంటమనిషి ద్వారా తరచూ హాస్టళ్ కు వచ్చిన ఆటో డ్రైవర్ ఆంజనేయులు అనధికారికంగా వసతిగృహాంపై ఆధిపత్యము చేశాడు. హైదరాబాద్ నడిబొడ్డున వుండే అమీర్ పేట్ యస్సీ సంక్షేమ బాలుర వసతిగృహాంపై తరచూ స్థానిక అల్లరి మూకలు దాడులు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. ఈ వసతిగృహాం అద్దె బిల్డింగులో కొన సాగుతున్నది. హైదరాబాద్ లోని బిసీ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు అన్నీ ప్రైవేటు బిల్డింగులలోనే కోనసాగుతున్నాయి.యస్సీ సంక్షేమ హాస్టళ్లలో కేవలం ఒక్క వసతిగృహానికి మాత్రమే ప్రభుత్వ బిల్డింగు వుండగా మిగతా 28 బాలికల, బాలుర హాస్టళ్లన్నీ ప్రవేట్ బిల్డింగులలో కొవసాగుతున్నాయి. ఇదే పరిస్థితి సంక్షేమ గురుకులాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వుంది.యస్సీ గురుకులాల భవనాల నిర్మాణానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేయాలి.రాష్ట్రంలోని బీసీ, యస్సీ,యస్టీ సంక్షేమ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్ళు మరియు బీసీ మైనారిటీ గురుకుకులాలు, యస్ టీ రెసిడెన్షియల్ పాఠశాలలు,కళాశాలలు,ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య గురుకులాలు మరియు కస్తూరిభాగాందీ విద్యాలయాలు పక్కా భవనాలు లేకుండా వున్నాయి. ఈ హాస్టళ్లలో వుండే విద్యార్థులకు పౌష్టికాహారం అందటం లేదు. 2017లో ఖరారు చేసిన ధరల ప్రకారం పిల్లలకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాన్ని అందించడం కోసం 3 నుంచి 7 వ తరగతి విద్యార్థులకు రోజు వారిగా కేవలం 32 రూపాయలు, 8-10 తరగతి విద్యార్థులకు 37 రూ. ఇంటర్‌ నుంచి పీజీ విద్యార్థులకు 50 రూపాయలు బోజన ఖర్చులు ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. ఈ తక్కువ మొత్తంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందక శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

గత ప్రభుత్వ హయంలో మెస్ చార్జీల పెంపుపై పెగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా‘ఉపకారాన్ని’అందించాలని అందుకు అద్యయనానికి నాటి అర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌ లతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం మెస్ చార్జీల పెంపును నిర్ణయిస్తూ ప్రస్తుతం అందిస్తున్న మెస్‌ చార్జీలను 25 శాతం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.తరగతులవారీగా పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి పరిశీలన అనంతరం ఫైలుకు ఆమోదం లభిస్తుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పెరగనున్న ధరలు అమల్లోకి వస్తాయని ఊదరగొట్టి కనీసం నాటి ముఖ్యమంత్రి మెస్ చార్జీల పెంపు పైలును కనీసం తెరిచి చూడలేదు కానీ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహము పెట్టి అంబేద్కర్ వాదిలా పోజు గొట్టాడు.

 అంబేద్కర్ ఆశయాలలో ఒకటైన బహుజన విద్యార్థుల విద్య, ఆరోగ్య అభివృద్ధికి తోడ్పడే మెస్ చార్జీలను మాత్రం పెంచలేదు. వసతిగృహా విద్యార్థులకు కనీస స్టై ఫండ్ రాక హైదరాబాద్ లో వుండే యస్సీ,యస్టీ,బీసీ విద్యార్థులు కాలేజీ మానేసి పనులకు పోతున్నారు.ప్రమాదల బారినా పడుతున్నారు.విద్యార్థులకు అందించాల్సిన కనీస సౌకర్యాలైన ఆర్.వొ ప్లాంట్ తాగు నీరు, సి సి టివి, ఇంటర్నెట్, న్యూస్ పేపర్స్ కూడా కల్పించడం లేదు.పాలకవర్గాలు పథకంలో భాగంగా సంక్షేమ హాస్టళ్లను గురుకులాలను నిర్లక్ష్యము చేస్తున్నారు.కార్పోరేట్ ప్రైవేటు బహుళజాతి కంపెనీలకు వందల ఎకరాల భూములు ధారాదత్తం చేస్తున్న పాలకులు హాస్టళ్ల నిర్మాణానికి భూమి దొరకడం లేదంటున్నారు. హాస్టళ్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష జరపడం లేదు.వార్డెన్ నుండి మొదలుకొని ఉన్నత అధికారుల అవినీతి మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతున్నది. ఇటీవల కాలంలో యస్టీ సంక్షేమ శాఖ అధికారి 84 వేల లంచము తీసుకొంటూ ఏసీబీ కి దొరకగా ఆమె ఇంట్లో 66 లక్షల అక్రమ నగదు, 4 కె.జి ల బంగారం దొరికింది.ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసిన మరో అధికారి అంగనవాడీ పిల్లలకు అందించే పౌష్టికాహార నిధులు స్వాహా చేసింది. హౕస్టళ్ళలో వైద్య సదుపాయం అందటం లేదు.కరోనా అనంతర కాలంలో వసతిగృహాలలో వైద్యమందక పదుల సంఖ్యలో విద్యార్థులు మరణించారు.

ప్రతి వసతిగృహాంలో మెడికల్ ఆఫీసర్, నర్సు పోస్టులు భర్తీ చేయాల్సివున్న ప్రభుత్వం ఈ విషయములో దృష్టి పెట్టడం లేదు.సంక్షేమ వసతిగృహాలలో బడుగుబలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందిస్తే వారి చైతన్యం ఎక్కడ తమ అధికారాన్ని కూలదోస్తుందనే మనువాద కుట్ర సంక్షేమ హాస్టళ్లపై పనిచేస్తన్నది.

సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న వరుస మరణాలపై తల్లితండ్రులు అనుమానాలను నివృత్తి చేయాల్సిన పాలకవర్గాలు న్యాయ విచారణలో వివక్షతను పాటిస్తున్నారు.అగ్రవర్ణ ధనిక విద్యార్థులకు మన దేశంలోగానీ విదేశాలలలో గానీ ఆక్సిడెంట్ మరణాలు,హత్యలకు గురైతే తక్షణమే స్పందించే పాలకవర్గాలు అణగారిన వర్గాల పిల్లలవిషయంలో కనీసం స్పందించడం లేదు. పైపెచ్చు న్యాయం చేయమని అడిగితే బాదితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు.కనీసం భారత రాజ్యాంగంలో యస్సీ, యస్టీ అత్యాచారల నిరోధక చట్టంను కూడా అమలు చేయడం లేదు.గతంలో తెలంగాణ రాష్ట్రంలో అణగారిన వర్గాల బాలికలు, మహిళల హత్యాచారాలపై పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుకై ప్రజా సంఘాలు పోరాడాల్సి వచ్చింది. “భవ్య, వైష్ణవిలన్యాయ పోరాట కమిటీ” పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయపోరాటం సాగిస్తున్నారు.

భవ్య వైష్ణవీల మరణాలకు కారణమైన వారిని శిక్షించాలని,పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని,హౕస్టళ్ళలో విద్యార్థుల మరణాలను నియంత్రించాలని “భవ్య వైష్ణవీ న్యాయ పోరాట కమిటీ” ఆద్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు మార్చి 4 వ తేదీన శాంతియుతంగా “దర్నా” నిర్వహిస్తామని అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకొంటే అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య హక్కులను కాల రాయడమే అవుతుంది. మరోవైపు పుట్టెడు దుఃఖముతో ఇందిరాపార్కు దర్నా చౌక్ కు వచ్చిన భవ్య వైష్ణవీల తల్లిదండ్రులను, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసి దోమలగూడ పోలీసుఠానాకు తరలించడం అంటే పీడితసమూహౕల భాదితులను మళ్లీ మళ్లీ అణచివేయడమే.భాదిత విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న న్యాయ పోరాటంలో భాగమవ్వడమే బుద్దిజీవుల కర్తవ్యం.

06-04-2024

Leave a Reply