శూన్యగోళంలో తిరుగాడే పిట్ట
జీవావరణంలో ఇమడలేక
గహన గగనం చేరలేక
మన బాల్కానీ ఊచల మీద టపటప
మన తలుపుల మీద టకటక
మన గుండెలకు దగ్గరగా గునగున
గుండే గువ్వై ఎగిరిపోన…

కల అయిపోలేదు
తూటాల మీదుగా పూలతుంట్లు తుంచి
పాపల బుగ్గల నుంచి లేత గులాబీలు తెంచి
మొర చాపిన లేగ ముట్టెకు ముద్దిచ్చి
ముట్టించి, ముట్టడించి,
దట్టించి, దహించి
రివ్వున. కెవ్వన… ఎగిరిపోన..


కల
అయిపోలేదు
కనలి కనలి
కదిలి కదిలి
ఉప్పటి కన్నుల మీదుగా జారి
చప్పటి పెదవుల మీదకు చేరి
చప్పున తోలేలోపే ఎగిరిపోన..

Leave a Reply