బస్తర్లో రైలు మార్గం సర్వేపై నిరసనలు
నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సర్వేలు నిర్వహించేవారు మావోయిస్టుల మద్దతు గల గ్రూపుల నుంచి నిరసనలు, దాడులను ఎదుర్కొంటున్నారు. భారతీయ రైల్వేలు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమూ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో రైలు మార్గాలను వేయడానికి, రైలు సేవలను ప్రారంభించడానికి కృషి చేస్తున్నాయి. రైల్వే అధికారులు ఒక వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసే ముందు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దశాబ్దాల తరబడి రెడ్ కారిడార్‌గా ఉన్న ప్రాంతాల్లో రైలు సేవలు తొలిసారిగా ప్రారంభం కానున్నాయి. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బస్తర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి