త్యాగాల కల్పవల్లి
నువ్వు పుట్టి పురుడోసుకున్నవో లేదో కానీ ఏ అవ్వ బొడ్డు పేగు కోసి పేరు పెట్టిందో నీవు నిజంగానే పేదల ఇంటి గుమ్మాల రంగవల్లి వయ్యి నిలిచావు..!ఏ అసుర సంధ్యా తీరానా నువ్వు అడుగులు నేర్చావో కానీ అవి ఆకలి కడుపుల అన్నార్థుల జాడలు వెతక పయనమయ్యాయిఏ ఇంటి కడుపు పంటవయి పండావో కానీ కడుకు జనలను సోపతయ్యావు పల్లెలో అక్షరాలు దిద్దిన నీ చేతి మునివేళ్ళు పట్టణం బాటలో పయనించి విశ్వవిద్యాలయాలో మొగ్గతొడిగిన పొలిటికల్ కమీసార్ వయ్యావు బిగి పిడికిలి జెండా పిలుపులో నువ్వు సాగిన ఆ కల్లోల ప్రాంతపు అరాచకాలను చూసి చలించిన నీ మనస్సు