1. లేనప్పుడు " అప్పుడు గాలి చొరబడదు మాట నిర్మాణం కాదు మనిషి లేనప్పుడే ఉనికికి అర్థం, విలువ! అప్పుడు రాత్రి ఎంతకూ కదలదు రాత్రంతా.. వస్తువులు మాట్లాడుతుంటాయి మనిషి లేనప్పుడు వస్తువులు పుస్తకాలు బొమ్మలే మనుషులవుతాయి, మాటలవుతాయి. అప్పుడు ఏదీ కుదరగా ఉండదు ఎడబాటు తర్వాత సుదీర్ఘ తడబాటే! అప్పుడు పొలమారినట్టు , పొగ చూరినట్టు, మబ్బు కమ్మేసినట్టు కళ్ళ ముందరి వాళ్ళు కన్నీటి పొరలైనట్టు... అప్పుడు మాట్లాడనీ, పోట్లాడనీ అలగనీ, అదిరించనీ, బెదిరించనీ,భయపెట్టనీ.. నీ... నీ...నీ..... అప్పుడు లోకంగా,ప్రాణంగా,దేహంగా ఉండనీ... మనసుని, మనిషినీ, మనసైన మనిషినీ !! 2. కొత్తగా.. ప్రేమించే వాళ్ళు కాబట్టే -వాళ్ళట్లా