తూర్పు ముఖం
తెలుగు కవిత్వంలో దీర్ఘకవితలకు ప్రత్యేకత వున్నది.వస్తువును విస్తృతo చేయడానికి కవి ఎంచుకున్న కవితా మార్గం. నగ్నముని కొయ్యగుర్రం , శివారెడ్డి ఆస్ఫత్రి గీతం , వరవర రావు సముద్రం, ఎన్.కె.లాల్ బనో గులామి చోడో వంటి దీర్ఘ కవితలు భారత సమాజాన్ని అర్ధం చేసుకొని ధిక్కార స్వరాన్ని నమోదు చేసినాయి. కళ్యాణరావు #, కాలం*, కాశీం మానాల, గుత్తికొండ వంటి దీర్ఘకవితలు చరిత్రను, విప్లవోద్యమ చరిత్రను నమోదు చేశాయి. వీరందరూ దీర్ఘ కవితల పరంపరకు ప్రగతి శీల దారులు వేశారు. ఛాయారాజ్ వంటి విప్లవ కవులు దీర్ఘ కవితా ప్రక్రియలో రాయడానికి ఉత్సుకతను ,అభినివేశాన్ని కనబరిచే వారు