పత్రికలు

దండకారణ్య ఆదివాసులపై వైమానిక దాడులురాజ్యాంగ వ్యతిరేకం ప్రజలపై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని డిమాండ్‌ చేద్దాం

రౌండ్‌ టేబుల్‌ సమావేశం25 జనవరి 2023, హైదరాబాదుప్రెస్‌ నోట్‌ ఆదివాసీ హక్కుల కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న మేము జనవరి 11వ తేదీన దక్షిణ బస్తర్‌లోని కిష్టారం`పామేడు ప్రాంతంలో జరిగిన సైనిక దాడికి దిగ్భ్రాంతి చెందుతున్నాం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లలో కోబ్రా దళాలు, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు వెళ్లి బాంబులు దాడులు చేశాయి. ఈ దాడిలో పొట్టం హంగి అనే ఆదివాసీ యువతి మృతి చెందింది. రాజ్యాంగంలోని జీవించే హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం తానే ఈ దేశ ప్రజలపై  వైమానిక యుద్ధం చేయడం భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. మానవతకు వ్యతిరేకం. భారత ప్రజలు అనేక ప్రక్రియల ద్వారా, పోరాటాల