చెదరని ప్రొఫెసర్ ఎస్ఎఆర్ గిలానీ స్మృతి
సుమారు 11 సంవత్సరాల క్రితం, 2008 నవంబరులో, ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆర్ట్స్ ఫ్యాకల్టీలోని గది నంబర్ 22 లో "సామ్యవాదం, ఫాసిజం, ప్రజాస్వామ్య పదాల ఆర్భాటం- వాస్తవం" అనే అంశంపైన సెమినార్ నిర్వహించారు. సెమినార్ ముఖ్య వక్త విశ్వవిద్యాలయంలో అరబిక్ భాషా ప్రొఫెసర్, కశ్మీరీ ముస్లిం ప్రొఫెసర్ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ గిలానీ. ఈ అంశంపై గిలానీ కంటే మెరుగ్గా మాట్లాడగలిగే మరొకరు బహుశా దేశంలో లేరు. 2002 లో పార్లమెంట్‌పై జరిగిన దాడిలో ఆయన “వహించిన పాత్రకు”గాను కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. మీడియా విచారణ జరిపి, కోర్టు తీర్పు రాకముందే గిలానీని ఉగ్రవాదిగా ప్రకటించింది.










