నాకు నచ్చిన శికారి
పాణి రాసిన శికారి నవలలో నన్ను అమితంగా మెప్పించిన పాత్ర, నాకు నచ్చిన పాత్ర గుమ్లి. ఏ వర్గంలో అయినా స్త్రీలు సమాజ కట్టుబాట్లకు తల వంచక తప్పదేమో అని గుమ్లి పాత్ర ద్వారా నాకు అనిపించింది. భర్త ఎలాంటి వాడైనా పిల్లల కోసం స్త్రీ జీవన పోరాటం చేయక తప్పడం లేదు. ఇది ఈ సమాజంలో స్త్రీల స్థానాన్ని తెలియజేస్తుంది. గుమ్లి భర్త డొక్కోడు రెండో పెళ్లికి చెల్లించే కట్నం కూడా తానే ఇవ్వాల్సి వస్తుందేమో అని ఆమె అనుకుంటుంది. అప్పుడు భర్త రెండో పెళ్లికంటే దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుందనుకున్నప్పుడు గుమ్లి పడిన