సంపాదకీయం

ఫాసిస్టు వ్యతిరేక ప్రజాయుద్ధ సేనాని

స్టాలిన్‌ వ్యతిరేకతతో మొదలై కమ్యూనిస్టు వ్యతిరేకులుగా మారిపోయిన వాళ్లు చరిత్రలో కోకొల్లలు..’ అని చలసాని ప్రసాద్‌ డజన్ల పేర్లు ఉదహరించేవారు. ఇరవయ్యో శతాబ్దపు విప్లవాల్లో, సోషలిస్టు నిర్మాణ ప్రయత్నాల్లో స్టాలిన్‌ అంత జనామోద నాయకుడు లేరు. ఆయనలాగా విమర్శలు మోసినవాళ్లూ లేరు. బహుశా ఒక వెనుకబడిన పెట్టుబడిదారీ దేశంలో విప్లవోద్యమానికేగాక సోషలిస్టు నిర్మాణానికి కూడా నాయకత్వం వహించడం ఆయన ప్రత్యేకత. ఆ శతాబ్ది విప్లవాల ప్రత్యేకతల్లాగే ఆ కాలపు సోషలిస్టు నిర్మాణ ప్రత్యేకతలను కూడా పరిగణలోకి తీసుకొని చూడ్డానికి ఇప్పుడు చరిత్ర మనకు అవకాశం ఇచ్చింది. అందుకే ఇప్పటికీ విప్లవమన్నా, సోషలిజమన్నా స్టాలిన్‌ అజరామర పాత్ర మీద  అంతులేని
సంపాదకీయం

అదాని-ఆర్‌ఎస్‌ఎస్‌: భారత ఆర్థిక వ్యవస్థ

మత, ఆర్థిక వ్యవస్థల సంబంధం మీద చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఏ సందేహం లేనిది ఆర్‌ఎస్‌ఎస్‌కే. “గురూజీ” చెప్పినట్లు తమది సాంస్కృతిక సంస్థ కదా..పిందూ మతాన్ని ఉద్ధరించే సంస్థ కదా.. అదాని గొడవ మనకెందుకులే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకోలేదు. ఈ దేశంలోని పేదల గురించి, వాళ్ల కష్ట నష్టాల గురించి ఏనాడూ పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని ఆర్థికంగా 'నష్ట* పోతున్నాడని, ఆయన తరపున వకాల్తా తీసుకున్నది. అదాని గ్రూప్‌ ఆర్థిక సామ్రాజ్యం నేరాల పుట్ట అని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ అనే సంస్థ బైట పెట్టడగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ముందుకు వచ్చింది.
సంపాదకీయం

కార్పొరేట్ స్వామ్యంలో ప్రజలపై యుద్ధం

పాణి రాజకీయ అధికారం అనే మాటకు కాల క్రమంలో చాలా అర్థాలు మారాయి. ఎవరి అధికారం, ఎలాంటి అధికారం అనే మాటలకు ప్రజాస్వామ్యంలో నిశ్చయ అర్థాలు ఏర్పడ్డాయి. రాజ్యాంగాలు వాటిని రూఢపిరిచాయి. భారత రాజ్య రూపాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మన రాజ్యాంగం నిర్వచించింది. దీని ప్రకారం భారత భూభాగంపై సర్వంసహాధికారం ఈ దేశ ప్రజలది. ఆ ప్రజలు ఎన్ని సాంఘిక, సాంస్కృతిక వివక్షలతోనైనా బతుకుతూ ఉండవచ్చు. ఎన్ని రూపాల దోపిడీకైనా గురి కావచ్చు. కానీ వాళ్లకు రాజకీయాధికారం ఉన్నదని రాజ్యాంగం నమోదు చేసింది. ప్రజల తరపున దాన్ని అమలు చేసే ఏజెంటే ప్రభుత్వం. రాజనీతి శాస్త్రంలోని ఈ మౌలిక