నైతిక , మత , వ్యంగ్యాత్మకాలు
(1829లో వేమన పద్యాల కూర్పుకు బ్రౌన్ రాసిన ఇంగ్లీషు ముందుమాట) తెలుగు: సిఎస్‌ఆర్ ప్రసాద్ ఏదైనా ఒక భాషను అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మనం సహజంగానే దేశీయులలో ప్రజాదరణపొందిన పుస్తకాలను గురించి తెలుసుకోవాలని అశిస్తాం. ఆ పుస్తకాలు సరళమైన శైలిలో వుండి విదేశీయులు కూడా తేలికగా అర్థం చేసుకునేటట్లు వుండాలని అనుకుంటాం. తెలుగుకు సంబంధించి 1824లో ఇలాంటి పరిశోధన ప్రారంభించాను. ఆ సందర్భంగా ఈ పుస్తకంలో ప్రచురించిన పద్యాలతో నాకు పరిచయం కలిగింది. ‘వేమ’ లేదా ‘వేమన’ (రెండు పేర్లూ వాడుకలో వుండేవి) రచించిన అనేకమైన రాత ప్రతులు నాకు లభ్యమయ్యాయి. నేను వాటిని చదివి నా ఉద్యోగబాధ్యతల్లో