దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు. రచనను సామాజిక బాధ్యతగా గుర్తించినవాడు. తాను ఎన్నుకున్న వస్తువు దళిత, పీడిత కులాల అంతర్భాంగా వుండాలని తపన. మా ఎర్ర ఓబన్న పల్లె, ధనుస్సు అనే రెండు నవలలు, మాదిగ సామాజిక జీవితాన్ని అనేక కోణాల నుండి స్పృశించాయి. ఒకానొక స్థితిని అంచనా వేసాయి. ఎజ్రాశాస్త్రి రచనా మాద్యమాన్ని తను నడిచి వచ్చిన తొవ్వకు అనుసంధానం చేసుకున్నాడు. రచన ఒక బాధ్యత అని భావించినప్పుడు తన రచనా పద్ధతి ఎలాఉండాలో రచయిత నిర్ణయించుకుంటాడు. చంద్రవంక ఎజ్రాశాస్త్రి మూడవ నవల. ఈ నవల చారిత్రక ఉద్యమ నవల. ఇందులో పాత్రలు వాస్తవికమైనవి.