ఇరవై నాలుగు గంటలు – పది మైళ్ళు
ఆ స్త్రీలు యుగాలుగా నడుస్తున్నారు..నడుస్తూనే ఉన్నారు…యుగాలుగా వంటింట్లో... అమ్మమ్మ.. నానమ్మ.. ముత్తమ్మ .. అమ్మ.,పిన్ని, అక్క, అత్త.. కోడళ్లు ,భార్యలు , కూతుర్లు ., ఇంకా చాలా మంది గుస గుస లాడుతూ.. మూల్గుతూ .. కొన్నిసార్లు ఒకరితో ఒకరు కొట్లాడుతూ,,అరుచుకుంటూ బట్టలు నాని పోయేంతగా చెమటలు కక్కుతూ ! కత్తులూ .. ఫోర్కులూ .. గరిటెలు.. ఉడుకుడుకి పోతూ ఆవిర్లు కక్కుతూ అరిచరిచి ఆగిపోయే కుక్కర్లు .. బజ్జీలతో కాగి కాగి ., మసలి మసలి పోయే బాండళ్ళు.. కప్పులూ.. సాసర్లు .. వణికే వేళ్ళతో పట్టుకుంటూ .. జారవిడుస్తూ ! ఆ స్రీల