వ్యాసాలు

మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

ప్రొ. జిఎన్‌ సాయిబాబ కేసుగా ప్రపంచ గుర్తింపు పొందిన మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు 2013లో ఆహిరి పోలీసు స్టేషన్‌లో నమోదైంది. ఇందులోని ఆరుగురిలో మహేష్‌ టిర్కితోపాటు పాండు నరోటే, విజయ్‌ టిర్కి ఆదివాసులు. మిగతా వాళ్లు ప్రొ. సాయిబాబ, ప్రశాంత్‌రాహి, హేమ్‌మిశ్రా. పదేళ్లకు పైగా నడిచిన ఈ జీవిత ఖైదు కేసు బహుశా దేశ చరిత్రలోనే అరుదైన, అతి దుర్మార్గమైన కేసుగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ ఆరుగురి మీద కేసు పెట్టిందనే సంగతి ప్రజల కామన్‌సెన్స్‌లో కూడా భాగమైంది. ఈ ఆరుగురిలో ఒకరి(పాండు నరోటే) జీవితాన్నే హరించిన, ఐదుగురి పదేళ్ల