బస్తరును కాపాడుకుందాం
ప్రొఫెసర్ సాయిబాబా రాజ్య వ్యవస్థీకృత హింస, నిర్బంధం కారణంగా అమరుడైన సందర్భంగా గత అక్టోబర్ నుంచి విజయవాడ బుక్ ఫెయిర్ (జనవరి మొదటి వారం) దాకా కవులు, రచయితలు బుద్ధిజీవుల్లో ఊహించిన దానికన్నా ఎక్కువగా స్పందన వచ్చింది. ఒక నెల కూడా గడవకుండా ఫిబ్రవరి 8, 9 తేదీల్లో సాయిబాబా అమరత్వం సందర్భంలో సంక్షోభ కాలంలో సాహిత్యం భూమిక’ గురించి విరసం ఏర్పాటు చేసిన రెండు రోజుల సాహిత్య పాఠశాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. అందులో యువత ఎక్కువగా పాల్గొన్నారు. ఈ సాహిత్య పాఠశాలను ప్రారంభిస్తూ సాయి సహచరి వసంత