మావోయిస్టు నిర్మూనలకు రూ.5 కోట్ల ప్రోత్సాహకం
దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి చేరిన మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో వున్నారు. ఈ సంవత్సరం, ఛత్తీస్‌గఢ్ ఈ ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, 38 ఎన్‌కౌంటర్లలో 141 మంది మావోయిస్టులను హతమార్చామని పోలీసులు పేర్కొన్నారు. ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ. ఈ సీరీస్‌లో ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో మాట్లాడి ఆ సంఖ్యల వెనుక ఉన్న కథనాలను స్క్రోల్ వెబ్ సైట్ అందిస్తోంది. ఆ ఫోటోలో మహిళ