ఎంతటి నిషి

ఈ వసంతాన్ని ఆవరించిననూ

ఎంతటి కుంభవృష్టి

ఈ వాసంతాన్ని ముంచిననూ

ఎంతటి అనావృష్టి

ఈ వసంతాన్ని వంచించిననూ

వారు

చుక్కలవలే వెలిగి

జ్ఞానాన్ని వెలువర్చారు

సూర్యునివలే గర్జించి

శక్తిని చేకూర్చారు

చినుకువలే స్పందించి

వసంతానికి ఉపిరిపోసారు

వారు

ఉల్కాపాతం వలే

ఊపిరినొదిలి

ఈ పాలపుంతలో

వారి జ్ఞాపకాలను

ఆశయాలను

వదిలిపోయారు

అయితే

మేమే శృష్టికర్తలమను

గర్వంతో

విర్రవీగే వాళ్ళకు

వారి అమరత్వం

తలచుకున్నా

వెన్నులో వనుకే

అందుకే

స్థూపాన్ని ఆపాలనుకుంటారు

సభలని అడ్డుకుంటారు

పుస్తకాన్ని నిషేదిస్తారు

Leave a Reply