నాలుగు గోడల మధ్య నుంచి
నలుగురి మధ్యలో నిలవాలన్న
నలుగురిలో గెలవాలన్న
నలుగురిని గెలిపించాలన్నా
నాలుగు అక్షరాలు నేర్చు కోవాలని 
చెబుతూ ఉండేది  అమ్మ!!

నాలుగు అడుగులు వేయాలన్న
నాలుగు రాళ్ళు పోగేయలన్న
నలుగురిని సంపాదించు కోవలన్న
నలుగురికి సాయo చేయాలన్న 
నాలుగు అక్షరాలు నేర్చు కోవాలని
చెబుతూ ఉండేది అమ్మ!!


గుడి తలుపులు బడి తలుపులు
ఎప్పుడు ఎదురుచుస్తుoటాయి
నీ ఎదుగుదలకు తోడ్పడుతుంటాయి
గుడి బడి తల్లి తడ్రులు లాంటి వాళ్ళని
మంచి కథలతో ఎన్నే నీతులు బోధిస్తూ
ఎప్పుడు హితాన్ని మరవకూడదని
సత్ మార్గంలో పయనించలని
పరుల ఘోషకు కారణం కాకూడదని
చెబుతూ ఉండేది  అమ్మ!!


గెలుపు ఓటములనును
స్వేచ్చగా స్వీకరించమంటు 
ఎదురయ్యే ఆటు పోటులకు 
ఎదురెళ్లి సవాళ్లు విరసమనేది
తల దించే క్షణాలను తరిమికొట్టమనేది
భుజాలమీద ధైర్యాన్ని వేసుకొని
ప్రయాణం సాగించాలoటూ
చెబుతూ ఉండేది  అమ్మ!!

Leave a Reply