అతని అక్షరాలు
అనంత కోటి పీడిత
జనహృదయ వేదనలో
వెలిసిన నక్షత్రాలు
వెలుగు ఇవ్వటమే వాటి పని

అతని అక్షరాలు
ప్రజల ప్రతిఘటన పోరులో
చెక్కిన శిల్పాలు
రేపటి చరిత్రకు మూలాలు

అతని అక్షరాలు
అమరుల రక్తములో
తడిసిన విత్తనాలు ఏ పొలంలో చల్లినా
ఆయుధాలే మొలుస్తాయి

Leave a Reply