ఎం.ఎస్. ఆర్ రాసిన రచనలన్నింటిలోను విప్లవ కరుణాత్మకత సృష్టంగా ప్రతిఫలిస్తుంది. ప్రతి సమస్యపట్ల సున్నితత్వం, త్వరితం అయిన ప్రతిస్పందన కలిగిన ఎం.ఎస్. ఆర్ ఈ రెండు సంవత్సరాలలో జరిగిన అనేక సంఘటనలపై విలక్షణమైన పద్దతిలో మార్క్సిస్టు దృష్టితో కవితలు రాసాడు.

తన తల్లిపై ప్రేమతో స్త్రీల విముక్తికై రాసినా పీడిత కులానికి చెందిన విద్యార్థిగా రిజర్వేషన్ వ్యతిరేకులపై రాసినా, చుండూరు మారణకాండ పై రాసినా , గల్ఫ్‌ యుద్దం పె రాసినా కార్మికుల బాధలపె రాసినా తోటి కామ్రేడ్స్ అమరత్వంపై, శత్రువు నిర్భంధం, అణచివేతలపై రాసినా ఎన్నుకున్న కోణం విలక్షణంగా వుండి, ఆ నమన్యలకు వరిష్కారం నూతన ప్రజాస్వామిక విప్లవంలో వుందని చక్కగా చూపించాడు.

విరసం వర్ధమాన కవులలో ఎన్నదగినవాడు వాడైన ఎం.ఎస్. ఆర్ 22 నీళ్ళ వయసుకే అమరుడయ్యాడు. వికసిన్తున్న ఒక పుష్పం తెంపివేయబడ్డది. విప్లవోద్యమం ఒక మంచి కార్యకర్తను, విరనం ఒక మంచి కవిని, ప్రజలు ఒక ఉత్తమ పుత్రుడిని కోల్పోయారు.

  • మంజీర

Leave a Reply