నడుస్తూ మాటాడుకుందాం

నడకాగితే మాటాడలేను

ఈ రాతి పలకల మీద 

చెంగున దూకి జారే ఆ పిల్లల

లేత పాదాలను తాకి

మాటాడుకుందాం

ఎన్నెన్ని ఎన్నెల రాత్రులలో

వెలిగిన ఈ నెగడు చుట్టూ

కలబోసుకున్న కథలలో

ఎంత దుఃఖం దాగి వుందో

మరొకసారి మాటాడుకుందాం


ఎత్తైన ఈ పచ్చని కొండలపై

పహరా కాస్తున్న మేఘాల నడుమ

సెంట్రీ కాస్తున్న ఈ పిలగాళ్ళ

చూపులను దొంగిలించే 

ఆ తోడేళ్ళ ద్రోన్లను కూల్చే 

వడిసెల కథ చెప్పుకుందాం 

ఒకసారి


సూరీడా సూరీడా 

త్వరగా రారమ్మని 

పిలిచే ఆ తల్లి 

ప్రసవ వేదన 

అరణ్యమంతా వినిపించే 

గాధ కదా 


రా అలా లేలేత ఆకుల

స్పర్శను తాకుతూ

మాటాడుకుంటూ 

నడుద్దాం…

Leave a Reply