సింగరేణీ కార్మిక వర్గంలో
మొలకెత్తిన ఎర్రమందారం నీవైతే
నీవు వెదజల్లే
ఆ పరిమాళానికి వీచే గాలిని నేనవనా కామ్రేడ్
నా విప్లవ పయనానికి
నడక నేర్పిన సాయుధ శక్తివి నీవైతే
ఆ పయనంలో పీడిత ప్రజల ముక్తిని
సాధించే బందూకునేనవనా కామ్రేడ్
సాధారణ సుదర్శన్ నుండి
కా.ఆనంద్ గా, దూల గా
5 దశాబ్దాల అలుపెరుగని జన పోరు సంద్రంలో
నూతన ప్రజాస్వామ్యాన్ని వాగ్ధానం చేసిన
దృఢమైన విప్లవ కార్యదీక్ష నీవైతే
ఆ లక్ష్యాన్ని అల్లుకునే
కార్మికవర్గ స్పర్శను నేనవనా కామ్రేడ్
భారత విప్లవోద్యమ సారధిగా
యుద్ధ రచన చేసిన నీ ప్రతి అక్షరం
కుళ్ళిన ఈ దోపిడీ సమాజాన్ని తప్పక కూల్చుతది కామ్రేడ్.
Related