దేశమంతా సంబరాల
పేరుతో మాయల ఫకీరు
ఉచ్చులో ఊరేగుతున్న వేళ

దాహమంటూ గ్లాసుడు
నీళ్ళు తాగితే
కొట్టి కొట్టి చంపిన
అపర బ్రహ్మలున్న చోట

అమృతమెవడిదో
విష పాత్ర ఎవరిదో
బెత్తంతో గిరిగీసిన
పంతుళ్ళకు
ఏ శిక్షా లేని చోట

నీ ఇంటి మీద
ఏ జెండా ఎగరేయగలవు
చిన్నోడా!

కులమొక్కటే
మతమొక్కటే
ఏక్ భారత్
శ్రేష్ఠ భారత్
అని కూస్తున్న
మర్మాల మర శబ్దాల
నడుమ
నీదీ నాదీ
కాని దేశం కదా
ఇది

తొమ్మిదేళ్ళ నీ
చిన్ని గుండెపై
మండిన అగ్ని కీలలు
ఆ చూపుడు వేలు
చివరల మండుతూ
ఎగసిపడతాయా
ఏనాటికైనా?

(కుండలో నీళ్ళు తాగి చావుకు గురైన ఇంద్రా మేఘవాల్ కు క్షమాపణలతో)

3 thoughts on “ఎవరిదీ జెండా

  1. Ek bharat??? our democracy -equality -justice — freedom — all are jokes in our
    Country —no truth — 75 years independence — nothing changed —k.Kobe. Sir nice one
    =====================
    Buchireddy gangula

Leave a Reply