‘ది వైర్’ కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి, ప్రొఫెసర్ ఖమ్ ఖాన్ సువాన్ హౌసింగ్; కుకీ ఉమెన్స్ ఫోరమ్ కన్వీనర్ మేరీ గ్రేస్ జూ; కుకీ పీపుల్స్ అలయన్స్ ప్రధాన కార్యదర్శి విల్సన్ లాలం హాంగ్షింగ్ లకు ఇంఫాల్ కోర్టు సమన్లు జారీ చేసింది.

కరణ్ థాపర్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలలో, ఆ ముగ్గురూ మణిపూర్ కుకీ సముదాయానికి  ప్రత్యేక పరిపాలన ఉండాలనే డిమాండ్‌కు మద్దతునిచ్చారు. దీనితో ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు పలు ఐపీసీ నిబంధనల కింద వారిపై ఫిర్యాదులు నమోదయ్యాయి.

ప్రొఫెసర్ హౌసింగ్ పై మెయితీ ట్రైబ్స్ యూనియన్ (MTU) సభ్యుడు మణిహార్ మొయిరంగ్థేమ్ సింగ్ చేసిన ఫిర్యాదులను  స్వీకరించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అషేమ్ తరుణకుమారి దేవి, జూలై 6న  ఇంఫాల్ తూర్పు జిల్లా కోర్టుకు రావాలని సమన్లు పంపింది.

MTU అనేది రాష్ట్రంలోని మెజారిటీ మెయితీ సముదాయానికి షెడ్యూల్డ్ తెగ హోదాను సిఫార్సు చేస్తూ మణిపూర్ హైకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వును అందించిన సంస్థ. ఈ ఉత్తర్వు అంతిమంగా మణిపూర్‌లో కొనసాగుతున్న హింసకు దారితీసింది. ఈ  హింసాకాండ వలన ఇప్పటివరకు కనీసం 150 మంది మరణించారు. 40,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

ప్రొఫెసర్ హౌసింగ్  పైన వచ్చిన ఫిర్యాదులు వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా వ్యవహరించే 153A సహా భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని వివిధ సెక్షన్లను కలిగి ఉన్నాయి; 295A – మతపరమైన భావాలను ఉల్లంఘించే చర్యలకు;  501 (1),  పరువు నష్టం కలిగించే విషయాలను ముద్రించడానికి సంబంధించిన సెక్షన్లు.

రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండలో అంతర్లీనంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని, మైనారిటీ కుకీ సముదాయానికి ప్రత్యేక పరిపాలనను ఏర్పాటు చేయాలని జూన్ 17న యిచ్చిన ఇంటర్వూలో  ప్రొఫెసర్ హౌసింగ్ అన్నారు.

 ప్రొఫెసర్ హౌసింగ్ “చరిత్రాత్మకంగా మైతీ కమ్యూనిటీతో సంబంధం ఉన్న పవిత్రమైన మతపర  ప్రదేశాలకు వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసాడనీ,  మైతీల పరువు తీసేందుకు ప్రయత్నించాడని  మణిహార్ సింగ్ తన ఫిర్యాదులో చేసిన ఆరోపణపై అందజేసిన నోటీసుపై   జులై 28లోగా  స్పందించాలని జిల్లా కోర్టు హౌసింగ్ ను ఆదేశించింది.

జూలై 7 న చేసిన ట్వీట్లో హౌసింగ్ ఇలా అన్నారు:

“ఒక ఆధిపత్య రాజ్యమూ,  దాని పాలనా తన శక్తివంతమైన గుత్తాధిపత్య అధికారాన్ని సత్యాన్ని అణచివేయడానికి,  శిక్షార్హత లేకుండా మానవ హక్కులను ఉల్లంఘించడానికి ఎంచుకుంటే; మనం ఐక్యంగా ఉండి, వాటిని తిరిగి పొందాలి

— ఖమ్ ఖాన్ సువాన్ హౌసింగ్ (@kksuanh) జూలై 7, 2023

హౌసింగ్ పై న్యాయస్థానం తీసుకున్న చర్యలను ఖండిస్తూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ని రాజనీతి శాస్త్ర విభాగంలోని ‘కమ్యూనిటాస్’ అనే విద్యార్థి సంస్థ అతని విద్యా స్వేచ్ఛతో పాటు వ్యక్తిగత భద్రతకు కూడా ముప్పు తెచ్చిపెడుతుందని పేర్కొంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.

“ప్రొఫెసర్ హౌసింగ్ ఈశాన్య భారతదేశ అంశాలపై ప్రముఖ పండితుడు.  ఈశాన్య ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై చాలా కాలంగా,  గొప్ప నిశితంగా వ్రాస్తున్నారు” అని ప్రకటన పేర్కొంది. “విద్యారంగంలో సాధారణంగా జరిగినట్లుగా వివిధ విద్వాంసులు అతని వ్యాఖ్యానాన్ని అంగీకరిస్తూ, విభేదిస్తూ కూడా చర్చిస్తున్నారు. అయితే, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన మనోభావాలను కించపరచడం, నేరపూరిత కుట్రలో నిమగ్నమయ్యారని ఆరోపిస్తూ అతనిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపడం అనేది అతని విద్యా స్వేచ్ఛకు తీవ్రమైన ముప్పు మాత్రమే కాదు, ప్రస్తుత రాష్ట్రంలో వున్న అనిశ్చిత  పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే అతని భౌతిక భద్రతకు కూడా ముప్పు వుంది.

కుకీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకున్నారు:

జూన్ 14న కరణ్ థాపర్‌తో హింసాకాండ ఫలితంగా రాష్ట్రంలోని కుకీ సంఘం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జో మాట్లాడారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలనే పిలుపుతో పాటు కుకీ సముదాయానికి ప్రత్యేక పరిపాలన కోసం కూడా ఆమె మద్దతు ఇచ్చింది.

మే 26న తన ఇంటర్వ్యూలో, బిజెపి అనుకూల కుకీ పీపుల్స్ అలయన్స్‌కు చెందిన హాంగ్‌షింగ్, ఒక ఎమ్మెల్యే ఇంటిని గుంపులు తగలబెట్టడానికి ముఖ్యమంత్రి సింగ్ అనుమతించారని, ప్రత్యేక పరిపాలనా విభాగం కోసం కుకీలు పోరాడతారని చెప్పారు.

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండను మైతేయి మూకలు  ఆరంభించాయని, ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ హింసకు సహకరించారు అని జో, హ్యాంగ్‌షింగ్ లు”తప్పు”గా నిందించారని, సోమెరెండ్రో తన ఫిర్యాదులో ఆరోపించారు .

“మేరీ గ్రేస్ జో ప్రకటన పూర్తిగా అబద్ధం, కల్పితం, ఇది మెయితీ, కుకీ సముదాయాలల మధ్య మతపరమైన శత్రుత్వాన్ని, ద్వేషాన్ని కలిగిస్తుంది” అని సోమెరెండ్రో తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఇంఫాల్ టైమ్స్ పేర్కొంది. వివిధ సెక్షన్ల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేందుకు హ్యాంగ్‌షింగ్ కూడా తప్పుడు ప్రకటనలు చేశారని ఆయన అన్నారు.

జో, హాంగ్‌షింగ్ ల పైన “153A, 200, 505 (1) సెక్షన్‌ల కింద నేరాల చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని” అన్న మేజిస్ట్రేట్ వారిని జూలై 24న కోర్టుకు హాజరు కావాలని కోరారు.

పుస్తక రచయితపై చర్యలు:

మరొక సందర్భంలో, మణిపూర్ గృహమంత్రిత్వ శాఖ, 2023లో మణిపూర్‌లో ది ఇన్విటబుల్ స్ప్లిట్: డాక్యుమెంట్స్ ఆన్ స్టేట్ స్పాన్సర్డ్ ఎత్నిక్ క్లీన్సింగ్ (అనివార్య విభజన: మణిపూర్‌లో రాష్ట్ర ప్రాయోజిత జాతి ప్రక్షాళనపై పత్రాలు, 2023)అనే పుస్తకాన్ని ప్రచురించిన జోమి స్టూడెంట్స్ ఫెడరేషన్ యూనియన్ సభ్యులపై చర్య తీసుకోవాలని, ఆ పుస్తక తరువాతి ప్రచురణ నిషేధానికి గురయ్యేట్లు చూడాలని  కూడా పోలీసులకు చెప్పింది.

– https://m.thewire.in/article/rights/hyderabad-university-professor-two-kuki-activists-summoned-by-imphal-court-for-interviews-to-the-wire

Leave a Reply