ఇనుపగోళాల్లోకి ఇముడుతున్న మానవ సమూహాలు. నీళ్ల పొదుగుల్లో దాహం తీరక ఉక్కిరిబిక్కిరవుతున్న దిక్కులేని కాలం. నిరంతరంగా సాగుతున్న పరిణామంలోకి ఇముడుతున్న దృశ్యాలు. విరిగిపోతున్న అనుభవాల సమూహం.
ఇక్కడ మనిషిని తూర్పారబడుతున్నదెవరు?
ఈ మనిషి సారంలోంచి విత్తనాల్ని, పొల్లుని వేరుచేస్తూ పొల్లుగానే మిగిల్చే ఈ పెనుగాలు లెక్కడివి?
ఉసిళ్ళగుంపులా కదులుతున్న ఈ సమూహాల మధ్య
మసిబారుతున్న జీవన కాంతుల మధ్య
తుఫానుల విరుచుకుపడుతున్న ఈ ప్రశ్నలెక్కడివి?
ఇక్కడ కాగితప్పూల పరిమళాల్ని సృష్టిస్తున్న సృష్టికర్తలెవరు?
1
సందేహాల మధ్య, చావుబతుకుల మధ్య, సర్ప పరిష్వంగాల నడుమ కరుగుతున్న జీవితాలు.
ప్లాస్టిక్ సన్నివేశాల సమాధానాలు.
2
దూరం దూరం
మనిషికీ మనిషికీ మధ్య ఎవరూ అతకలేనిదూరం
షట్టర్లుగా తెరుచుకుంటున్న రోజుల్లోకి దిగుమతవుతున్న మనిషి
బళ్లమీద, టీకొట్టుల మీద, వర్కుషాపుల్లో, రోడ్ల మీద, పొలాల్లో చారికలు కట్టి ఘనీభవించే చెమట చుక్కల మధ్య మనిషి.
మనిషిని ఛీత్కరిస్తున్న
ఈ సందిగ్ధకాల మెక్కడిది?
3
కంప్యూటర్ తెరల మీద దర్శించే జీవితాల్ని
ప్రామాణీకం చేసుకునే సాంకేతిక సంస్కృతిలోకి
తలుపులు తీస్తున్న ఆ అమానవులెవరు?
గొంతు స్వేచ్చగా పెగల్చనీయని మతప్రమేయాలు, భూమిని సరిహద్దుల
మధ్య బంధించి మనిషిని కాందీశీకుణ్ణి చేస్తున్న రాజ్యాలు, గాలిపీల్చినంత సులభంగా చంపగలిగే క్రౌర్యం.
అవమానాల, అసహనాల ఉరితాళ్లను పేనుతున్న ఆ చేతులెవరివి ?
కులం, మతం, ప్రాంతం, నలుపు, తెలుపు పొలికేకల మధ్య, కుట్రల మధ్య నలుగుతున్న అస్థిపంజరాలవంటి మనుషుల్ని నిర్మిస్తున్న వారెవరు !?
మనిషిచుట్టూ అల్లుకుంటున్న ఈ యంత్రపుగూడు ఎక్కడిది?
4
బతుక్కీ చావుకీ తేడా లేనంత
బతుకు స్వరూపాన్ని రూపొందించే
ఆధిపత్య భావజాలాల అంతస్సూత్రమెక్కడిది ?
ఉగ్గబట్టిన రోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న బతుకుల్లోకి బొట్లుబొట్లుగా పడుతున్న విషబిందువుల మూలం ఎక్కడిది?
*
ఈ కాలం ఒక పెద్ద ప్రశ్న .
మెలికలు తిరుగుతూ భయపెడుతున్న కొండచిలువ.
భయపెడుతున్న పీడకల.
ఇది ప్రశ్నల్లోంచి ప్రశ్నల్లోకే పయనిస్తున్నది.
Related
For all these questions —ANSWER is manam//. JANAM—why people give too much importance
To Kulam /matham /devudu —avasaramaa ?? Manishi bathakadaaniki ??
75 years independence — no change — same families ruling the country —plus varasathva paalanalu —same names —same families —NO CHANGE —
ARTHIKA SAMANATHVAM AVASARAMAA
DALITHULAKU —MUSLIMS LA KU RAAJYAADHIKAARAM RAAVAALI
NEEDS CHANGE IN OUR EDUCATION SYSTEM—
PEOPLE NEEDS TO QUESTION //ASK —ASK —