నాకు కావాల్సింది
వేరు నెత్తురులో ఇంకిపోయిన సముద్రం
ఇక్కడ నుంచుంటే అక్కడ రాలిపడే ఆకుల చర్మం కాదు
మూలాల్లోకి ఇంకా ఇంకా నడవాల్సిన బాకీ
ఎప్పుడూ వెంటాడుతుంది
మట్టి తన గుట్టు విప్పమని పిలుస్తుంది
గుండెల నిండా పర్వతాల్ని మోస్తూ పరుగులు పెట్టే వెర్రి వాగులు
కొరడాలై కొడుతూ ఉంటాయ్
పూర్తికాని ఇల్లూ తెరవలేని తలుపులూ తెల్లారేసరికి
ఎజెండాలను దండే నికి తగిలిస్తాయ్
ఇటుపక్క ఎండ నిప్పులు చిమ్ముతుంటే
అటుపక్కకు తిరిగే అడవి నోటినిండా పాఠాలే
ఒంగిపోయారా లొంగిపోయారా మొసళ్ళ పళ్ళు తోమారా
మృగాల వళ్ళు పట్టారా లేక తోడేలునూ మేకనూ కలిపి
ఒకే వేటుకు నరికారా తరవాతి విషయం
తరతరాలుగా కనురెప్పల కింద వణుకుతున్న
కన్నీటి వంతెన మీద నడుస్తూ ఎప్పటికప్పుడు పైకప్పులు
విరిగిపడుతున్నా తట్టుకొని నిలబడే అడుగు జనం చేవే
నీకైనా నాకైనా ఈ కలమూకాగితామూ రాసే వాక్యానికయినా స్ఫూర్తి
చేవ…కవిత చాలా బావుంది…సర్..శుభాకాంక్షలు
Cheva is wonderful, touchy and reflective.