మనం ఎప్పుడు అతనికి
శత్రువులమే ..
ఎందుకంటే
మన "జాతి" అస్తిత్వం కోసం
పోరాడుతున్నాం..
సంవత్సరాలుగా సమూహంపై
అమలవుతున్న ఆధిపత్యాన్ని
ఎదురిస్తున్నాం..
"జాతీయత" పేరు మీద
"ప్రాంతీయతను"
అణిచివేస్తే
తిరుగుబాటు దారిని ఎంచుకున్నాం
రాజ్యం రక్తపు
రుచి మరిగిన హింసోన్మాది
స్వేచ్ఛ , స్వయంప్రతిపత్తి
మన నినాదం..
మనిషి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలనేది
మనందరి ఆశ..
మనల్ని
తెలంగాణ లో నక్సలైట్ అన్నా
ఈశాన్యంలో వేర్పాటు వాదీ అన్నా
కాశ్మీర్ లో ఉగ్రవాది అన్నా ...
హింసను ప్రతిఘటించడం
జాతిని విముక్తి చేయడమే
అంతిమ లక్ష్యం..
(జాతి విముక్తి పోరాటాలకు మద్దతుగా...
హక్కులను అనచడం లో రాజ్యం ఏ ప్రజా పొరటంపై అయిన ఒకే ఫాసిస్ట్ వైఖరి తో పనిచేస్తుంది అని నా అవగాహన అందుకోసమే కశ్మీర్ తో మిగితా పోరాటాలను పోల్చడం జరిగింది)
Related