అతడు

మన రక్త బంధువు కాకపోతేనేం

నలభై ఏళ్లుగా రక్తం ఎవరికి 

ధారపోశాడో తెలుసుకో

అతను

మన కులంవాడు కాకపోతేనేం

నలభై ఏళ్లుగా

ఏ కులాల వైపు నిలబడ్డాడో చూడు

అతను 

మనకు అక్షరాలు నేర్పకపోతేనం

నలభై ఏళ్లుగా నేర్చుకున్న ప్రతి అక్షరం

ఏ వాడల్లోని సూర్యోదయానికి పొదిగాడో  చూడు

అతను 

మన మతం వాడు కాకపోతేనేం

నలభై ఏళ్లుగా 

మత రహిత నూతన మానవ ఆవిష్కరణకు చేసిన

ప్రయోగాలు ఎన్నో కనుక్కో

అతను

మన సిద్ధాంతాన్ని అంగీకరించకపోతేనేం

నలభై ఏళ్లుగా మనందరం కలిసి నిర్మించాల్సిన జగత్తు కోసం  

ఏ ఏ దారుల్లో పాదయాత్ర చేశాడో చూడు

అతను

మన ఊరివాడు కాకపోతేనేం

నలభై ఏళ్లుగా నాటిన పోరు మొక్కలు

ఏ ఊరి పొలిమేరల్లో పంట పొలాలయ్యాయో కనుక్కో

అతను నడిచిన దారిలో

మన కోసం

స్వచ్ఛమైన ఆక్సిజన్‌ కోసం

నాలుగు అడుగులు వేద్దాం. 

One thought on “జర్నీ

Leave a Reply