ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జాతీయ స్థాయిలో ప్రచారం 

దేశ‌వ్యాప్త ప్ర‌గ‌తిశీల సంస్థ‌లు, ర‌చ‌యిత‌లు, మేధావులు

(దండ‌కార‌ణ్యంలో బాంబు దాడుల‌ను వ్య‌తిరేకిస్తూ దేశ‌వ్యాప్తంగా వివిధ ప్ర‌జాతంత్ర సంస్థ‌లు క‌దిలాయి. అనేక మంది ర‌చ‌యిత‌లు, మేధావులు ముందుకు వ‌చ్చారు. దేశంలోని ఒక భూభాగం మీద ప్ర‌భుత్వం వైమానిక దాడులు చేయ‌డం ఏమిట‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ ఒక ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. – వ‌సంత‌మేఘం టీం)

సుక్మా, బీజాపూర్ అడవులలో గుంతలు, బాంబు అవశేషాల క‌నిపిస్తున్నాయి.  వాటికి  కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు వివరణనిస్తాయా? 2022 ఏప్రిల్ 14-15 మధ్య రాత్రి బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని బొట్టం, మెట్టగూడెం (ఉసూర్ బ్లాక్), మడ్ప దూలేడ్, సకిలేర్, పొట్టేమంగుం (కొంటా బ్లాక్) గ్రామాలలో   వైమానిక దాడులు జరిగినట్లు వస్తున్న వార్తా నివేదికల గురించి మేము చాలా ఆందోళన చెందుతున్నాము.(నివేదికల పాక్షిక జాబితా జతచేసాం).

బోట్టెటాంగ్ గ్రామం, మెట్టగూడ తదితర ప్రాంతాల నుండి  విలేఖరులు పంపిన ఫోటోల్లో అడవుల్లో పేలుడు పదార్థాల అవశేషాలు, గుంతలు, అటవీ నాశనం కనపడింది. అడవి నుంచి పెద్ద శబ్ధాలు వినబడ్డాయని, మంటలు చెలరేగాయని గ్రామస్తులు చెప్పారు. అడవులు “నిర్జన” ప్రదేశాలు కాదనే విషయాన్ని గమనించాలి. ఇది మహువాను సేకరించే కాలం. ఎండెక్కక ముందే తిరిగి రావాలని తెల్లవారుఝామున 3 గంటలకే నిద్ర లేచి గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు మహువా ఏరడానికి వెళ్తారు. కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించడం, పశువులను మేపడం, రోజువారీ పనుల కోసం ప్రజలు నిత్యం అడవుల్లోకి వెళ్తుంటారు. అడవిలోకి పౌరులు ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి, అడవులపై వైమానిక దాడులు చేయడం అంటే పౌరులపై ప్రత్యక్ష దాడి చేయడంతో సమానం.

బాంబు దాడులకు డ్రోన్‌లను ఉపయోగించారనడాన్ని పోలీసులు ఖండించినప్పటికీ, అడవిలో వున్న గుంతలు, వైర్లు, తదితర యుద్ధ సామాగ్రి అవశేషాల ఉనికిని వివరించాల్సి వుంది. ఏ రకమైన మందుగుండు సామగ్రిని ఉపయోగించారు, ఈ రకమైన దాడి చేయడానికి గల కారణాలను అధికారులు స్పష్టం చేయడం ముఖ్యం. 2010లో అప్పటి ఎయిర్ చీఫ్ మార్షల్ “సైన్యానికి పరిమిత ప్రాణాపాయాన్ని కలిగించే ఆయుధాలనుపయోగించే శిక్షణ ఇవ్వలేదు. మన దగ్గర ఉన్న ఆయుధాలు సరిహద్దుల్లోని శత్రువుల కోసం ఉద్దేశించినవి. అందువల్ల, నక్సల్ సమస్య వంటి పరిస్థితుల్లో వైమానిక దళాన్ని ఉపయోగించడాన్ని నేను సమర్థించను. (ది హిందూ, 7 ఏప్రిల్ 2010) అన్నారు. 

విచిత్రమేమంటే, వైమానిక దళం పాల్గొనకపోయినప్పటికీ ఇప్పుడు అదే జరిగినట్లు కనిపిస్తోంది. ప్రాణాంతక మందుగుండు సామాగ్రి, అధునాతన దాడుల్లో అమాయక ఆదివాసీలు బలయ్యే ప్రమాదాలను ‘తత్సంబంధ’ నష్టంగా వివరించలేము. పౌరులను లక్ష్యంగా చేసుకునే ఇటువంటి చర్యలను తక్షణమే ఆపాలి.

ఈ ఘటన క్రింది ప్రశ్నలను లేవనెత్తుతుంది: 

  1. ఈ ప్రాంతాల్లో కేంద్రం, రాష్ట్రాలు డ్రోన్‌లు లేదా ఇతర వేదికలతో ఏ చట్టం ప్రకారం వైమానిక దాడులను నిర్వహిస్తున్నాయి?
  2. పై నుంచి జారవిడిచిన ప్రాణాంతక మందుగుండు సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే, ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్నది ‘అంతర్జాతీయేతర సాయుధ సంఘర్షణ’ అని, కేవలం శాంతి భద్రతల సమస్య కాదని ప్రభుత్వం అంగీకరించక తప్పదు. భారతదేశం ఆమోదించిన జెనీవా ఒప్పందాల సాధారణ ఆర్టికల్ 3 పౌరులతో అమానవీయంగా ప్రవర్తించడాన్ని నిషేధిస్తుంది. పౌర రక్షణను హెచ్చించే జెనీవా ఒప్పందాల అదనపు ప్రోటోకాల్ II పై భారతదేశం తప్పనిసరిగా సంతకం చేయాలి. ఏది ఏమైనప్పటికీ, ఆయుధాల విచక్షణారహిత ఉపయోగాన్ని నిషేధించే సాధారణ  అంతర్జాతీయ చట్టానికి భారతదేశం కట్టుబడి ఉంది.
  3. వైమానిక దాడుల నివేదికలు మావోయిస్టుల ప్రచారమని అంటున్న ప్రభుత్వం, స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించడమో లేదా శ్వేతపత్రం విడుదలనో ఎందుకు చేయడం లేదు?

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకి మా డిమాండ్లు: 

1. ఛత్తీస్‌గఢ్ లేదా మరే ఇతర ఆదివాసీ ప్రాంతంలోనూ వైమానిక దాడులు చేయవద్దు

2. భద్రతా శిబిరాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, సామూహిక అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులతో చర్చలో పాల్గొనండి.

3. భద్రతా దళాల మానవ హక్కుల ఉల్లంఘనలను పరిష్కరించండి. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల ద్వారా మానవ హక్కులకు భంగం వాటిల్లిందని ఒకటి కంటే ఎక్కువ న్యాయ విచారణలు, సిబిఐ, ఎన్‌హెచ్‌ఆర్‌సి, సుప్రీం కోర్టులు స్పష్టమైన నిర్ధారణలు చేసినప్పటికీ, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముందుగా సర్కెగూడ, ఈడెస్మెట్టలో భద్రతా బలగాలు జరిపిన సామూహిక హత్యలకు, తాడమెట్ల, తిమ్మాపురం, మోర్పల్లిలో సామూహిక దహన, అత్యాచారాలు, హత్యలకు గురైన అమాయక బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎన్‌హెచ్‌ఆర్‌సి, కోర్టుల దృష్టికి తీసుకెళ్లిన భద్రతా బలగాలు జరిపిన హత్యలు, లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులను తప్పనిసరిగా విచారించాలి.

4. అదనపు బెటాలియన్లు, భద్రతా శిబిరాలతో బస్తర్‌లో సైనికీకరణను ఆపండి.

5. SPOలు (ప్రత్యేక పోలీసు అధికారులు) లొంగిపోయిన నక్సలైట్లను ఏ పేరుతోనైనా మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రతిఘటన కార్యకలాపాలలో ఉపయోగించడాన్ని నిషేధించిన సుప్రీం కోర్టు 2011లో నిర్దేశించినట్లుగా, DRG (డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్)ని రద్దు చేయాలి. 

6. సిపిఐ (మావోయిస్ట్)తో శాంతి చర్చలు జరపాలి.

సంతకం చేసిన సంస్థలు, వ్యక్తులు:

1. V. సురేష్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, (PUCL) జనరల్ సెక్రటరీ
2. అనీ రాజా, జనరల్ సెక్రటరీ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్, (NFIW)
3. గుత్తా రోహిత్ హ్యూమన్ రైట్స్ ఫోరమ్, (HRF)
4. బేలా భాటియా ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్, (CBA)
 5. అరుంధుతి ధురు, మీరా సంఘమిత్ర, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్‌మెంట్స్, (NAPM).
6. కవితా కృష్ణన్ ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్, (AIPWA)
7. దీపికా టాండన్, షహానా ఛటర్జీ (కార్యదర్శులు) పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్(PUDR)
8. గౌతమ్ మోడీ, న్యూ ట్రేడ్ యూనియన్ ఇనిషియేటివ్ (NTUI)
9. క్లిఫ్టన్ డిరోజారియో, ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్, (AILAJ)
10. వాణి సుబ్రమణ్యం, సహేలి
11. సిరాజ్ దత్తా, జార్ఖండ్ జనాధికార్ మహాసభ
12. అనురాధ తల్వార్, పశ్చిమ్ బంగా ఖేత్ మజాదూర్ సమితి (PBKMS)
13. హెన్రీ టిఫాగ్నే, పీపుల్స్ వాచ్
14. అవని చోక్సీ, మంథన్ లా
15. తీస్తా శ్వేతల్‌వాద్, సిటిజన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్
16.రాజ్ కుమార్ సింగ్, ఎంపీ, బర్గి బాంధ్ ఏవం ప్రభావిత్ సంఘ్
17. కైలాష్ మినా, ఖనన్ విరోధి సంఘర్ష్ సమితి, రాజస్థాన్
18. సిస్టర్ సెలియా, డోమెస్టిక్ వర్కర్స్ యూనియన్, కర్ణాటక
19. కృష్ణకాంత్ చౌహాన్, పర్యవరణ్ సురక్షా సమితి, గుజరాత్
20. ఆశిష్ రంజన్, జన్ జాగరణ్ శక్తి సంఘటన్ బీహార్,
21. నిషా బిస్వాస్ ,విమెన్ అగైన్స్ట్ స్టేట్ రిప్రెషన్ అండ్ సెక్సుయల్ వాయిలెన్స్
22. వినీత్ తివారీ, జాతీయ కార్యదర్శి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్
23. నందిని సుందర్, విద్యావేత్త, రచయిత
24. విజయన్, MJ, శాంతి కార్యకర్త
25. Fr. ఫాదర్ సెడ్రిక్ ప్రకాష్, ప్రశాంత్.
26. ఆకర్ పటేల్, మానవ హక్కుల కార్యకర్త, రచయిత
27. ఫాదర్ జోతి SJ, రైట్ తో ఫుడ్ కార్యకర్త 
28. జాన్ దయాల్, రచయిత, పాత్రికేయుడు
29. డాక్టర్ ఫ్రేజర్ మస్కరెన్హాస్, SJ, అకడమిక్ అడ్మినిస్ట్రేటర్
30. బ్రినెల్లే డిసౌజా, విద్యావేత్త మరియు కార్యకర్త.

మరింత సమాచారం కోసం, దయచేసి సంప్రదించండి:

నందిని సుందర్: 9868076756

బేలా భాటియా: 9479045421

సురేష్ వి: 9444231497

కవితా శ్రీవాస్తవ: 9351562965

List of news reports from the ground:

1. https://www.livehindustan.com/chhattisgarh/story-force-drone-attack-in-bijapur-forest-maoists-said-bombs-dropped-villagers-showed-marks-police-are-denying-6308458.html

2. https://www.thequint.com/news/india/chhattisgarh-tribals-claim-drone-attack-in-bastar-forces-deny?utm_source=WhatsApp_mWEB&utm_medium=Social&utm_campaign=socialsharebuttons&utm_content=8b196733-3f95-410d-90b3-09f9f0c69c2a_1650553448062

3. https://www.youtube.com/watch?v=d1Gx3usI8Cg

4. https://www.ibc24.in/videos/sukma-naxalite-news-naxalites-accused-of-drone-attack-crpf-called-the-allegation-of-naxalites-false-ibc24-reaches-ground-zero-864971.html

5. https://indianexpress.com/article/india/chhattisgarh-maoists-allege-drone-attacks-police-reject-lies-meant-scare-people-7872546/

27 ఏప్రిల్ 2022 

Leave a Reply