జర్నలిస్టు తులసి చందును బెదిరిస్తూ, అసభ్యకర మాటలతో నిందిస్తూ సంఫ్‌ుపరివార్ మూక దాడి చేయడాన్ని విరసం ఖండిస్తోంది. ఆమె గత కొద్దికాలంగా ప్రజా సమస్యల మీద వీడియోలు రూపొందిస్తోంది. అందులో ఆమె చెప్పే వాస్తవాలకు, విశ్లేషణలకు విశేష ఆదరణ దొరుకుతోంది. ఆమె తీసుకొనే ప్రజాస్వామిక వైఖరిని వీక్షకులు అభినందిస్తున్నారు. కల్లోలభరిత ప్రజా జీవితాన్ని అర్థం చేసుకోడానికి ఆమె మాటలు దోహదం చేస్తున్నాయి. జర్నలిస్టులైనా, రచయితలైనా ఫాసిస్టు వాతావరణాన్ని వివరిస్తూ వాస్తవాలు చెప్పడం తమ బాధ్యత అనుకుంటారు. సత్యాన్ని ప్రకటించని రచన, జర్నలిజం వ్యర్థం.
కానీ సత్యమంటే ఫాసిస్టులకు భయం. సత్యం చెప్పేవాళ్లంటే కంటగింపు. దేశవ్యాప్తంగా పాత్రికేయుల మీద, రచయితల మీద, మేధావుల మీద దాడులు చేయడం వాళ్ల జాతీయ సంస్కృతి సారం. అబద్ధాలు, వంచనలు, వక్రీకరణల మీద బతకాలని ఫాసిజం చూస్తుంది. తులసి వీడియోలు ఈ బండారాన్ని అద్భుతంగా బైటపెడుతున్నాయి. తద్వారా సంఫ్‌ు మూక ‘మను భావాలు’ దెబ్బతింటున్నాయి. అందుకే ఆమెను బెదిరిస్తున్నారు. ఒక స్వతంత్ర జర్నలిస్టుగా తన పని తాను చేసుకపోతానని, తన ఆచరణ అంతా బహిరంగమని ఆమె సాహసికంగా ప్రకటించారు. భారతదేశంలో ఫాసిస్టు అణచివేత పెరిగిన మాట నిజమే కాని, అంతకంటే ఎక్కువగా తులసిలాంటి ధిక్కార స్వరాలు పెల్లుబుకుతున్నాయి. సత్య ప్రకటన కోసం ప్రాణాలనైనా బలిపెట్టగల బుద్ధిజీవుల, ప్రజాపక్షపాతుల సంప్రదాయం భారతదేశంలో అద్భుతంగా కొనసాగుతున్నది. వ్యక్తులను బెదిరించడం ద్వారా వాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకొనే మూకలకు ఈ సంగతి తెలియదు. అనామక, గుర్తుతెలియని, చీకటి కార్యకలాపాలకు పాల్పడే వాళ్లకు బహిరంగ సత్య ప్రకటనలంటే భయం. వందలాది పరివార్ సంస్థల్లో, రోడ్ల మీద వికృత విన్యాసాలు చేస్తున్న ఈ మూకలు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. నిజాలపై అబద్ధాల తారుపూసి తప్పుడు భావజాలం సృష్టిస్తున్నారు. నిందల ద్వారా మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఫాసిజం అనేక రూపాల్లో ఉన్నట్లే ఫాసిస్టు వ్యతిరేక పోరాటం కూడా అనేక రూపాల్లో విస్తరిస్తున్నది. సంఫ్‌ు మూకల తిట్లను, హీనమైన మాటలను, వ్యక్తిగత నిందలను పట్టించుకోకపోవడం కూడా ఫాసిస్టు వ్యతిరేక పోరాటమే. వాటిని పట్టించుకోవాలని, కుంగిపోవాలని, నిస్సహాయతను వ్యక్తం చేయాలని ఫాసిస్టులు కోరుకుంటారు. అదే జరిగితే మతతత్వ శక్తుల వ్యూహం ఫలించినట్లే. ఫాసిస్టులు హత్యల దగ్గరి నుంచి మనో ధైర్యాన్ని దెబ్బతీసేదాక అనేక రూపాల్లో పని చేస్తుంటారు. కానీ తులసి చందు ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేశారు. వ్యక్తులను బెదిరించాలనే వాళ్ల వ్యూహానికి మానవత మీద, సత్యం మీద మనుషులందరం సంఘటితం కావడమే జవాబు. తద్వారా మరింతగా వాళ్ల అబద్ధాలను, బెదిరింపులను ప్రజల్లోకి తీసికెళ్లాలి. ఇది తులసి చందు సమస్య మాత్రమే కాదు. గొంతెత్తి మాట్లాడుతున్న, రాస్తున్న, పోరాడుతున్న వాళ్లందరి సమస్య. అంటే ప్రజాస్వామ్యం సమస్య. అంతిమంగా ఇది భావజాలం సమస్య. తులసిని నిందించేందుకు, బెదిరించేందుకు వాళ్లు ఉపయోగించిన భాషను చూసి మనం ఆందోళనపడ్డానికి లేదు. దేనికంటే సంఫ్‌ు ఏం మాట్లాడినా అది వాళ్ల భావజాల ప్రకటనే. మనం వ్యతిరేకిస్తున్నది వాళ్ల భావజాలాన్నే. అది ఎంత హీనమైనదో, పితృస్వామికమైనదో, అనాగరికమైనదో తులసి సందర్భంలో మరోసారి రుజువైంది. జర్నలిస్టులు, రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు భావజాలరంగంలో పని చేస్తారు కాబట్టి ఈ మూకల బెదిరింపులను, అసభ్యకర మాటలను భావజాల యుద్ధంలో ఓడిరచాల్సిందే. ఇందులో భాగంగా తులసి తాను ఎంచుకున్న పని పట్ల అచంచలమైన విశ్వాసంతో ముందుకు వెళ్లడానికి తోడుగా నిలవడమంటే మరింత మంది ఈ భావజాల పోరాటంలో పాల్గొనాలి. ఆమె తన మార్గంలో ముందుకు వెళ్లాలి. ఆమెకు ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తులు అండగా నిలవాలి. తులసికి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ, ఫాసిస్టు వ్యతిరేక కంఠస్వరాల కలయికకు దోహదం చేస్తామని విరసం ప్రకటిస్తోంది.
Tulasi chandu -story — big publicity — too much importance
Tasalim nasarin —meeting in Hyderabad — everyone knows what happened — but that time
Medhavulu -writers are silent
Tulasi chandu – is not. G.k reddy -a krishnarao -satish chander —Ananya Krishna —kuswanth singh in journalism ???/