పొద్దున్నే.
నా కళ్ళల్లో విరబూసిన నవ్వు
సాయంత్రానికి రాలి
కరోనా పొట్లమైపోయింది

వెన్నెలంతా పారబోసుకొని
చీకటి పడ్డ
చందమామ!

ఎవడూ
చెట్టుకాలేకపోయాడు

గాలి కొదిలేసిన
కొన ఊపిరిజాగరణ చుట్టూ
కోరలుచాచిన కాసుపత్రులు!

భూమి వల్లకాని చితులన్నీ
మూటలు మూటలు గా
ర్యాలీతీస్తూ
పవిత్ర గంగా నది చరిత్రై
దిక్కులు కోల్పోయి ఒడ్డు పట్టుకుంటున్న
కాగితప్పడవలు!

చెమట వాసన కోల్పోయి న
అభివృద్ధి ప్రణాళికొకటి
సిగ్గు విడ్చిన రాజముద్రిక పట్టుకొని సంచరిస్తుంటే
ఆక్సీజన్ అందక
ప్రపంచ ఔషధాలయం
శవయాత్ర చేస్తోంది

One thought on “దేశం శవయాత్ర చేస్తోంది

  1. నా కళ్ళల్లో విరబూసిన నవ్వు
    సాయంత్రానికి రాలి
    కరోనా పొట్లమైపోయింది

Leave a Reply