నాకిప్పుడు కావల్సింది

సూర్యునితో పాటు తిరిగి

చీకటికి తలవంచిన

పొద్దుతిరుగుళ్లు కాదు

చీకటిలోను తలవంచని

ఎర్ర మందారాలు కావాలి

వాటి పరిమళాలు కావాలి

నాకిప్పుడు కావల్సింది

కొద్ది జల్లులకే నిండి

కొద్ది ఎండకే ఎండిన

కుంటలు కాదు

కుచించుకుపోని

యాంగ్సీ లాంటి

నదులు కావాలి

దాని ఘర్జనలు కావాలి

నాకిప్పుడు కావల్సింది

వసంతంలో మాత్రమే

ఎగిరే బురక పిట్టలు కాదు

ఏ కాలంలో నైనా పైకెగిరే

ఫినిక్స్‌ పక్షులు కావాలి

వాటి వేగం కావాలి

నాకిప్పుడు కావల్సింది

బిగించిన పిడికిళ్లు

వాలిపోయిన చేతులు కాదు

బందూకు చివరి వరకు

దించని భుజాలు కావాలి

వాళ్ల ధైర్యం కావాలి

Leave a Reply