నా జీవితం,
వడ్డించిన విస్తరే కాదనను.
కానీ,
అన్నార్తుల ఆకలి తీర్చడమే
నా ఆరాటం,పోరాటం.
కన్నీళ్లు,కడగండ్లు
పెద్దగా నేనెరుగ ,
అయితే.
కన్నీళ్లు,కడగండ్లు లేని సమాజమే,
నా లక్ష్యం,నా ధ్యేయం.
అవును,
నేనగ్రవర్ణ సంజాతకున్నే,
కానీ,
కుల,వర్గ రహిత సమాజంకై,
జరిగే పోరులో నేనూ
ఒక సాహితీ సైనికుణ్ణి.
నేను పురుషున్నే ,
నాలోని పురుషాధిక్యతను
అనుక్షణం ప్రశ్నించుకుంటూ
క్షాళన చేసుకుంటున్న మనిషిని నేను.
రేపటి ఉషస్సు విరజిమ్మే
అరుణారుణ కాంతులకై ,
ఆవర్భవించే నూతన మానవునికై ,
అహర్నిసలు జరుగుతున్న యుద్దానికి
భావజాల తూటాలందించే సాంస్కృతిక సైనికుణ్ణి నేను
నేను కలాన్నే కాదు,
కర్షకున్ని,కార్మికున్ని
దోపిడీ వ్యవస్థను పెకళించే గునపాన్ని .