చేతులకు సంకెళ్ళు
వేసిన
రాతను గీతను
ఆపలేవు
కాల్లకు సంకెళ్ళు
వేసిన
మా ఆటను అడ్డుకోలేవు
నోటికి సంకెళ్ళు
వేసిన
పాటను మాటను
ప్రశ్నను ఆపలేవు
అక్షరం పై ఆంక్షలు
శబ్ధం పై నిషేదం
కదిలిక పై నిర్భందం
మెదలిక పై నిఘా
అప్రకటిత చీకటి
పాలనకు పరాకాష్ట
ఇక మౌనం మండాల్సిందే
శబ్ధం విస్ఫోటం చెందాల్సిందే

Leave a Reply