అక్టోబర్ 7వ తేదీన ఆక్రమిత పాలస్తీనాలోని గాజాలో ఒక ప్రతిఘటనా వెల్లువ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఫాసిజాన్ని  ఆసరా చేసుకుని ప్రజలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాదం ముందుకు వస్తున్న సమయంలో, దానిక వ్యతిరేకంగా పోరాడాలన్న ఆలోచన వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో దాన్ని గత ఏడాది సామ్రాజ్యవాద అంతర్గత సంఘర్షణ తీవ్రతరం చేసింది. ఈ మధ్యలో సామ్రాజ్యవాదుల మధ్య సంక్షోభం సాగుతున్న సమయంలో ఇజ్రాయిల్ లో జియోనిస్టుల ఆక్రమణకు వ్యతిరేకంగా వారి అస్తిత్వానికి వీర పాలస్తీనా ప్రజలు అగ్గిరాజేశారు. హమాస్ (ఇస్లామిక్ ప్రతిఘటనా ఉద్యమం ), పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, డెమోక్రటిక్ ఫ్రంట్ ఫర లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, లైన్స్ డెన్ అండ్ లెబానాన్స్ హెజ్ బొల్లా వంటి పాలస్తీనా శక్తులు తొలి నుంచి ముందుకు దూకుడుగా ఉన్నాయి. ‘ప్రతీఘాతక శక్తులన్నీ కాగితపు పులులే. ఈ శక్తులు పైకి చాలా బలమైనవిగా కనిపించినప్పటికీ, నిజానికి అవి అంత బలమైనవి కావు. దీర్ఘ కాలిక అనుభవం ప్రకారం చూస్తే ఈ ప్రతీఘాతక శక్తుల కంటే ప్రజలే బలమైన వారు,” అని మావో చెప్పిన సామెత ఇక్కడ నిజమవుతోంది. జాతీయ విముక్తి ఉద్యమాలు, నిర్మాణాత్మకమైన వర్గపోరాటాలు దారుణంగా దెబ్బతిని వెనకడుగుపట్టిన కాలంలో ఇజ్రాయిల్ పునరుద్ధరణ వాదులతో పాలస్తీనా ప్రజల జాతీయ విముక్తి యుద్ధం తీవ్రతరం కావడం వివిధ సమాజాలను ప్రజాస్వామికీకరించడానికి ఈ వర్గపోరాటం, జాతీయ విముక్తిపోరాటం చాలా అవసరమవుతోంది. సంక్షిప్తంగానైనా సరే నూతన పాఠకుల కోసం ఈ పోరాటంలోని ప్రజల చరిత్ర చెప్పడం చాలా అవసరం. అంతే కాకుండా, యునైటెడ్ ఫ్రంట్ ఇక్కడ వెనక్కి వెళ్ళడం అనే ఎత్తుగడను సమర్ధవంతంగా వినియోగించుకోవడం కూడా చాలా ముఖ్యం. పక్షుల రెక్కలు దొంతరులుగా ఉంటాయి. ఈ విషయంలో బెంజిమన్ నెతన్యాహుకు నరేంద్రమోడీ మద్దతుతో హిందూత్వ, జియోనిజం అనే రంగుల రెక్కలు కళంకితమై ఉండడం మరొక ముఖ్యమైన విషయం. కశ్మీర్, నాగాలాండ్, అస్సామ్, మణిపూర్ ప్రజల స్వీయ నిర్ణయాధికార హక్కులను అణచి వేయడానికి అన్ని వైపుల నుంచి భారతదేశం తనతో తానే యుద్ధం చేస్తోంది.

 స్విట్జర్లాండ్ లోని  బేసెల్లో ఆస్ట్రో హంగేరియన్ జర్నలిస్ట్ థియోడర్ హెర్జల్ 18 97లో ప్రారంభించిన తొలి జియోనిస్ట్ కాంగ్రెస్ తో జియోనిస్ట్ ఉద్యమం ఆధునిక రూపం సంతరించుకుంది. జియోనిస్ట్ సంస్థ ఏర్పాటుతో పాటు బేసెల్ కార్యక్రమాన్ని రూపొందించడంతో ఈ సమావేశం ముగిసింది. (ఇప్పుడది ప్రపంచ జియోనిస్ట్ సంస్థ.)

  • 1. పాలస్తీనాలో యూదు వ్యవసాయదారులను, చేతివృత్తుల వారిని, వ్యాపారులను చాలా ప్రయోజనకరమైన వారిగా ముందుకు తీసుకెళ్ళాలి.
  • 2. వివిధ దేశాల చట్టాల ప్రకారం స్థానికి కార్యక్రమాలతో యూదులను ఈ సంస్థ ఒక దగ్గరకు చేర్చాలి.
  • 3. మేం యూదులం అనే భావనను, జాతీయ స్పృహను బలపరచాలి.
  • 4. యూదుల ప్రయోజనాలను సాధించడానికి ప్రభుత్వ అనుమతి పొందడం కోసం సన్నాహక అడుగులు వేయాలి.

యూదు నాయకుడు జీవ్ జెబటోన్ స్కీ స్పష్టం చేసినట్టు పాలస్తీనాలో యూదులు స్థిరపడడం ద్వారా హింస ద్వారా వలస వచ్చేయడమే జియోనిజం ధ్యేయం.

“ఇప్పుడు కానీ, భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ అరబ్బులతో స్వచ్చందంగా సయోధ్య చేసే ప్రశ్నే లేదు. ఇప్పటికే ప్రజలు నివసించే ఆ నేలలోకి వలసపోవాలంటే, ఆ నేల కోసం ఒక గుంపును తయారు చేసుకోవాలి. లేదా, మీ కోసం గుంపును తయారుచేసే ఒక ధనికుడిని కానీ, లబ్ధిపొందే వ్యక్తిని కానీ వెతుక్కోవాలి. సాయుధశక్తి లేకుండా, భౌతికంగా ఎదుర్కోవడం కానీ, వలసరావడం కానీ అసాధ్యమైనప్పుడు వలసవెళ్ళాలన్న ఆలోచనను వదులుకోవాలి. అది చాలా కష్టం, ప్రమాదం కాదు, అది అసాధ్యం.. జియనిజం అనేది వలస సాహసం కాబట్టి అది నిలబడాలన్నా, పడిపోవాలన్నా సాయుధశక్తి చాలా అవసరం. హిబ్రూ భాష మాట్లాడడం ముఖ్యం. కనుక అనుకోకుండా చంపడం కూడా ముఖ్యమే. వలసీకరణతో నేను ఆడుకుంటూ దాన్ని మీముందుకు తోస్తున్నాను”

మొదటి ప్రపంచ యుద్ధం అనే సామ్రాజ్యవాదుల అంతర్గత సంఘర్షణ అనేది సామ్రాజ్య వాదుల కూటమి ప్రత్యర్థి దేశాలను వలసలుగా మార్చుకోవడానికి దారి తీసింది. ఫలితంగా పూర్వపు ఒట్టోమన్ సామ్రాజ్యంలోని పాలస్తీనాను స్వాధీనం చేసుకుని, దానిపైన బ్రిటిష్ పెత్తనం మొదలైంది. బ్రిటిష్ వారి సాయంతో యూదులు (జీవిష్ యిషువా: ఇస్లాం పుట్టకముందే అక్కడ ఉన్న జాతి) అక్కడ స్థిరపడిపోయి, పాలస్తీనాలో జియోనిజం స్థిరపడడిపోవడానికి దారి తీసి, రాజ్య అనుకూల శక్తిగా తయారైంది. బ్రిటిష్ ప్రభుత్వం వెనకాముందు చూసుకోకుండా 1917లో చేసిన బాల్ఫోర్ ప్రకటన ద్వారా పాలస్తీనానే యూదులకు ‘జన్మస్థలం’గా ప్రకటించేసింది. దీంతో అసలు జియోనిస్టుల ధ్యేయానికి ఫలితం లభించినట్టయింది. పాలస్తీనాకు వలసలు పెరిగి, జియోనిస్టుల ద్వారా పాలస్తీనాలో యూదులు భూస్వాములుగా తయరయ్యారు. 1936నాటి తిరుగుబాటుతో పాలస్తీనా ప్రతిఘటనలో ఇవ్వన్నీ కనిపిస్తాయి. పాలస్తీనాలో 5నుంచి 6 శాతం మాత్రమే ఉన్న యూదులు చాలా వేగంగా భూ ఆక్రమణకు దిగారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందే వలసలు రావడంతో వీరంతా ఏకమయ్యారు.

అనేక జాతుల జోక్యంతో పాలస్తీనాను విభజించి, 56 శాతం భూభాగం యూదులకు కేటాయించారు. పాలస్తీనా స్వతం దారులకు మాత్రం మిగిలిన భూభాగం మాత్రమే దక్కింది. పాలస్తీనాకు వలస వచ్చి కనీసం రెండు దశాబ్దాలు కూడా ఇక్కడ నివసించని వారు ఇదంతా తమ భూభాగమేనని అంటున్నారు. సిగ్గుబిడియం లేని వలస వచ్చిన ఈ యూదులను కనీసం ఐక్యరాజ్య సమితి వంటి సామ్రాజ్యవాద సంస్థలైనా తమ వలసవాద ధ్యేయాలను బహిరంగ పరచాలి.

“స్వీయ పాలనానిర్ణయాధికారమనే సిద్ధాంతాన్ని గౌరవిస్తూ, మొదటి ప్రపంచ యుద్ధం చివరలో ఆ స్వీయ పాలనానిర్ణయాధికారానికి అంతర్జాతీయ సంబంధాలు జోడించారు. ఇతర అరబ్ భూభాగాలను గౌరవించడానికి కట్టుబడినప్పటికీ, ‘ఎ’ ఆదేశాల మేరకు పాలస్తీనాకు అన్వయించకుండా, ఆ నేలలో యూదు జాతీయులకు ఒక ప్రత్యేక దేశాన్ని సృష్టించారు. ‘యూదు జాతీయల దేశం’ అని చక్కగా చెప్పినప్పటికీ, పాలస్తీనీయులకున్న చట్టపరమైన స్వతంత్ర అధికారం ఆ నియమానికి భిన్నమైంది.”

పైన పేర్కొన్నట్టు, జాతుల స్వయం నిర్ణయాధికారమనే ప్రజల హక్కును ఐక్యరాజ్యసమితి నిలబెట్టింది. తరతరాలుగా తమకు హక్కుగా వస్తున్న పాలస్తీనా భూభాగాన్ని రెండుగా విభజించి, యూదు జాతీయులకు సార్వభౌమాధికారాన్ని కట్టబెట్టడం ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన స్వీయ పాలనా నిర్ణయాధికారానికి పూర్తిగా ఉల్లంఘనే. వలసవచ్చి తన భూభాగంలో స్థిరపడిన యూదులవంటి వలసవాదులకు 56 శాతం భూభాగం కేటాయించడాన్ని ఏ జాతీ అంగీకరించదు. అప్పటి నుంచి, యూదుల ప్రవేశంతో పాలస్తీనాను గాజాకు, వెస్ట్ బ్యాంక్ కు పరిమితం చేయడానికి ఇజ్రాయిల్ అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. మారణహోమం, జాతి నిర్మూలన, బాంబులు వేయడం, రెడ్ క్రిసెంట్ వంటి వైద్య సంస్థలపైనకూడా బాంబులతో ధ్వంసం చేయడం, పాలస్తీనాపైన తెల్ల ఫాస్పరసు చల్లడం వంటి చర్యలకు ఇజ్రాయిల్ పాల్పడింది. యూదు శరణార్థులను పాలస్తీనా వారు ఎప్పుడూ ఆహ్వానిస్తూ, ఆదరిస్తూనే ఉన్నారు. వలసవచ్చి స్థిరపడిన యూదులకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని 1928లో తీర్మానం చేసినప్పుడు కూడా ఆ తీర్మానాన్ని ఆహ్వానించారు. కానీ, పాలస్తీనీయులను నిర్మూలించాలన్నది యూదుల ధ్యేయం.

ఈ అకృత్యాల నేపథ్యంలో, స్వయం పాలనా నిర్ణయాకారమనే హక్కును కాలరాస్తున్నప్పుడు పాలస్తీనా ప్రజలు విముక్తి కోసం పోరాడుతున్నారు. సామ్రాజ్యవాద శక్తులు అతితెలివి వాదనలు చేస్తూ, రెండు దేశాలు’ సిద్ధాంతాన్ని ముందుకు తెస్తూ, పాలస్తీనా భద్రతా దళాలను ‘తీవ్రవాద’ సంస్థలుగా చిత్రిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత బలమైన తీవ్రవాద శక్తిగా అవతరించి, అన్ని రకాల యుద్ధ నేరాలకూ పాల్పడి, కొన్ని దేశాల్లో ప్రజలపై జాతినిర్మూలనా దారుణాలకు ఒడిగట్టిన అమెరికా ఇజ్రాయిల్ కు బదులుగా హమాస్ ను విదేశీ తీవ్రవాద సంస్థగా ముద్రవేయడం అన్నిటికంటే హాస్యాస్పదం.

ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం పాలస్తీనా విముక్తి పోరాటంలో ఒక ముఖ్యమైన పరిణామం. ఇది భిన్న దృక్పథాలు కల వివిధ శక్తులను ఏకం చేసింది. పిఎఫ్ఎల్పీ, డీఎఫ్ఎల్పి వంటి మార్క్సిస్టు లెనినిస్టులు, హమాన్ వంటి ఇస్లామిక్ శక్తులు, పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ, లైన్స్ డెన్ వంటి ఇతరులు ఐక్య సంఘటనగా ఏర్పడ్డారు. ఐక్య సంఘటనను కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ ఇలా నిర్వచించింది. “ఐక్యసంఘటన ఎత్తుగడ ఏమిటంటే, బూర్జువాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలకు చెందిన కార్మికులతో గ్రూపులతో చేరి, ఏ వర్గానికి చెందని కార్మికులతో కూడా కలిసి శ్రామికవర్గం మౌలిక హక్కులను తీర్చుకోవడానికి పోరాడాలని కమ్యూనిస్టుల ప్రతిపాదన” ముఖ్యంగా నూతన ప్రజాస్వామిక పోరాటంలో, జాతీయ విముక్తి పోరాటంలో కమ్యూనిస్టులు ప్రధాన శక్తిగా లేనటువంటి సమయంలో, వివిధ రైతు ప్రవాహాలు, పెటీ బూర్చువా ఆలోచనలు ఉన్నప్పుడు కూడా, ఏ పోరాటంలోనూ ఐక్యసంఘటన ప్రాధాన్యతను తక్కువ చేయలేం. చైనా నూతన ప్రజాస్వామిక విప్లవంలో ఐక్యసంఘటన ప్రాధాన్యత గురించి మావో ఇలా చెపుతారు. ” బూర్జువాలతో ఐక్యసంఘటన ఏర్పాటు చేసుకోవాలా వద్దా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు, దాని అభివృద్ధికి, బలాన్ని ఏకీకరించడానికి, బోల్షివీకరించడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఒక సరైన రాజకీయ మార్గాన్ని ఎంచుకుంది. బూర్జువాలతో పెట్టుకున్న సంబంధాల్లో సరైన మార్గంలో వెళ్ళనప్పుడు మన పార్టీ ఒక అడుగు వెనక్కి తగ్గింది.” ప్రపంచంపై ఫాసిజం పట్టుపెంచుకోవాలని చూస్తున్నప్పుడు, ఫాసిజానికి వ్యతిరేకంగా పాలస్తీనా శక్తుల విజయం ఐక్యకార్యాచరణగా ముందుకు పోవాల్సిన అవసరాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తు చేస్తోంది. హింసను ఉపయోగించడంలో ఉదారవాదులకు, కమ్యూనిస్టులకు మధ్య ఉన్న తేడా ఏమీ లేదని వ్యతిరేక శక్తులు భావిస్తున్నప్పుడు ఉన్మాదం లాగానే సంకుచితంగా, ఒంటెత్తుపోకడతో పోయినప్పుడు పరిమితమైన వనరులే లభిస్తాయి.

ఈ శక్తులు ఇస్లాంను మోస్తున్నారన్న అపవాదును ఎదుర్కోడం చాలా ఇబ్బందికరమైనది. హిందుత్వం, జియోనిజం వంటి ఆధిపత్య శక్తుల హింసను ఎదుర్కోవడానికి అల్పసంఖ్యాక ముస్లింల ప్రతిఘటన ఉన్న ఐక్యసంఘటనలో భాగంగా ఉండడం వల్ల మతోన్మాదులన్న ముద్రపడింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను భారత ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా నిషేధించినప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్టు) పొలిట్ బ్యూరో పరిస్థితి ఇందుకు చక్కని ఉదాహరణ.

“తీవ్రవాద అభిప్రాయాలున్న ‘ద పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) తనకు వ్యతిరేకులని భావించినప్పుడు వారికి వ్యతిరేకంగా హింసాత్మక చర్యలకు పాల్పడింది. ఈ పీఎఫ్ఐ హింసాత్మక చర్యలను, తీవ్రవాద ఆలోచనలను సీపీఐ(ఎం) ఎప్పుడూ ఖండిస్తూ వస్తున్నది. చట్టవ్యతిరేక చర్యల నిరోధక చట్టం(ఉపా) కింద పీఎఫ్ఐని చట్టవ్యతిరేక సంస్థ అని నోటిఫికేషన్ జారీ చేయడం సమస్య పరిష్కారానికి మార్గం కాదు. గతంలో వలె ఆర్ఎస్ఎస్, మావోఇస్టు సంస్థలను నిషేధించడం వల్ల దాని ప్రభావం ఏమీ లేదు. పీఎఫ్ఐ ఎప్పుడైతే చట్టవ్యతిరేక చర్యలకు, హింసాత్మక చర్యలకు పాల్పడిందో, ప్రస్తుతం ఉన్న చట్టాల మేరకు పాలనాపరంగా గట్టి చర్యలు చేపట్టాలి. దాని ఒంటెత్తు పోకడలను, విచ్ఛిన్న సిద్ధాంతాలను ప్రజల మధ్య బట్టబయలు చేయాలి. కేరళ, కోస్తా కర్ణాటకలో పీఎఫ్ఐ, ఆర్ఎన్ఎస్ హత్యలకు పాల్పడుతూ, ప్రతీకార హత్యలు చేస్తూ, మతపరమైన విభజనను సృష్టిస్తున్నాయి. ‘సనాతన సనాతన’, హిందూ జాగృత సమితి వంటి తీవ్రవాద శక్తులు, సంస్థలు, ప్రసిద్ధ లౌకిక రచయితలు, ప్రముఖుల హత్యలలో పాలుపంచుకున్నాయి. తీవ్రవాద మెజారిటీ గ్రూపులకు చెందిన వారైనా, మైనారిటీ గ్రూపులకు చెందిన వారైనా సరే ఉన్న చట్టాలను, పరిపాలనా చర్యలను ఉపయోగించి ఈ శక్తులను ఎదుర్కోవాలి.”

పీఎఫ్ఐ చర్యలను కానీ, మావోయిస్టుల చర్యలను కానీ, పాలకవర్గాలలో భాగమైన ఆర్ఎస్ఎస్ వంటి బ్రాహ్మణీయ  హిందూత్వ ఫాసిస్టు   సంస్థలను సీపీఎం ఒకేలా చూస్తుంది. ఇదే విధంగా హమాస్ ను మతోన్మాద తీవ్రవాద సంస్థగా ఇజ్రాయిల్ జియోనిస్టులతో సమానంగా చూస్తోంది.

“అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం మన నేలకు తిరిగి రావడం కోసం, మన హక్కులను తిరిగి పొందడం కోసం ఇది ప్రతిఘటనా వ్యూహం. నది నుంచి సముద్రం వరకు పాలస్తీనాను విముక్తి చేయాలనే ధ్యేయం, అది సాధ్యమవుతుందనే ఈ ప్రతిఘటనా వ్యూహం స్పష్టంగా ఉంది.” అని ఇరాన్ లోని హమాస్ ప్రతినిధి డాక్టర్ ఖలీద్ ఖదోమి అంటారు. “మా ప్రవర్తనకు సంబంధించిన ఇస్లామిక్ చట్రంలో ఇమిడిన కోర్కెలు గల, ఇస్లాంతో కూడిన జాతి విముక్తి సంస్థ మాది. దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రసిద్ధ పౌర కార్యక్రమాల్లో మేం పాల్గొన్నాం. స్థానిక ఎన్నికల్లోకి ప్రవేశించాం. ధార్మిక సంస్థలను నిర్వహించాం. పాలస్తీనాలో అధికారిక ఎన్నికల్లో పాల్గొన్నాం. ప్రపంచంలో ఉన్న ఏ ప్రభుత్వం కంటే కూడా మంచి పాలనను అందివ్వాలన్న ప్రజాస్వామిక ఆకాంక్షతో మేం గెలిచాం. మీకు చెప్పినట్టుగానే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మేం ముస్లింలుగా గుర్తింపు పొందామని చెప్పుకోవడానికి, జాతీయ విముక్తి సంస్థగా మేము వెనుకాడడం లేదు. ఇస్లాం శాంతి, సహనానికి, న్యాయానికి చెందిన మతమని చెప్పుకోవడానికి మేం గర్వపడుతున్నాం. అన్ని అంశాల్లో మానవత్వాన్ని నింపుకున్న మతం, సర్వశక్తి సంపన్నుడైన అల్లా మాకు మాతనవత్వాన్ని ప్రసాదించిన మతం ఇస్లాం.”

పాలస్తీనా పరిస్థితుల వెలుగులో, ప్రజల మౌలిక అవసరం జాతీయ విముక్తి. ఈ అత్యున్నత మైన ధ్యేయాన్ని చేరుకోవడానికి హమాస్ చాలా పరాక్రమంతో ఈ పోరాటాన్ని బుజానికెత్తుకుంది. అమెరికా, నాటో కూటమి సామాజ్యవాదుల మద్దతుతో నడిచే బ్రిటిష్ వలసవాదుల, వలసవచ్చి స్థిరపడిన జియోనిస్టుల సామ్రాజ్యవాదపు కబందహస్తాలకు భిన్నంగా పాలస్తీనా తనను తాను ప్రజాస్వామికీకరించుకుంటుంది. పాలస్తీనాలో స్వతంత్రంగా వ్యవహరించలేని, స్వతంత్రంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని బూర్జువా వర్గాలను పెద్దగా లెక్కచేయనవసరం లేదు. స్వతంత్రంగా పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చేయకుండా, పాలస్తీనా బూర్జువా ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తి చేయలేదు. స్వాభావ రీత్యా అదింకా అర్ధ భూస్వామ్య స్వభావంలోనే ఉంది. జర్మన్ రైతులు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి ప్రెడరిక్ ఏంజెల్స్ రాస్తూ ఇలా చెప్పారు.

“పదహారవ శతాబ్దంలో జరిగిన మతయుద్ధాల్లో చాలా అనుకూలమైన వర్గ ప్రయోజనాలు ఉన్నాయి. అవ్వన్నీ వర్గ యుద్ధాలే. తరువాత ఇంగ్లాడ్, ఫ్రాన్స్ లో అవి సంకీర్ణమయ్యాయి. ఒకవేళ ఆ కాలంలో జరిగిన వర్గ యుద్ధాలు మతం రంగును పులుముకున్నట్టయితే, ఒక వేళ మతం అనే తెర వెనుక వివిధ వర్గాల ప్రయోజనాలు, అవసరాలు, కోర్కెలు దాగున్నట్టయితే, ఆ నాటి పరిస్థితులను వివరిస్తూ, వాస్తవ పరిస్థితిని కొంత మారుస్తుంది. ఆదిమదశ నుంచి మధ్యయుగాలు అభివృద్ధి చెందాయి. పాత నాగరికతకు, పాత తాత్విక చింతనకు, పాత రాజకీయాలకు, పాత న్యాయశాస్త్రానికి అతీతంగా అన్ని రంగాలలో కొత్త వాటికోసం కృషి చేశాయి. పాత ప్రపంచంలో చెదిరిపోయిన క్రైస్తవం, నాగరికతలో సగం దెబ్బతిన్న అనేక తమ నగరాలను పునరుద్ధరించాయి. ఈ పరిణామాల ఫలితంగా మేధోపరమైన విద్యపై మతపెద్దల సమూహం గుత్తాధిపత్యాన్ని సాధించింది. ప్రతి ఆదిమ దశలో జరిగే అభివృద్ధిలోను ఒక ధోరణి కనిపిస్తుంది. విద్య చెప్పుకోదగ్గ మతపరమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది.”

ఎంగెల్స్ గుర్తించింది ఏమిటంటే, ప్రజాస్వామికీకరణ జరగని సమాజంలో పోరాటానికి సంబంధించిన మౌలికమైన వ్యక్తీకరణకు ఏ మతమైతే బలమైన శక్తిగా ఉందో దాని ద్వారా మనుగడలో ఉన్న సైద్ధాంతిక పరికరంతో వస్తుందని చాలా తేలికైన మాటల్లో చెప్పాడు. అర్ధభూస్వామ్య వ్యవస్థలో, ఉదారవాద విలువలున్న సమాజంలో, ప్రజాస్వామిక పోరాటం జరుగుతున్నప్పుడు మతాన్ని గట్టిగా ప్రతిఘటించడం అనేది ప్రజాస్వామికీకరణ పూర్తి అయ్యినప్పుడే సాధ్యమవుతుందే తప్ప, దానికంటే ముందు సాధ్యం కాదు. పరిమాణంలో జరిగే మార్పుకు, ప్రామాణికంగా జరిగే మార్పుకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ వలసవాద శక్తులకు, భూస్వాములకు, పెద్ద పెద్ద భారతీయ వ్యాపారులకు వ్యతిరేకంగా, క్రైస్తవాన్ని కాపాడాలనే పేరుతో ఆదివాసీల భూముల పరిరక్షణకు సహస్రాబ్ది ఉద్యమానికి జర్మనీలో థామస్ మ్యుయజర్ కానీ, భారత దేశంలో బిర్సా ముండా కానీ నాయకత్వం వహించారు. పోరాట సమయంలో బిర్సాముండా ఆదివాపీలకు ఒక మంచి వ్యక్తిగా, భగవంతుడి సందేశాన్ని తీసుకొచ్చిన దైవదూతగా కనిపించాడు. ఇస్లాంను బుజానికెత్తుకున్న హమాస్ తన పోరాటాన్ని తగ్గించలేదు. మొత్తంగా పాలస్తీనా ప్రజల వర్గపోరాటంలో, చారిత్రక అభివృద్ధిలో వారు సహజమైన భాగమైపోయారు. ఎంగెల్స్ చెప్పినట్టు మతం పరదామాటున వేతన సమాజపు ప్రజాస్వామ్యంలో వర్గపోరాటం పూర్తి విజయం సాధించలేదు.

ఈ పరిణామాలకు స్పందనగా భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ విధంగా ట్వీట్ చేశారు. “తీవ్రవాదం ఏ రూపంలో వ్యక్తమైనా భారత దేశం నిస్సందేహంగా తీవ్రంగా ఖండిస్తుంది” దేశ వ్యాప్తంగా ఉన్న పత్రికలు, చానెళ్ళు మాటి మాటికీ ఇదే మోతను మోగిస్తున్నాయి. హిందూత్వ పాలక సానుభూతిపరులు ఇజ్రాయిల్ ను సమర్ధించారు. విచిత్రంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ ‘సార్వభౌమాధికారం,   స్వాతంత్రం , అనుకూలమైన దేశంగా పాలస్తీనా’ ఏర్పాటును కోరుకుంటున్నట్టు కాలం చెల్లిన దౌత్యపరమైన మాటలను పునరుద్ధరించింది. భారతదేశంలో బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం  ముస్లింలపై దాడి చేస్తూ, పాలస్తీనీయున్లను ముస్లిం టెర్రరిస్టులని ముద్ర వేస్తూ, జియోనిజంతో అనుబంధం పెనవేసుకుపోయిన ఈ సమయంలో వారు వల్లెవేసే అంతర్జాతీయ చట్టానికి అర్థం లేదు.

“అణచివేతకు గురైన దేశాలలోని ఆధునిక పాలక వర్గాలు అప్పుడప్పుడూ ప్యాసిస్టు సిద్ధాంతపు అంతర్గత శక్తులుగా తయారవుతారు. అది నియంతృత్వంతో మిళితమై, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాత భూస్వామ్య యుగంలా కనిపిస్తూ, నిబంధనలకు విరుద్ధమైన నిబంధనలతో పాలిస్తుంటారు. భూస్వామ్య వ్యవస్థ లాగా, హిట్లర్, ముస్సోలినీ వంటి ఫ్యాసిస్టు పాలనా కాలంలాగా, సామ్రాజ్యవాద దేశాలు నిబంధనలకు విరుద్ధమైన పద్ధతులకు సాక్ష్యంగా కనిపిస్తాయి. బూర్జువా ప్రజాస్వామ్యంలోని చట్టబద్ద పాలనకు, ‘నామమాత్రపు సమానత్వానికి’ నిబంధనలకు విరుమైన పాలన ప్రత్యామ్నాయమవుతుందా? ఈ రకమైన రెండు దేశాల మధ్య ప్రామాణికమైన తేడాలున్నాయి. మూడవ ప్రపంచ దేశాల్లో కనిపించినట్టు ఈ ప్రవాహాలు అర్ధ భూస్వామ్య సామాజికి ఆర్థిక, సాంస్కృతిక సబంధాలతో స్థిరంగా ఉంటాయి. తత్ఫలితంగా ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ విధానంలో ఉన్నటువంటి బూర్జువా తరహాలో అతుకుల బొంతలా విఫలమవుతుంది. ఏమైనప్పటికీ అది భిన్నంగా వ్యక్తమవుతుంది. పట్టణ కేంద్రాల్లో, ముఖ్యంగా మధ్యతరగతిలో, ఉన్నత వర్గాల్లో చాలా మటుకు చట్టబద్ద పాలన సర్వసాధారణం. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా సమాజంలోని అట్టడుగున ఉన్న వారికి న్యాయం స్థానిక పీడకులద్వారానే లభిస్తుంది. వారు స్థానిక పోలీసులు, పంచాయతీలలాగా ఆధునిక ‘చట్టబద్ద ప్రభుత్వానికి’ సమర్ధవంతంగా సహాయపడతారు. తరచూనే కాదు, అన్ని రకాల ప్రతీఘాతుక అమానుషమైన దారుణమైన హింసతో ఎప్పటికీ ఉండిపోతుంది. సహజంగా అది నిర్ణయాత్మక అంశం.”

మోడీ ప్రకటన నేపథ్యంలో, మోడీ ఫర్మానా ప్రకారం పట్టణ కేంద్రాల్లో కూడా చట్టబద్ద పాలన రద్దైపోయింది. పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శన నిర్వహించారని అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులపైన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. “ప్రస్తుతం జరుగున్న యుద్ధం గురించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం కూడా దాన్నే అనుసరిస్తుంది. సున్నితమైన అంతర్జాతీయ విషయాలపైన విశ్వవిద్యాలయంలో ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని అనుమతించదు” అని అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయ ప్రొక్టర్ అంటారు. అంతర్జాతీయ న్యాయం, దౌత్య స్థితి ఏమైనప్పటికీ మోడీ ట్వీట్లో ఏముందో అదే భారత దేశ విధానం. చారిత్రాత్మకమైన పాలస్తీనా విముక్తి పోరాటంతో సంబంధ బాంధవ్యాలున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు పాలస్తీనా అనుకూల ప్రదర్శన నిర్వహించినందుకు వారిని నిర్బంధించారు. భౌతికంగా కానీ, ఆన్లైన్లో కానీ పాలీస్తీనాకు అనుకూలంగా ఎవరు ప్రకటన చేసినా వారిపైన చర్యలు తీసుకోమని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు.

భారతదేశంలో జరిగే జాతివిముక్తి, వర్గపోరాటాలను అణచివేయడానికి ఇజ్రాయిల్ సహాయం చేస్తుంది కనుక ఇజ్రాయిల్ కు భారత్ మద్దతు తెలుపుతోంది. భారతదేశం 1950 నుంచి పెద్ద ఎత్తున అయుధాలు దిగుమతి చేసుకుంటోంది. ఆ ఆయుధాలలో ఎక్కువ భాగం ఇజ్రాయిల్, అమెరికా నుంచే దిగుమతి అవుతున్నాయి. “ఇజ్రాయిల్ నుంచి డ్రోన్లు, మిజైళ్ళు, సెన్సార్లు, రాడార్లు, ఎలక్ట్రో ఆప్టిక్ సిస్టమ్లకు తొలి వినియోగదారుడు భారతదేశం. ఉభయులకు ప్రయోనకరంగా ఉండేలా ఇజ్రాయిల్ పెద్ద పెద్ద ఆయుధాలు ఇస్తే, భారత దేశం 2001 నుంచి దానికి నగదును చెల్లిస్తోంది. భారత, ఇజ్రాయిల్ దేశాలకు చెందిన ఎనిమిదిమంది రక్షణరంగ ముఖ్య అధికారులు రెండు దేశాలను పరస్పరం సందర్శించారు. అంతర్గత భద్రతపైన జాతీయ భద్రతా మేధోమధనం, తీవ్రవాదంపై ప్రతి చర్యలపై సంయుక్తంగా పనిచేసే బృందాలను 2002 నుంచి ఏర్పాటు చేశారు. ఇజ్రాయిల్ లోని హైఫా నగరాన్ని భారత నౌకాదళ అధికారులు క్రమం తప్పకుండా సందర్శిస్తూ, ఇజ్రాయిల్ నౌకాదళంతో విన్యాసాలు నిర్వహిస్తారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇజ్రాయిల్ ఉద్యానవన సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘అద్భుత కేంద్రాలు’గా ప్రదర్శింస్తుంటారు. నీటి యాజమాన్యం పైన భారతదేశానికి ఇజ్రాయిల్ సలహాలిస్తూ, వృథా నీటినిర్వహణకు సంబంధించిన సాంకేతిక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. కశ్మీర్ లో నైపుణ్యం కల రెండు వ్యవసాయ కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. ఇజ్రాయిల్ భారత దేశానికి ఆయుధాలు అమ్మడంతోపాటు, ఇతర రంగాలలోకూడా ప్రవేశించడంలో భాగంగా కశ్మీర్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.” బీమా కోరెగాన్ కేసులో 16 మంది రాజకీయ ఖైదీలపైన ఉపయోగించిన పెగాసెస్ గూఢచారి వైరస్ ను, ఆకాశం నుంచి బాంబులు వేయడానికి అవసరమైన డ్రోన్లను భారతదేశం ఇజ్రాయిల్ నుంచి తెప్పించుకుంది.

కశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, అస్సామ్ ప్రజలపైన హింసను ప్రయోగించడానికి, ‘సమాధాన్ ప్రహార్’ పేరుతో మధ్య భారతదేశంలోని ఆదివాసీ రైతులపై యుద్ధాన్ని చేయడానికి ఇలాంటి అత్యాధునిక ఆయుధ సామాగ్రి భారతదేశానికి అవసరం. వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించాలనే పేరుతో చత్తీస్ గర్ లోని ఆదివాసీలపై బాంబులు వేయడానికి ఇజ్రాయిల్లో తయారైన   డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఈ మారణహెూమంలో, ప్రజలకు వ్యతిరేకంగా చేసే నేరాలలో హిందుత్వవాదులు, జియోనిస్టులు భాగస్వాములు. వీరులైన పాలస్తీనా ప్రజలు తమ జాతి విముక్తి పోరాటంలో మరొకసారి చైనత్యవంతమైన ప్రతిఘటనగా చాలా నిక్కచ్చిగా ఉన్నారు. పాలస్తీనా విషయంలో ‘రెండు దేశాల పరిష్కారం’ అనేది తమ ఆత్మస్థైర్యంతో తమ పోరాడే పీడిత జాతుల హక్కులపైన దారుణమైన వసలవచ్చి స్థిరపడిన జియోనిస్టులు చేస్తున్న ద్రోహం. ఈ ప్రాంతంలో పాలస్తీనా అనే ఒకే ఒక్క దేశంగా ఏర్పాటుకు మాత్రమే వీలుంది. ఫాసిస్టు దాడి వెలుగులో పోస్ట్ మాడరనిజం, నిష్క్రియాపరత్వం ప్రస్తుత సమస్యకు సమాధానం కాదు. వర్గపోరాటం, ప్రతిఘటనా పోరాటం మాత్రమే ప్రజలపైన యుద్ధం చేస్తూ, దోపిడీ పీడన ప్రాంతాలుగా తయారు చేస్తున్న సామ్రాజ్యవాదుల, జియోనిస్టుల, కాషాయ తీవ్రవాదాన్ని తుదముట్టించగలుగుతాయి.

Leave a Reply