తొలిచూరు
తల్లి పొత్తిళ్ళలో
బిడ్డలా ఉంది వెన్నెల

బిడ్డ కోసం తల్లి వేసే
ఊయలలా ఉంది పాలపుంత

బడి విడిచాక
కేరింతలు కొడుతూ
బయటికొచ్చే పిల్లల్లా ఉన్నాయి
చుక్కలు

బుజ్జాయిని
బజ్జోబెట్టటానికి
తల్లి పాడే జోల పాటలా
ఉంది మంద్ర గాలి

హాయి అంతా ఇక్కడే ఉంది అన్నట్టు
అమ్మ ఒడిలో నిదురబోయిన
చంటి బిడ్డ మోములా ఉంది
నింగి

పురిటి నొప్పుల బాధను
దిగమింగుతూ
గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టిన
గర్భిణిలా ఉంది రేయి

ప్రచండ కాంతి తో పుట్టే
సూర్యుడు ని ప్రపంచానికి హామి
పడుతున్నట్టుంది
పెను చీకటి…

One thought on “పెను చీకటి – ప్రచండ కాంతి

Leave a Reply