ఆదివాసీల అభివృద్ధికి, హక్కుల రక్షణ కొరకు రాజ్యాంగంలో పొందుపర్చిన ఐదవ షెడ్యూలు, ఆరవ “షెడ్యూలు – వీటి వెలుగులో ప్రత్యేకంగా తీసుకొచ్చిన పెసా చట్టం, 1/70 చట్టం ఆచరణలో నీరుగారిపోయిన ఫలితమే నేటి ఆదివాసీల దుర్భర జీవితాలు. అలాగే “నేషనల్‌ పాలసీ ఆన్‌ (టైబల్స్‌”లో గిరిజన జీవన వికాసానికి ప్రత్యేక సంస్థలు – సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐ.టి.డి.ఎ), సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు (ఐ.టి.డి.పి.), గిరిజన సహకార సంస్థలు (జి.సి.సి, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షణ – పరిశోధన కోసం “టైకార్‌” సంస్థలు దశాబ్దాలుగా రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. విద్యారంగంలో ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్నియల్‌ స్కూల్స్‌, కాలేజీలు మరియు షెడ్యూల్‌ ఏరియాల్లో ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ, పశుపోషణ, చెక్‌డ్యాముల నిర్మాణం, రవాణా సౌకర్యాల కల్పన, ఆరోగ్య పరిరక్షణ – పౌష్టికాహారం కోసం బడ్జెట్‌లో అధిక మొత్తాలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం ఆదివాసులకు వీటి ఫలితాలు అందక, అభివృద్దికి ఆమడ దూరంలోనే ఉండిపోయారు. పైగా అటవీ ప్రాంతంలోని ఖనిజాలు, కలప వంటి ప్రకృతి సంపదను కొల్లగొట్టే చర్యలకు ప్పాడ్లూ, అణచివేత చర్యలకు పూనుకొంటున్నారు. చివరకు ప్రధాన జీవనాధారమైన భూముల నుండి ఆదివాసులను తరిమివేసే దృశ్యాలను చూస్తున్నాం. అడవిలో సహజసిద్ధంగా లభించే అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆంక్షలు, తరతరాలుగా సేద్యం చేసుకుంటున్న పోడు భూములను లాక్కొనే అప్రజాస్వామిక ధోరణి కొనసాగుతోంది.

పోడు భూములకు పట్టాలిస్తామని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని స్వయంగా ముఖ్యమంత్రే అనేక బహిరంగ వేదికల్లో, సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించి ఉన్నారు. దీని కొరకు ఉన్నతస్థాయిలో సీరియస్‌ సమీక్షగాని, విధివిధానాల రూపకల్పన గానీ ఇంతవరకు రూపొందించలేదు. ఏ మేరకు అమలులోకి వచ్చాయి అనే విషయం ప్రక్కనపెడితే – మైదాన ప్రాంతాల్లో భూమి రికార్డుల ప్రక్షాళన, ధరణిపోర్టల్‌ ఏర్పాటు, సమగ్ర భూసర్వే ఏర్పాటు మొదలైన పనులు జరుగుతున్నాయి కదా! మరి పోడుభూముల సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వ శీతకన్ను ఎందుకు? చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఆదివాసీల పోడుభూములకు పట్టాలిచ్చి, వారి బతుకుల్లో వెలుగులు నింపలేమా? 2006లో యుపిఏ ప్రభుత్వం తెచ్చిన “షెడ్యూలు జాతుల మరియు ఇతర సంప్రదాయ అటవీ ఉత్పత్తుల ఆధారంగా జీవించేవారు (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం” పకడ్బందీ అమలుకు పూనుకొంటే పోడుభూముల సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు.

గ్రామసభ – డివిజన్‌ జల్లా స్తాయి కమిటీలు :

అటవీ హక్కుల చట్టం – 2006 లో 2005, “డిసెంబర్‌ 139” నాటికి సాగుచేసుకొంటున్న అటవీ భూములకు హక్కుపత్రాలు లేక పట్టాలు ఇవ్వాలని నిర్ధేశింపబడింది. ఈ తేదీ నాటికి సాగుదారులు మూడు తరాలుగా లేక 75 సంవత్సరాలుగా ఆ భూములపై లేక అటవీ ఉత్పత్తులపై\ ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళై ఉండవచ్చు. ఈ విషయాన్ని ధృవపరచడానికి పునాదిస్థాయిలో గ్రామసభ నిర్ణయం ప్రాతిపదికగా ఉంటుంది. పెసా చట్టం – 1996 ప్రకారం పంచాయితీ లేదా హబిటేషన్‌లో ఏర్పాటైన గ్రామసభ – సాగుదారుల దరఖాస్తును పరిశీలించి ఎంత విస్తీర్ణంలో ఎక్కడ సాగుచేస్నుదీ, ఎవరెవరనే మున్నగు వివరాలను మ్యాపుతో సహా నిర్ధారిస్తుంది. అటవీ భూములను సమూహంగా సాగుచేసుకొన్నచో సాగుదారులందరికి ఉమ్మడిగా అటవీహక్కులను పట్టాలిస్తారు. ఒక వేళ వ్యక్తిగంతగా సాగుచేసికొంటే వ్యకిగత హక్కు పత్రాలు పొందుతారు. ఇంకా ఈ గ్రామ సభలకు “అటవీహక్కుల చట్టం-2006” లో విస్ఫుత అధికారాలు కల్పించారు. ఆ గ్రామం లేక నివాస ప్రాంతంలో ప్రభుత్వం నెలకొల్పే పాఠశాలు, వైద్యశాలలు, అంగన్‌వాడీలు, విద్యుత్‌ లైన్లు, చెరువులు, చిన్న నీటిపారుదల కుంటలు – కాలువలు, రహదారులు, రేషన్‌షాపులు, కమ్యునిటీ కేంద్రాలు – వగైరా వానికి అటవీ భూముల కేటాయింపులకు గ్రామసభ ఆమోదము తప్పనిసరిగా ఉండాలి. అదీ – ఒక్కొక్క సౌకర్యం కోసం కేటాయించే భూమి ఒక హెక్టరుకు మించకూడదు. కేవలం సాగు చేసుకునే భూమి మాత్రమే కాకుండా సాంప్రదాయ అటవీ ఉత్పత్తులు అయిన పండ్లు, కాయలు, వేర్లు, బెషదమొక్కలు, జిగురు, చీపురుపుల్లలు, బీడిఆకులు, ఇండ్ల నిర్మాణానికి కలప లభించే భూములపై ఆదివాసులు హక్కులు పొందడానికి కూడా ప్రాథమికంగా గ్రామసభ ఆమోదం అవసరం.

ఇలా గ్రామసభ చేసిన తీర్మాణాలపై, నిర్ణయాలపై 60 రోజులలోపు ఏమైనా ఫిర్యాదులు ఉంటే సబ్‌-డివిజనల్‌ స్థాయి కమిటీకి సెక్షన్‌ ౩ ప్రకారం ఫిర్యాదు చేసుకోవాలి. ఈ కమిటీకి ఫిర్యాదు దారు తన వాదనను సమర్పించిన తరువాత మాత్రమే ఆ క్లెయింపై నిర్ణయం వెలువరించాలి. ఇలా తయారుచేసిన అటవీ హక్కుల రికార్డును జిల్లా స్థాయి అధికారికి పంపిస్తారు. సబ్‌-డివిజినల్‌ ఆఫీసర్‌ తయారు చేసిన ఈ జాబితాపై ఎవరికైనా ఫిర్యాదులుంటే 60 రోజులలోపు జిల్లా స్థాయి కమిటీ ముందుంచాలి. ఈ కమిటీ కూడా ఫిర్యాదు దారు తన వాదనను వినిపించనివ్వాలి.

తరువాత మాత్రమే ఆ ఫిర్యాదుపై నిర్ణయాన్ని వెలువరించాలి. ప్రభుత్వం నియమించిన జిల్లా స్థాయి కమిటీ అటవీ హక్కుల రికార్డును తయారు చేస్తుంది. అంతిమంగా అటవీ హక్కులకు సంబంధించి ఈ రికార్డే ఫైనల్‌.

ఈ మొతం కార్యకలాపాలను నిర్వహించడానికి “రాష్ట్ర స్థాయి పర్యవేక్షక కమిటిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. జిల్లా, డివిజన్‌, రాష్ట్ర స్థాయి కమిటీలలో రెవిన్యూ, అటవీ, గిరిజన వ్యవహారాల శాఖల నుండి ప్రభుత్వ అధికారులు మరియు పంచాయితిరాజ్‌ సంస్థల నుండి ముగ్గురు ప్రతినిధులు – ఇందులో షెడ్యూలు తెగల నుండి ఇద్దరు, ఒక మహిళ సభ్యులుగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని గిరిజన మంత్రిత్వశాఖ లేక కేంద్రప్రభుత్వం చేత ఆథరైజ్‌ చేయబడిన అధికారి అటవీహక్కుల చట్టం-2006 అమలుకు నోడల్‌ అధికారిగా బాధ్యత వహిస్తారు. చట్టం అమలుకు రూపొందించబడిన నిబంధనలు మార్చే అధికారం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులే నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తూ, కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకత్వంలో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.

అటవీ హక్కుల గుర్తింపు :

వన్యప్రాణి సంరక్షణ చట్టం – 1972 ప్రకారం మనుషులు, అటవీ జీవులు సహజీవనం సాధ్యం కాని పరిస్థితులలో లేక వన్యప్రాణుల ఉనికికే ప్రమాదముందని భావిస్తే, జాతీయ పార్కులు మరియు జంతుసంరక్షణ కేంద్రాలు ఉండే అటవీ ప్రాంతాల వారికి వేరేచోట పునరావాసం కల్పించాలని అటవీహక్కుల చట్టం-2006లోని చాష్టర్‌-3, సెక్షన్‌-4, సబ్‌సెక్షన్‌-2(బి)(సి) లో నిర్ధేశింపబడింది. ఇంకా సబ్‌సెక్షన్‌-(ఇ) ప్రకారం

పునారావాస ప్యాకేజి, తరలింపు ప్రక్రియకు గ్రామసభ ఆమోదం తప్పనిసరి. నిర్వాసితులకు భూమి కేటాయింపు, సౌకర్యాల కల్పన జరిగే వరకు ప్రత్యామ్నాయ స్థలాలకు ఎట్టి పరిస్థితులలోను తరలించవద్దని స్పష్టంగా సబ్‌సెక్షన్‌ (ఎఫ్‌) లో పేర్కొనబడింది. ఇలా వన్యప్రాణి సంరక్షణకు తీసుకోబడిన అటవీప్రాంతాన్ని ఆ తరువాత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేరే పథకానికి, పనికి కేటాయించకూడదు.

‘సెక్షన్‌-4, సబ్‌సెక్షన్‌-3 ప్రకారం షెడ్యూలు తెగలుకాని, సాంప్రదాయ అటవీ ఉత్పత్తుల సేకరణపై జీవించేవారుగాని డిసెంబర్‌ 13, 2005 రోజు వరకు ఆ భూమిలో సాగు లేక ఇతర ఉపయోగాలకు గాని ఆధీనంలో ఉండిన అటవీ భూమికి హక్కు పత్రాలు సామూహికంగా కాని, వ్యక్తిగతంగా కాని ఇవ్వాలి.

ముఖ్యంగా సెక్షన్‌-5 ప్రకారం క్లెయిం చేసుకున్న అటవీ భూములపై హక్కులను ఖరారు చేసే క్రమంలో గుర్తింపు మరియు వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తిగా ముగిసేవరకు ఎట్టి పరిస్థితులలో అప్పటివరకు ఆధీనంలో యున్న అటవీ భూముల నుండి ఎవరినీ ఖాళీ చేయించరాదు.

హక్కుల నిర్ధారణకు సాక్ష్యాలు/ఆధారాలు :

హక్కుపత్రాలు (పట్టాలు) జారీ చేయడానికి ఆ భూమి లేక వనరుపై హక్కులను నిర్ధారించడానికి, వ్యక్తిగత, సామూహిక క్లెయిమ్స్‌లో 15 రకాల ఆధారాలను కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ విడుదల చేసిన జనవరి 1, 2018 నోటిఫికేషన్‌లో సెక్షన్‌-18లో పొందుపరచింది. వ్యక్తిగత క్లెయిమ్స్‌దారులు, ప్రభుత్వ రికార్డులు, జనాభా లెక్కలు, అటవీ విచారణ నివేదికలు, ప్రభుత్వ కమిటీలు / కమీషన్ల నివేదికలు- తీర్మానాలు, ఏమైనా జి.ఓ.లు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, ఇంటిపన్ను భూమికి సంబంధించిన మ్యాపు లాంటివి, ఐడెంటిటీ కార్డు మొ!॥వి.

నిర్మాణం చేసిన ఇల్లు, గుడిసె, భూమికి / వ్యక్తికి సంబంధించిన కోర్టు తీర్పులు, పురావస్తుశాఖ వారి సర్వే ఆఫ్‌ ఇండియా పరిశోధన రికార్డు, పూర్వపు ప్రిన్స్‌లీ స్టేట్స్‌ జారీచేసినవి ఏమైనా – హక్కు దానం, బహుమాన పత్రాలు, పూర్వీకుల స్మశానవాటికలు, పవిత్రపూజా స్థలాలు, పూర్వీకుల జీన్స్‌తో సరిపోల్చుకునే జీనాలజీ ట్రేసింగ్‌, గ్రామ/తవాస పెద్ద మనుషుల స్టేట్‌మెంట్లు మొ॥॥వి వ్యక్తిగత / సామూహిక హక్కుల పత్రం జారీకి కావలసిన ఆధారాలు.

సామూహికంగా అటవీ ఉత్పత్తులు, వనరులపై హక్కుల నిర్ధారణకు కావలసిన ఆధారాలు – పశువుల మేత ప్రదేశాలు, దుంపలు, వేర్లు, అటవీనూనె తయారీ కొరకు పండ్లు, చేపల గుంటలు, నీటిపారుదల పద్దతి, నీటి వసతి, బెషద మొక్కలు మున్నగునవి. ఇంకా స్థానిక తెగలు నిర్మించుకున్న నిర్మాణాల అవశేషాలు, పవిత్ర పూజా వృక్షాలు, తోపులు, నీటి గుంటలు, స్మశాన చిహ్నాలు కూడా ఆధారాలుగా చూపించవచ్చు.

గ్రామకంఠంగా గతంలో గుర్తించిన ప్రభుత్వ రికార్డులు ఏమైనా, లేక రక్షిత అడవిగా గతంలో ఏమైనా ఉంటే ఆ రికార్డు, గతంలోకాని, ప్రస్తుతం కాని సాంప్రదాయ వ్యవసాయ సాగు పద్దతులు (ఉదా॥ పోడు) లాంటివి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి.

గ్రామ సభగాని, సబ్‌డివిజినల్‌ స్థాయి లేక జిల్లా స్థాయి కమిటీలు పై ఆధారాలలో ఒకటి కంటే ఎక్కువ ఎన్నైనను ఆధారాలుగా హక్కుల నిర్ధారణకు పరిగణించవచ్చు.

సుప్రీం కోర్టులో కేసు – ఖాళీ చేయించడం నిలిపివేత :

2008 సంవత్సరంలో “వైల్డ్‌లైఫ్‌ ఫస్ట్‌, “నేచర్‌ కన్షర్వేషన్‌ సొసైటీ”, “టైగర్‌ రిసెర్చ్‌ & కన్దర్వేషన్‌ ట్రస్ట్‌” – అనే స్వచ్చంద సంస్థలు అటవీహక్కుల చట్టం-2006 ఆధారంగా అడవుల విస్తీర్ణం తగ్గిపోతుందని, అర్హులు కాని వారికి బోగస్‌ క్లెయిమ్‌ల ద్వారా నేషనల్‌ పార్కులు, జంతుసంరక్షణ అభయారణ్యాలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని సుప్రీంకోర్టులో పిటీషన్‌ (109/2008) దాఖలు చేసారు. సెప్టెంబర్‌ 2018 నాటికి 72,28,182 హెక్టార్లు భూమిని 18,89,885 పట్టాలుగా పంపిణీ చేసారని, అలాగే 19,34,345 దరఖాస్తులను తిరస్కరించారని వీనిలో 14,77,793 దరఖాస్తులు గ్రామసభ స్థాయిలోనే తిరస్మరింపబడ్డాయని పిటీషన్‌లో పేర్కొన్నారు. తిరస్మరింపబడిన 19 లక్షల పైచిలుకు దరఖాస్తు దారుల ఆధీనంలో ఎంత భూమి ఉంది అనే విషయం మాత్రం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. ఈ మంత్రిత్వ శాఖ ద్వారా నియమింపబడిన సక్సేనా కమిటీ, మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన మరో కమిటీ, గుజరాత్‌ ప్రభుత్వం వేసిన భాస్కరాచార్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ – సంస్థలు ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి 2005 డిసెంబర్‌ 18, కటాఫ్‌ డేట్‌ తరువాత అడవుల ఆక్రమణను గుర్తించారు కావున అడవులు, జంతువుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని పిటీషన్‌లో కోరియున్నారు.

మార్చి 3, 2108న జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ ధర్మాసనం ఈ కేసును విచారించింది. 31 డిసెంబర్‌ 2017 తేదీని కటాఫ్‌ డేట్‌గా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అటవీహక్కుల చట్టం-2006 ప్రకారం దరఖాస్తుదారుల సంఖ్య, తిరస్మరింపబడిన వాటి సంఖ్య – అందులో భూమి విస్తీర్ణం, వీరిని ఆ భూమి కబ్టా నుండి ఖాళీ చేయించారా ? అలా చేయించని వారి భూమి విస్తీర్ణ్మమెంత ? మొదలగు వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. 29 జనవరి 2019న జస్టిస్‌ చలమేశ్వర్‌ ధర్మాసనం ముందుకు వచ్చిన ఈ కేసు విచారణ సందర్భంగా అడిషినల్‌ సాలిసిటర్‌ జనరల్స్‌ తిరస్మరింపబడిన దరఖాస్తుదారుల నుండి భూమిని ఆయా ప్రభుత్వాలు స్వాధీనపరచుకొనుట కోసం, వారిని ఖాళీ చేయించే చర్యలు చేపట్టవలసి ఉంటుందని తెలిపారు. దీనికి స్పందించిన కోర్టు దాదాపు జస్టిస్‌ మదన్‌లోకూర్‌ ఆదేశించినట్లుగానే, దరఖాస్తుదారుల సంఖ్య, తిరస్కరింపబడినవి, వీనిలో భూమి విస్తీర్ణం, ఖాళీ చేయించడానికి ఏ చర్యలు తీసుకున్నారు – మున్నగు వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్‌ దాఖలు చేయాలని 2 వారాలకు కేసును వాయిదా వేసింది.

13 ఫిబ్రవరి 2019న జస్టీస్‌ అరుణ్‌మిత్రా ధర్మాసనం ఆదేశాలతో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. 17 రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం 11,91,327 క్లెయిమ్స్‌ను తిరస్మరించామని చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తిరస్కరించిన క్లెయిమ్‌దారులను వారు సాగు చేసుకుంటున్న అటవీ భూముల నుండి వారంలోపు ఖాళీ చేయించాలనే కోర్టు ఆదేశాలు షాక్‌కు గురిచేసాయి. పెండింగ్‌ దరఖాస్తులపై నాలుగు నెలలలోపు చర్యలు తీసుకోవాలని, “ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియాతో ఉపగ్రహ సర్వే చేయించి అటవీ భూమల కబ్బాల విస్తీర్ణమును, అలాగే ఖాళీ అనంతర భూమి విస్తీర్ణమును తెలియజేస్తూ 12 జులై 2019 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అఫిడవిట్‌ దాఖలు చేయాలని, కేసును 24 జులై 2019కి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

“ఖాళీ” నిలుపుదల ఉత్తర్వులు :

2019 సాధారణ ఎన్నికల సందర్భంలో వెలువడిన ఈ తీర్చు వలన ఆదివాసీల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ప్రమాదమున్నదని, ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి, ఈ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. అంతే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు – బీహార్‌, చత్తీస్‌ఘడ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లు – ఇంకా అనేక ఆదివాసి, హక్కుల సంస్థలు కూడా సుప్రీంకోర్టులో “స్టే” ఇవ్వాలని కోరుతూ ఇంప్లీడ్‌ పిటీషన్లు వేసారు. లక్షలాది కుటుంబాల మనుగడపై ప్రభావం చూపే ఫిబ్రవరి 13న తానే జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు, అదే ధర్మాసనం ఫిబ్రవరి 28, 2019న ఆదేశాలు జారీచేసింది. ఈ ఉపశమన చర్యతో ఓట్ల ప్రయోజనం కొరకు ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం, రాష్ట్రాలు ఒకవైపు – ఆదివాసీలు తమ బతుకుల కొరకు మరోవైపు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ తరువాత ఈ కేసు విచారణకు వచ్చినా “స్టే” మాత్రం కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో అటవీహక్కుల చట్టం-2006 అమలు :

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 42.92 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 37.75 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయి. తెలంగాణలో మార్చి 31, 2019 నాటికి ఇందులో వ్యక్తిగతంగా 93,639 మందికి 3.02 లక్షల ఎకరాలు, సామూహికంగా 721 గ్రూపులకు 4.54 లక్షల ఎకరాలకు మొత్తంగా 7.54 లక్షల ఎకరాలకు టైటిల్స్‌ (పట్టాలు) ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా, సామూహికంగా దరఖాస్తు చేసుకొన్న క్లెయిమ్స్‌ మొత్తం 1,86,679లో 88,757 క్లెయిమ్స్‌ను తిరస్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 31, 2019 నాటికి వ్యక్తిగతంగా 96,675 మందికి 2.40 లక్షల ఎకరాలు, సామూహికంగా 1,374 గ్రూపులకు 453 లక్షల ఎకరాలకు టైటిల్‌ (పట్టాలు) ఇచ్చారు. వ్యక్తిగతంగా, సామూహికంగా దరఖాస్తు చేసుకున్న క్లెయిమ్స్‌ మొత్తం 1,81,508లో 75,927 క్లెయిమ్స్‌ను తిరస్కరించారు.

అటవీహక్కుల చట్టం-2006 అవగాహనను అక్షర జ్ఞానం లేని ఆదివాసీలకు కల్పించడానికి రెండు రాష్ట్రాలలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అనేక రూపాలలో పోరాటాలు చేసినా ఫలితం మాత్రం అంతంత మాత్రమే. ప్రభుత్వ నిర్జక్ష్యం, నిర్లిప్తత కారణంగా ఆదివాసీల జీవితాలు సంక్షోభంలోకి నెట్టబడ్డాయి.

“షెడ్యూలు ప్రాంతాలలో పెద్దఎత్తున అటవీ, పోలీసు శాఖల అధికారులు దాడులు చేసి పోడు భూముల్లో ట్రెంచులు (కందకాలు) తవ్వి, హరితహారం పేరుతో ఆదివాసీలను నిరాశ్రయలు చేస్తున్నారు. హత్యాయత్నంతో సహా అనేక సెక్షన్ల క్రింద అక్రమ కేసులు బనాయించి స్త్రీలతో సహా వందలాది ప్రజలను జైళ్ళకు పంపిస్తున్నారు. 2005 డిసెంబర్‌కు పూర్వమే గత ప్రభుత్వాలు ఆ భూములపై ఇచ్చిన బి1 పట్టా కాగితాలు, రెవిన్యూశాఖ రికార్డులు, రశీదులు మొదలైన ఆధారాలు చూపించినా – అటవీశాఖ రికార్డులో ఆ భూములు ఫారెస్టు డిపార్టుమెంట్‌కే చెందినట్లుగా ఉన్నవని చెప్పి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. అటవీహక్కుల చట్టం-2006, 2007 రూల్స్‌ ప్రకారం సెక్షన్‌ 13లో పేర్కొన్నట్లు హక్కుల నిర్ధారణకు ఆధారాలు రైతులు చూపించినా, లెక్క చేయకుండా భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. అదే విధంగా తిరస్మరించిన, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ భూములపై కోర్టు స్టే అమలులో ఉన్నా, ధిక్కరిస్తూ ఖాళీల పర్వం కొనసాగుతోంది. 2007లో చట్టం వచ్చిన విషయం గాని, పట్టాల కొరకు దరఖాస్తు చేసుకోవాలనే సంగతి కాని, ఏమీ తెలియని ఆదివాసీలు, తరతరాలుగా ఆ భూముల్లో సాగుచేసుకొంటున్నా హక్కుల పత్రాలు పొందలేక ప్రభుత్వ దాష్టీకానికి గురవుతున్నారు. చట్టప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికిని 90 శాతం ఆదివాసీలు లక్షలాది ఎకరాల అటవీ భూములకు హక్కు పత్రాలు పొందలేకపోవడం అత్యంత విషాదకరం.

నిర్దిష్టంగా ఏమిచేయాలంటే.. :

1). ప్రధానంగా చట్టంపట్ల విస్తృత అవగాహన పెంచాలి. పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి.

2). ఫారెస్టు, రెవెన్యూ, ట్రైబల్‌ శాఖలు సమన్వయంతో చట్టం అమలుకు టైమ్‌బౌండ్‌ ప్రోగ్రాంతో రోడ్‌మ్యాప్‌ రూపొందించుకోవాలి.

3). చట్టంలోని నిబంధన 6(1) ప్రకారము దరఖాస్తు ఫారాలు ఎ,బి,సి నమూనాలు వేర్వేరుగా వ్యక్తిగత, సామూహిక, అటవీవనరులు ఉత్పత్తుల హక్కుల కోసం క్లెయిమ్‌ చేసుకోవడానికి అసంఖ్యాకంగా అందుబాటులో ఉంచాలి.

4).  రెవెన్యూ, గిరిజన సంక్షేమ, అటవీ, పంచాయితీరాజ్‌ శాఖల కార్యదర్శులు, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్దర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, గిరిజన సలహామండలి నుండి ముగ్గురు ఎస్‌.టి. సభ్యులు – సభ్యులుగా, గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్‌ మెంబర్‌ సెక్రటరీగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా “రాష్ట్ర స్థాయి మానిటరింగ్‌ కమిటొని నియమించాలి.

5). ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులే నోడల్‌ ఆఫీసర్లుగా మొత్తంగా చట్టం అమలుకు కేంద్రబిందువుగా, చొరవతో పనిచేయాలి.

6) అటవీ భూములు, అటవీ ఉత్పత్తుల వనరుల లభ్యతకు సంబంధించిన సమస్త సమాచారాన్ని – రికార్డులు – మ్యాపులు – కోర్టు తీర్పులు, వివిధ శాఖల – పథకాల వివరాలు వ్యక్తులకు, గ్రామ, డివిజన్‌, జిల్లా స్థాయి కమిటీలకు అందుబాటులో ఉంచాలి.

7 ఎప్పటికప్పుడు క్లెయిమ్స్‌ను పరిశీలించి హక్కు పత్రాలు (పట్టాలు) ఇస్తూ, ఆదివాసులలో విశ్వాసం పెంపొందించాలి.

Leave a Reply